»   » 'ఖైదీ' టైటిల్ రామ్ చరణ్ కోసం కాదు...ఆ యంగ్ హీరో కోసం

'ఖైదీ' టైటిల్ రామ్ చరణ్ కోసం కాదు...ఆ యంగ్ హీరో కోసం

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ నిర్మాత అచ్చి రెడ్డి రీసెంట్ గా ఖైదీ టైటిల్ ని తమ బ్యానర్ పై రిజిస్టర్ చేయించారు. దాంతో అంతా అచ్చి రెడ్డి నిర్మాతగా రామ్ చరణ్ హీరోగా సినిమా ప్రారంభం కానుందని ఊహాగానాలు చేసారు. అయితే అది నిజం కాదంటున్నారు పరిశ్రమ వర్గీయులు. ఆ టైటిల్ ని సాయి కుమార్ కొడుకు ఆది కోసం అని చెప్తున్నారు. ఆదితో ప్రేమే కావాలి చిత్రం నిర్మించిన అచ్చిరెడ్డి అతని తదుపరి చిత్రం కూడా నిర్మించే ఆలోచనలో ఉన్నాట్ట. ఆర్.ఆర్.మూవి మేకర్స్ వెంకట్ ఎలాగయినా ఆదికి లైఫ్ ఇవ్వాలని అచ్చిరెడ్డితో మరో చిత్రం తీయించి హిట్ కొట్టించాలని ఆలోచనలో ఉన్నాడని సమాచారం. గతంలోనూ ఆది తండ్రి సాయి కుమార్ కి ఆర్.ఆర్.మూవీ మేకర్స్ లో సామాన్యుడు చిత్రంతో హిట్ ఇచ్చారు.ఆ చిత్రంలో హీరో జగపతిబాబే అయినా సాయికే మంచి పేరు వచ్చి ఆ తర్వాత ప్రస్దానం వంటి చిత్రాల్లో లీడ్ రోల్ చేసే అవకాశం వచ్చింది. అందుకే ఖైదీ టైటిల్ తో హిట్ కొట్టాలని నిర్ణయించుకున్నట్లు తగిన దర్శకుడుకోసం చూస్తున్నట్లు వినికిడి.

English summary
It is reported that producer Achi reddy registered the title Khaidi with film chamber and every one thought that Ram Charan will play the lead role in the film. But the latest news says that Aadi (son of Sai Kumar) of Prema Kavali hero is going to do this film for Achi reddy.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu