»   » ‘ఖాకీ’ అఫీషియల్ టీజర్, కార్తి అదరగొట్టేసెలా ఉన్నాడే...

‘ఖాకీ’ అఫీషియల్ టీజర్, కార్తి అదరగొట్టేసెలా ఉన్నాడే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

కార్తీ, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ జంటగా నటించిన తమిళ సినిమా 'ధీరన్‌ అదిగారమ్‌ ఒండ్రు'ను తెలుగులో 'ఖాకీ' పేరుతో విడుదల చేయబోతున్నారు. ద పవర్‌ ఆఫ్‌ పోలీస్‌'... అనేది ఉపశీర్షిక. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి తెలుగు టీజర్ విడుదల చేశారు. టీజర్ చూస్తుంటే కార్తి పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్‌తో అదిరిపోయేలా ఉంది.

వినోద్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్‌ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్స్‌ జరుగుతున్నాయి. అతి త్వరలో ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. 'ఆదిత్య మ్యూజిక్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌' సంస్థ అధినేత ఉమేశ్‌ గుప్తా ఈ సినిమా ద్వారా తొలిసారిగా చిత్ర నిర్మాణంలోకి ప్రవేశించారు. 'ఖాకీ' సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నారు.

ఉమేశ్‌ గుప్తా మాట్లాడుతూ- ''ఇందులో కార్తీ పవర్‌ఫుల్‌ పోలీసాఫీసర్‌గా కనిపించనున్నారు. లుక్స్, ఫిజిక్‌ పరంగా ఆయన చాలా కేర్‌ తీసుకున్నారు. 2005లో ఓ పత్రికలో వచ్చిన వాస్తవ సంఘటన ఆధారంగా దర్శకుడు హెచ్‌. వినోద్‌ అద్భుతమైన కథను సిద్ధం చేశారు. కథ వినగానే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించాలని సినిమా రైట్స్‌ తీసుకున్నట్లు తెలిపారు.

తెలుగులో 'రన్‌ రాజా రన్‌', 'జిల్‌', 'బాబు బంగారం', 'హైపర్‌' తదితర చిత్రాలకు అద్భుతమైన సంగీతమందించిన జిబ్రాన్‌ ఈ సినిమాకూ సూపర్‌ హిట్‌ మ్యూజిక్‌ ఇచ్చారు. అతి త్వరలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.

అభిమన్యు సింగ్, బోస్‌ వెంకట్, స్కార్లెట్‌ మెల్లిష్‌ విల్సన్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సత్యన్‌ సూరన్, ఆర్ట్‌: కె. ఖదీర్, ఎడిటర్‌: శివనందీశ్వరన్, ఫైట్స్‌: దిలీప్‌ సుబ్బరాయన్, డ్యాన్స్‌: బృంద, నిర్మాతలు: ఉమేశ్‌ గుప్తా, సుభాష్‌ గుప్తా.

English summary
Khakee (The Power Of Police) Official Teaser released. Starring Karthi & Rakul Preet, Movie Directed By H.Vinoth, Music Composed by Ghibran and Movie Produced by Umesh Gupta & Subash Gupta Under The Banner Of Aditya Music India Pvt.Ltd.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu