»   » కార్తీ, రకుల్‌ జంటగా ‘ఖాకి - ది పవర్ ఆఫ్ పోలీస్' త్వరలో

కార్తీ, రకుల్‌ జంటగా ‘ఖాకి - ది పవర్ ఆఫ్ పోలీస్' త్వరలో

Posted By:
Subscribe to Filmibeat Telugu

రెండు దశాబ్దాలకు పైగా ఆడియో రంగంలో అగ్రగామిగా కొనసాగుతున్న సంస్థ 'ఆదిత్య మ్యూజిక్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌'. ఈ సంస్థ అధినేత ఉమేశ్‌ గుప్తా. ఎన్నో బ్లాక్‌బస్టర్‌ సినిమాల సంగీతాన్ని విడుదల చేసి సంగీత ప్రపంచంలో, శ్రోతల మదిలో సముచిత స్థానాన్ని సంపాదించుకుందీ సంస్థ.

రెండున్నర దశాబ్దాలు సినిమా రంగాన్ని అతి దగ్గరగా పరిశీలించిన అనుభవంతో 'ఆదిత్య మ్యూజిక్‌' ఉమేశ్‌గుప్తా తొలిసారిగా చిత్ర నిర్మాణంలోకి ప్రవేశించారు. అందులో భాగంగా కార్తీ, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ జంటగా నటించిన తమిళ సినిమా 'ధీరన్‌ అదిగారమ్‌ ఒండ్రు'ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.

Khaki: Karthi to Show the Power of Police

ఈ సినిమాను తెలుగులో 'ఖాకి'గా విడుదల చేస్తున్నారు ఉమేశ్‌ గుప్తా. 'ద పవర్‌ ఆఫ్‌ పోలీస్‌'... అనేది ఉపశీర్షిక. సూపర్‌ హిట్‌ తమిళ సినిమా 'చతురంగ వేటై్ట' ఫేమ్‌ హెచ్‌. వినోద్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్‌ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్స్‌ జరుగుతున్నాయి. అతి త్వరలో ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు.

ఈ సందర్భంగా 'ఆదిత్య మ్యూజిక్‌' సంస్థ అధినేత ఉమేశ్‌ గుప్తా మాట్లాడుతూ- ''ఇందులో కార్తీ పవర్‌ఫుల్‌ పోలీసాఫీసర్‌గా కనిపించనున్నారు. లుక్స్, ఫిజిక్‌ పరంగా ఆయన చాలా కేర్‌ తీసుకున్నారు. 2005లో ఓ పత్రికలో వచ్చిన వాస్తవ సంఘటన ఆధారంగా దర్శకుడు హెచ్‌. వినోద్‌ అద్భుతమైన కథను సిద్ధం చేశారు. కథ వినగానే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించాలని సినిమా రైట్స్‌ తీసుకున్నా. తెలుగులో 'రన్‌ రాజా రన్‌', 'జిల్‌', 'బాబు బంగారం', 'హైపర్‌' తదితర చిత్రాలకు అద్భుతమైన సంగీతమందించిన జిబ్రాన్‌ ఈ సినిమాకూ సూపర్‌ హిట్‌ మ్యూజిక్‌ ఇచ్చారు. అతి త్వరలో టీజర్ ను, పాటలను , చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అన్నారు.

అభిమన్యు సింగ్, బోస్‌ వెంకట్, స్కార్లెట్‌ మెల్లిష్‌ విల్సన్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సత్యన్‌ సూరన్, ఆర్ట్‌: కె. ఖదీర్, ఎడిటర్‌: శివనందీశ్వరన్, ఫైట్స్‌: దిలీప్‌ సుబ్బరాయన్, డ్యాన్స్‌: బృంద, నిర్మాతలు: ఉమేశ్‌ గుప్తా, సుభాష్‌ గుప్తా.

English summary
Leading Music Label, Aditya Music is foraying into Film Production and their maiden production venture on their Aditya Music India Pvt Ltd is Karthi and Rakul Preet Singh starring Khaki which comes with the caption, 'The Power of Police'.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu