»   »  'నాన్నకు ప్రేమతో' గురించి ఖుష్భూ షాకింగ్ గా..

'నాన్నకు ప్రేమతో' గురించి ఖుష్భూ షాకింగ్ గా..

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ అవుతున్నఎన్టీఆర్ సినిమా 'నాన్నకు ప్రేమతో'. ఈ సినిమా ని ఇక్కడ ఎన్టీఆర్ అభిమానులు, సినీ లవర్స్ ఎదురుచూడటంలో ఆశ్చర్యం లేదు. అయితే తమిళంలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలిగి, ఇప్పుడు రాజకీయాల్లో తనదైన ముద్ర చూపుతూ ముందుకు వెళ్తున్న ఖుష్బూ సైతం ఆసక్తిని కనపరుస్తూ ట్వీట్ చేయటం ఇప్పుడు అందరినీషాక్ కు గురి చేస్తోంది.

కుష్భూ గతంలో ఎన్టీఆర్ చిత్రం యమదొంగలో మోహన్ బాబు సరసన నటించి మెప్పించింది. ఎవరైనా నన్ను తెలుగు రాష్ట్రాల నుండి ఎవరు ఇష్టం అని అడిగేతే వారికి, నేను ఎన్టీఆర్ కు డై హార్డ్ ఫ్యాన్ అని, తన సినిమాను మిస్ అవ్వకుండా చూస్తానని, అని చేసిన ట్వీట్ ని ఇక్కడ చూడండి.యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని హాలివుడ్ స్థాయిలో చుపించబోతున్న సినిమా నాన్నకు ప్రేమతో. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉంది. ఎన్టీఆర్, రకుల్ మీద లాంగ్ షూట్ చేసిన సుకుమార్ ప్రస్తుతం ప్యాచ్ వర్క్ ఫినిష్ చేసే పనిలో ఉన్నారు.


Khusbu excited about NTR’s Nannaku Prematho

దాంతో ఈ రోజు మాగ్జిమం లాస్ట్ సాంగ్ ఫినిష్ చేసి,షూటింగ్ కు గుమ్మిడికాయ కొట్టేస్తారు. మరో ప్రక్క దేవిశ్రీప్రసాద్ ఏడవ తేది నాటికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఫినిష్ చేస్తారు. జనవరి 8న సెన్సార్ ఫార్మాలిటీస్ ఫినిష్ చేస్తారు. అనుకున్నది అనుకున్నట్లు జరిపి జనవరి 13న విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.


ఈ సినిమా ఆడియో ఇప్పటికే విడుదలైన సంగతి తెలిసిందే. దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలే ప్రతి చోట వినబడుతున్నాయి. సంక్రాంతి బరిలో ముందుగా జనవరి 13న వస్తున్న ఈ సినిమా ఏ మేరకు విజయం సాదిస్తుందో చూడాలి. సుకుమార్ తన మార్క్ చూపిస్తాడని అభిమానులు ఎదురుచూస్తున్నారు.


ఎన్టీఆర్‌ సరసన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ భారీ చిత్రంలో జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, రాజీవ్‌ కనకాల, అవసరాల శ్రీనివాస్‌, సితార, అమిత్‌, తాగుబోతు రమేష్‌, గిరి, నవీన్‌ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, ఫోటోగ్రఫీ: విజయ్‌ చక్రవర్తి, ఆర్ట్‌: రవీందర్‌, ఫైట్స్‌: పీటర్‌ హెయిన్స్‌, ఎడిటింగ్‌: నవీన్‌ నూలి, పాటలు: చంద్రబోస్‌, డాన్స్‌: రాజు సుందరం, శేఖర్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: సుధీర్‌, నిర్మాత: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సుకుమార్‌.
English summary
Kushboo wrote, “For all those who ask from AP n Telangana..I m a die hard #Jr.NTR fan..hardly miss his films except a few..watch it as n wen time permits.”
Please Wait while comments are loading...