»   » ద్రాక్ష పుల్లగా మారిందా, ఆ పుకార్లేమిటి: శ్రుతిహాసన్‌పై భగ్గుమన్న ఖుష్పూ

ద్రాక్ష పుల్లగా మారిందా, ఆ పుకార్లేమిటి: శ్రుతిహాసన్‌పై భగ్గుమన్న ఖుష్పూ

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: హీరోయిన్ శ్రుతిహాసన్‌పై సీనియర్‌ నటి ఖుష్బూ పేరు ప్రస్తావించకుండా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె ఆగ్రహం శ్రుతిహాసన్‌ మీదనే అనేది తెలిసిపోతోంది. 'సంఘమిత్ర' సినిమాపై పలువురు అవాస్తవాలతో కూడిన పుకార్లను సృష్టిస్తున్నారని ఆమె ట్విట్టర్‌లో ప్రస్తావించారు.

దేశంలోనే అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రంగా 'సంఘమిత్ర'పై హైప్ క్రియేట్ అయింది. ఇటీవల కేన్స్‌ చిత్రోత్సవాల్లో ఈ సినిమాను ప్రారంభించారు. సుమారుర రూ.400 కోట్ల వ్యయంతో తేనాండాల్‌ ఫిలిమ్స్‌ దీనిని నిర్మిస్తున్నట్లు సమాచారం.

జయంరవి, ఆర్య కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఏఆర్‌ రెహ్మాన్‌ సంగీతం సమకూర్చుతున్నారు. సుందర్‌.సి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో కథానాయికగా తొలుతగా శ్రుతిహాసన్‌ను ఎంచుకున్నారు. కొన్ని కారణాలతో ఆమె ఆ సినిమా నుంచి తప్పుకున్నారు.

మాట్లాడడానికి నిరాకరంచారు...

మాట్లాడడానికి నిరాకరంచారు...

తాను తప్పుకున్న తర్వాత శ్రుతిహాసన్‌ మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చినప్పటికీ ‘సంఘమిత్ర' గురించి మాట్లాడటానికి నిరాకరించారు. దాన్ని ముగిసిన కథగా కొట్టిపారేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో నటి ఖుష్బూ తాజాగా ట్విట్టర్‌లో స్పందించారు. దేశంలోనే ఇదివరకు లేని విధంగా భారీ బడ్జెట్‌తో సంఘమిత్రను తెరకెక్కిస్తున్నామని చెప్పారు.

Shruti Hassan Teaching Life Truths | Filmibeat Telugu
పథకం లేకుండా సాధ్యం కాదు...

పథకం లేకుండా సాధ్యం కాదు...

సరైన ప్రణాళిక లేకుండా సంఘమిత్ర సినిమాను రూపొందించడం సాధ్యం కాదని, అయితే ఈ చిత్రం స్క్రిప్ట్‌ ఇంకా సిద్ధం కాలేదని కొందరు అవాస్తవాలు చెబుతున్నారని ఖుష్బూ అన్నారు. నిజానికి ఈ సినిమాకు సంబంధించిన పనులు రెండేళ్ల క్రితమే ప్రారంభమైనట్లు తెలిపారు.

అంకిత భావం లేనివారికి...

అంకిత భావం లేనివారికి...

వృత్తిపై అంకితభావం లేని వారికి ఆ విషయాలు ఏ మాత్రం తెలియవని, ఈ సినిమాకు చిత్రీకరణ 30 శాతం మాత్రమే ఉంటుందని, అంతకు ముందుగానే మిగిలిన 70 శాతం పనులు పూర్తయ్యాయని ఖుష్బూ వివరించారు. మీలో తప్పులు పెట్టుకుని ఇతరులపై నిందలు వేయకూడదని అన్నారు.

పుల్లగా మారిపోయిందా..

పుల్లగా మారిపోయిందా..

ద్రాక్ష పుల్లగా మారిపోయిందా? ఖుష్బూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన మీ నుంచి వృత్తి గౌరవాన్ని ఎదురుచూస్తున్నానని, మీ తప్పులను మీరు అర్థం చేసుకుంటే.. అది మీ సుదూర ప్రయాణానికి సహకరిస్తుందని అన్నారు. ఈ వ్యాఖ్యలు శ్రుతిహాసన్‌ను ఉద్దేశించే అన్నట్లు చెబుతున్నారు.

English summary
Senior actress Khushboo expressed anguish at another actress Shruthi Hassan on Sangha Mira movie issue.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu