Kushboo: అది మానవాళికి, స్త్రీ జాతికి అవమానం.. ఎమోషనల్​గా​ ఖుష్భూ ట్వీట్​

ఒకప్పటి స్టార్ హీరోయిన్​, నటి ఖుష్బూ అంటే తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. వెంకటేష్​ నటించిన కలియుగ పాండవులు సినిమాతో టాలీవుడ్​కు హీరోయిన్​గా పరిచయమైన ఖుష్బూ ఆ తర్వాత కాలంలో తమిళంలో స్టార్​డమ్​ సంపాదించుకున్నారు. అనంతరం దర్శకుడు సుందర్​ను పెళ్లి చేసుకున్న ఖుష్భూ కొన్ని ఏళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉండి, ప్రస్తుతం తమిళ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. అప్పుడప్పుడు పలు పాత్రలు పోషిస్తూ అలరిస్తున్నారు. అయితే తాజాగా 'బిల్కిస్​ బానో' గ్యాంగ్​ రేప్ నిందితులను విడుదల చేయడంపై ఖుష్బూ ఎమోషనల్​గా స్పందించారు.

విక్టరీ వెంకటేష్​తో జోడీ కట్టిన ఖుష్బూ కలియుగ పాండవులు సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. అతి తక్కువ కాలంలో స్టార్​ హీరోయిన్​గా చక్రం తిప్పిన ఖష్బూ చిరంజీవి, నాగార్జున వంటి తదితర స్టార్​ హీరోలతో ఆడిపాడారు. తెలుగులోను ఏ స్పెషల్​ ఇమేజ్​ను క్రియేట్ చేసుకున్నారు.

గుడి కట్టిన ఫ్యాన్స్​..

గుడి కట్టిన ఫ్యాన్స్​..

వరుస సిమాలు చేస్తూ అతి తక్కువ కాలంలోనే దక్షిణాది స్టార్​ హీరోయిన్​గా ఒక వెలుగు వెలిగారు. ఇదిలా ఉంటే కోలీవుడ్​లో ఆమెకున్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఆమెను ఎంతగానే ఆరాధించే ఖుష్బూ ఫ్యాన్స్ ఆమె కోసం ఏకంగా గుడి కట్టించారు.

 ఎన్నికల్లో ఓటమి..

ఎన్నికల్లో ఓటమి..

దీంతో తమిళనాడులో గుడి కలిగిన తొలి హీరోయిన్​గా ఖుష్బూ రికార్డు సాధించారు. ఇక ఈ మధ్య తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్స్​లో పోటీ చేసి ఓడిపోయారు. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్​గా ఉండే ఖుష్బూ సామాజిక అంశాలపై, ప్రభుత్వ విధానాలపై మాట్లాడుతుంటారు.

 స్వేచ్ఛగా తిరగకూడదు..

స్వేచ్ఛగా తిరగకూడదు..

తాజాగా బిల్కిస్​ బానో గ్యాంగ్​ రేప్​ నిందితులను ప్రభుత్వం విడిచిపెట్టడంపై ఖుష్బూ స్పందించారు. ''అత్యాచారం, దాడి, క్రూరత్వానికి బలి అయిన ఓ మహిళా తనకు జీవితంలో న్యాయం జరుగుతుందా? అని భయపడుతూనే ఉంటుంది. నిజానికి అత్యాచారం చేసిన వారిలో ఏ ఒక్కరిని విడిచిపెట్టకూడదు, బయట స్వేచ్ఛగా తిరగనివ్వకూడదు.

మాతృమూర్తికి అవమానం..

మాతృమూర్తికి అవమానం..

ఒకవేళ అలా జరిగితే, మానవాళికి, స్త్రీ జాతికి అవమానం. బిల్కిస్​ బానోకు కానీ, ఇంకా ఏ మహిళకైనా అయినా సరే రాజకీయాలను, ఆదర్శాలను పక్కన పెట్టి అండగా నిలవాలి'' అని ట్విటర్​ ద్వారా తన ఆవేదనను వ్యక్తం చేశారు ఖుష్బూ.

ఐదు నెలల గర్భిణీపై రేప్​..

ఐదు నెలల గర్భిణీపై రేప్​..

2002లో గోద్రా రైలు దహనకాండ అనంతరం గుజరాత్​లో జరిగిన అల్లర్లలో బిల్కిస్​ బానోపై 11 మంది గ్యాంగ్​ రేప్​కు పాల్పడ్డారు. ఆ సమయంలో బిల్కిస్ బానోస్​ ఐదు నెలల గర్భిణీ. అంతేకాకుండా బిల్కిస్​ కుటుంబంలో ఏడుగురిని చంపేశారు కూడా.

 క్షమాభిక్ష కింద విడుదల

క్షమాభిక్ష కింద విడుదల

ఆరేళ్ల విచారణ తర్వాత నేర నిర్ధారణ చేసిన సీబీఐ కోర్టు ఆ 11 మందికి జీవిత ఖైదు శిక్ష విధించింది. దీనిని సుప్రీం కోర్టు సమర్థించింది కూడా. అయితే తాజాగా ఆగస్టు 15న క్షమాభిక్ష కింద ఆ 11 మందిని విడుదల చేసింది గుజరాత్ ప్రభుత్వం.

ఎన్నికల కోసమేనా?

ఎన్నికల కోసమేనా?

వచ్చే సంవత్సరం గుజరాత్​లో ఎలక్షన్స్​ జరుగుతున్న నేపథ్యంలో ఈ ఖైదీలను రిలీజ్​ చేసినట్లుగా రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా విడుదలకు నిర్ణయం తీసుకునే క్రమంలో 2012 సంవత్సంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఏ సూచనలను పట్టించుకోలేదని సమాచారం.

 సర్వత్రా విమర్శలు..

సర్వత్రా విమర్శలు..

గుజరాత్​ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై చాలా మంది విమర్శలు గుప్పిస్తున్నారు. దోషులను విడుదల చేయడంపై బిల్కిస్​ బానో మనస్తాపానికి గురయ్యారు. ఈ క్రమంలోనే నటి, పొలిటిషియన్​ ఖుష్బూ ఈ ట్వీట్ చేసినట్లుగా తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X