»   » బ్యాక్ టు స్కూల్: పవన్-త్రివిక్రమ్ సినిమాపై ఖుష్భూ కామెంట్

బ్యాక్ టు స్కూల్: పవన్-త్రివిక్రమ్ సినిమాపై ఖుష్భూ కామెంట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో ముచ్చటగా మూడో సినిమా ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా సాగుతోంది. ఈ చిత్రంలో నటి ఖుష్భూ కీలకమైన పాత్రలో నటిస్తున్నారు.

ఇటీవలే ఆమె హైదరాబాద్ లో షూటింగులో జాయిన్ అయ్యారు. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ ద్వారా వెల్లడిస్తూ... ఫస్ట్ డే స్కూలుకు వెళ్లినట్లు ఉంది. 9 ఏళ్ల తర్వాత మళ్లీ తెలుగులో సినిమా చేస్తున్నాను అని తెలిపారు.

ఖుష్భూ ట్వీట్

ఖుష్భూ చివరగా... తెలుగులో యంగదొంగ సినిమాలో మోహన్ బాబు భార్యగా నటించింది. దానికంటు ముందు స్టాలిన్ మూవీలో చిరంజీవి సోదరిగా నటించింది. మధ్యలో సంథింగ్ సంథింగ్ సినిమాలో చిన్న గెస్ట్ రోల్ చేసింది. ఇపుడు మళ్లీ పవన్ కళ్యాన్ మూవీ ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

బ్యాక్ టు స్కూల్

ఖుష్భూ పవన్ కళ్యాన్ సినిమాలో నటిస్తుండటంపై పవన్ కళ్యాణ్ అభిమానులు సంతోషంగా ఉన్నారు. సోషల్ మీడియా ద్వారా ఆమెకు గ్రీటింగ్స్ తెలుపుతున్నారు.

కీర్తి సురేష్,అను ఇమ్మాన్యుయేల్

కీర్తి సురేష్,అను ఇమ్మాన్యుయేల్

త్రివిక్రమ్ దర్శకత్వం కాంబినేషన్లో ప్లాన్ చేసిన సినిమా ఏప్రిల్ 3 నుండి హైదరాబాద్ లో రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ఈ చిత్రంలో కీర్తి సురేష్, అను ఇమ్మానియేల్ హీరోయిన్లు.

రోజూ 12 గంటలు

రోజూ 12 గంటలు

సినిమా పూర్తయ్యే వరకు రోజూ 12 గంటల పాటు కష్టపడాలని పవన్ నిర్ణయించుకున్నారు. ఎలాగైనా ఈ సినిమాను ఆగస్టు 11న విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు. అప్పటి వరకు సినిమాను పూర్తి చేసిన రిలీజ్ చేయాలనే ప్లాన్ తో ముందుకు సాగుతున్నారు.

భారీగా ఖర్చు

భారీగా ఖర్చు

ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ కాకుండానే ప్రొడక్షన్ కాస్ట్ రూ. 75 కోట్లు వరకు అవుతుందట. త్రివిక్రమ్ తాను అనుకున్న విధంగా లావిష్ గా ఈ సినిమాను తెరకెక్కించాలని డిసైడ్ అయ్యాడని,అందుకు ఇంత ఖర్చు అని టాక్.

పవన్ తీసుకునేది

పవన్ తీసుకునేది

ఈ సినిమాకు రెమ్యూనరేషన్ కాకుండా ప్రీ రిలీజ్ బిజినెస్ లో 30% వాటా తీసుకోవాలని డిసైడ్ అయినట్లు టాక్. సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 150 కోట్ల వరకు అవుతుందని అంచనా. ఈ లెక్క ప్రకారం పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ ఎంతో ఊహించుకోవచ్చు.

English summary
"GM frm hyderabad..I start shooting 4 PawanKalyan n #trivikram's film 2dy..feels like 1st day at school..lot of unlearning n learning 2 do. Soooooooooo..Doing a telugu film after almost 9yrs..Back to school." khushbu tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu