»   »  నా కూతురు గురించి ఆ వార్తలు విని షాకయ్యాను: శ్రీదేవి

నా కూతురు గురించి ఆ వార్తలు విని షాకయ్యాను: శ్రీదేవి

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ నటి శ్రీదేవికి తన ఇద్దరు కూతుళ్లే ప్రపంచం. తన కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడే వారి కోసం, వారి పెంపకం కోసం సినిమా పరిశ్రమకు దూరమైన ఆమె.... దాదాపు 15 సంవత్సరాల లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చారు.

తన ఇద్దరు కూతుళ్లను కంటికి రెప్పలా చూసుకుంటున్న శ్రీదేవి.... వారికి గురించి ఎలాంటి తప్పుడు వార్తలు వచ్చినా వెంటనే వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా తన చిన్న కూతురు ఖుషి గురించి వచ్చిన పుకార్లను ఆమె ఖండించారు.

అసలు ఏమిటా పుకార్లు?

అసలు ఏమిటా పుకార్లు?

రెమో డిసౌజా నిర్వహిస్తున్న డాన్స్ రియాల్టీ షోలో పాల్గొనాలన్న కోరికతో శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషీ ఆడిషన్స్ కు వెళ్లిందని, ఫైనల్ వరకూ చేరలేకపోయిందని పుకార్లు ప్రచారంలోకి వచ్చాయి.

శ్రీదేవి ఖండన

శ్రీదేవి ఖండన

ఈ వార్తలపై శ్రీదేవి స్పందిస్తూ...ఖుషి గురించి అలాంటి వార్తలు విని షాకయ్యాను, నా కూతురు ఎటువంటి డ్యాన్స్ క్లాస్ లేదా షోల్లో పాల్గొనడం లేదు. ఇలాంటివి ఎలా ప్రచారంలోకి వస్తాయో అర్థం కావడం లేదు అని తెలిపారు.

డాన్స్

డాన్స్

హిందీ బెల్లితెరపై బాగా పాపులర్ అయిన రియాల్టీ షో 'డ్యాన్స్' థర్డ్ సీజన్ కోసం కుషి ఆడిషన్స్ కు వెళ్లిందని టాప్-35 వరకూ చేరుకుందని... అక్కడ పోటీ తట్టుకోలేక ఆ షోలో అవకాశం దక్కించుకోలేక పోయిందని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

శ్రీదేవి బిజీ బిజీ

శ్రీదేవి బిజీ బిజీ

ప్రస్తుతం శ్రీదేవి తన తాజా చిత్రం ‘మామ్' ప్రమోషన్లలో బిజ బిజీగా గడుపుతోంది. జులై 7న ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న శ్రీదేవికి ఇద్దరు కూతుళ్ల గురించిన ప్రశ్నలే ఎక్కువ ఎదురవుతున్నాయట.

English summary
Actress Sridevi refuted the reports in an interview with news agency IANS. "Khushi is not participating in any kind of dance class or any show. It is not at all true. We are really surprised... where this came from," IANS quoted Sridevi as saying.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu