twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆఫర్స్ లేకపోతే వ్యభిచారమేనా?(ఫొటో ఫీచర్)

    By Srikanya
    |

    హైదరాబాద్ : వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ శ్వేతాబసు విషయమై భాషలకు అతీతంగా అందరూ స్పందిస్తున్నారు. తాజాగా ఖుష్బూ ఈ విషయమై మాట్లాడారు. ఆర్థిక ఇబ్బందులు, సినిమాల్లో అవకాశాలు లేనంతమాత్రాన వ్యభిచార కూపంలోకి దిగడమేనా అంటూ ఇటీవల అరెస్టయిన నటి శ్వేతాబసుకు సీనియర్ నటి కుష్బూ అన్నారు.

    మరో ప్రక్క శ్వేతబసు తీరుని నిరశిస్తునే ఆమె పరిస్దితికి జాలిపడుతూ, మీడియాని తప్పుబడుతూ ఇండస్ట్రీలోని వారు సపోర్టు చేస్తున్నారు. సినిమా హీరో మంచు విష్ణు సైతం ఈ విషయమై మాట్లాడారు. తన తదుపరి చిత్రంలో వేషం ఇస్తానంటూ ప్రకటించారు. తనకు ఇలా జరగటం చాలా బాధాకరం అని అన్నారు. మిగతా సినీ సెలబ్రెటీల సైతం ఈ విషయమై స్పందించారు.

    ఆర్థిక ఇబ్బందుల కారణంగానే శ్వేతాబసు వ్యభిచారంలోకి దిగినట్లుగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా అవకాశాలు మాత్రమే ఆమెకు ఊరటనివ్వగలవని అభిప్రాయపడుతున్నారు.కాగా, ప్రాస్టిట్యూషన్ అనేది కేవలం సినీ పరిశ్రమలోనే లేదని, ఈ విషయాన్ని ఇంత పెద్దదిగా చేయడంలో అర్థం లేదని, శ్వేతాబసుకు టాలెంట్ ఉంటే తిరిగి సినీ పరిశ్రమలో నిలదొక్కుకుంటుందని కూడా అభిప్రాయపడుతున్నారు.

    సామాజిక వెబ్‌సైట్ ద్వారా పలువురు శ్వేతాబసు పట్ల జాలి చూపిస్తున్నారు. శ్వేతాబసు పేరు మాత్రమే మీడియాలో వస్తోందని, కానీ, ఈ వ్యవహారంలో ఉన్న వ్యాపారవేత్తల పేర్లు మాత్రం బయటికి రావడం లేదని అంకా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

    వారు ఎలా స్పందించారనేది స్లైడ్ షోలో...

    శేఖర్ కమ్ముల

    శేఖర్ కమ్ముల

    ప్రముఖ దర్శకుడు శేఖర కమ్ముల ట్విట్టర్ లో ఈ విషయమై స్పందించారు. ముంబైకి చెందిన కొందరు ఈ విషయమై ఖండన చేస్తూ ముందుకు రావటం ఆహ్వానించదగ్గ పరిణామం అన్నారు. సినిమావారందరూ ఆమెకు సపోర్టు చేస్తూ నిలవాలని కోరారు.

    విక్రమ్ భట్

    విక్రమ్ భట్

    "ఫిల్మ్ మేకర్స్ అంతా ముందుకు వచ్చి శ్వేత కెరీర్ కు ఓ నటిగా సాయం చేయాలని కోరుతున్నాను. నా దగ్గర ఆమెకు తగ్గ పాత్ర ఉంటే, ఆమెకు తప్పని సరిగా ఆఫర్ చేస్తాను , మంచి పొటిన్షిల్ ఉన్న ఆర్టిస్టుని వినియోగించుకోండి."

    డి ఫర్ దోపిడి నిర్మాత

    డి ఫర్ దోపిడి నిర్మాత

    షోర్ ఇన్ ది సిటీ, గో గోవా గాన్, హ్యాపీ ఎండింగ్ దర్శకుడు, డి ఫర్ దోపిడి చిత్రం నిర్మాత అయిన రాజ్ నిడమూరు మాట్లాడుతూ... " ఆమెకు అందరూ నైతికంగా సపోర్టు చేస్తున్నారు. ఇప్పుడున్న పరిస్దితుల్లో ఆమెకు రోల్స్ ఆఫర్ చేయలేము. ఆమె ఏమీ కోల్పోలేదు. మళ్లీ ప్రొడక్షన్ హౌస్ లలో వేషాలు ప్రయత్నించవచ్చు. ఈ సిట్యువేషన్ లో .. ఓదార్పు గలం అంతే S ."

    ఖుష్బూ మాట్లాడుతూ...

    ఖుష్బూ మాట్లాడుతూ...

    ‘సినిమా అవకాశాలు లేకుంటే టీవీ రంగంలోకి వెళ్లవచ్చు, క్యారెక్టర్ నటిగా మారవచ్చు - ఇలా అనేక అవకాశాలు ఉన్నాయి. అవకాశాలు లేని నటీనటులు ఎందరో ఉన్నారు. అంతమాత్రాన శ్వేతాబసు ఇలాంటి పనిచేయడం సమర్థనీయం కాదు. ఇటువంటి చర్యలను తల్లిదండ్రులు ఎలా అంగీకరిస్తున్నారు, శ్వేత విషయంలో ఆమెను కన్నవారినే ప్రధానంగా తప్పుపడుతున్నాను' అని కుష్బూ అన్నారు.

    మంచు విష్ణు మాట్లాడుతూ....

    మంచు విష్ణు మాట్లాడుతూ....

    "శ్వేతాబసు విషయంలో జరిగింది నిజంగా దారుణం. తనతో పాటు అదే హోటల్లో దొరికిన ఆ బడాబాబుల పేర్లను మీడియా కానీ, పోలీసులుకానీ ఎందుకు బయటపెట్టలేదు. సినిమా సెలబ్రిటీ అవ్వడమే ఆ అమ్మాయి చేసిన పాపమా? మీడియా, పోలీసులు కూడా ఈ విషయంలో చాలా అత్యుత్సాహం ప్రదర్శించారు. ఎక్కడ తప్పులు జరగడం లేదు చెప్పండి? మీడియాలో తప్పులు జరగవా. పదకొండేళ్ల వయసులోనే బాలనటిగా జాతీయ అవార్డు తీసుకున్న ప్రతిభావంతురాలు తను. ఆమెకు ఇలా జరగడం నిజంగా బాధాకరం. నా తదుపరి చిత్రంలో శ్వేతాబసు ప్రసాద్‌కి మంచి పాత్ర ఇస్తా" అన్నారు.

    రాజమౌళి

    రాజమౌళి

    ఈ విషయమై దర్శకుడు రాజమౌళి స్పందించారు. శ్వేతా బసు గురించి హిందీ టీవీ నటి సాక్షి తన్వర్ సంధించిన ప్రశ్నలకు ఆయన తన మద్దతు ప్రకటించారు. తన్వర్ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం ఉందా? అంటూ ఆయన ట్వీట్ చేసారు.

    నిర్మాత సురేష్ బాబు

    నిర్మాత సురేష్ బాబు

    నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ...వ్యభిచారం అనేది కేవలం ఫిల్మ్ ఇండస్ట్రీలోనే లేదు, అది ప్రపంచమంతటా ఉంది. ఎందుకింత ఈ విషయాన్ని హైలెట్ చేస్తున్నారో అర్దం కావటం లేదు. శ్వేతా కెరీర్ కు చెందిన విషయానికి వస్తే... ఆమెకు ట్యాలెంట్ ఉంటే తప్పకుండా కమ్ బ్యాక్ అవుతుంది...

    నందినీ రెడ్డి(అలా మొదలైంది దర్శకురాలు)

    నందినీ రెడ్డి(అలా మొదలైంది దర్శకురాలు)

    బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్, టెక్నిషియన్స్ శ్వేతబసుకు సపోర్టు రావటం హ్యాట్యాఫ్. ఆమె చాలా టాలెంటెడ్ ఆర్టిస్టు... ఆమె వెనక్కి తిరిగి తన కెరీర్ లో నిలబడటానికి ఒక్క సినిమా చాలు.

    సాక్షి తన్వర్

    సాక్షి తన్వర్

    వ్యభిచారం కేసులో పట్టుబడిన టాలీవుడ్ నటి శ్వేతాబసును ఎక్కువగా ఎందుకు ఫోకస్ చేస్తున్నారని టీవీ నటి సాక్షి తన్వర్ ప్రశ్నించారు. శ్వేతాబసుకు వ్యక్తిగత స్వేచ్ఛ హక్కు లేదా? అని ప్రశ్నించారని సమాచారం. మీడియాలో ఎందుకు ఫోకస్ చేస్తున్నారని ప్రశ్నించారని తెలుస్తోంది. 13 ఏళ్ళ క్రితం వచ్చిన 'కహానీ ఘర్ ఘర్ కీ' టీవీ సీరియల్లో ఈ టీవీ నటి సాక్షి.. శ్వేతాబసుకు తల్లిగా నటించింది. తాజాగా, వ్యభిచారం కేసులో శ్వేతాబసు పేరు మీడియాలో మార్మోగిపోతుండడం పట్ల సాక్షి స్పందించింది.

    శ్వేత బసు ప్రస్తుతం

    శ్వేత బసు ప్రస్తుతం

    బంధువులు లేదా కటుంబ సభ్యులు ఎవరైనా వస్తే కొత్త బంగారు లోకం సినిమా హీరోయిన్ శ్వేతాబసుకు రెస్క్యూ హోం నుంచి విముక్తి లభించే అవకాశం ఉంది. రెస్క్యూ హోంలో ఆమె మూడు నెలల పాటు ఉండాల్సి ఉంది. అయితే, బంధువులు ఎవరైనా వస్తే మాత్రం ముందుగానే బయటకు వచ్చే అవకాశం ఉంటుంది

    English summary
    What I want to emphasise is that every actress goes through several problems like this. But there are several other options like TV and character roles in films, so why can’t one opt for them? Stooping to the level of selling yourself is not acceptable. What’s more disturbing is that how could her parents allow something like this. I would blame her parents for her plight. — Khushboo Actor, Politician
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X