For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పవన్ కి చెప్పే...‘ఖుషి’లో సీన్ వాడాం

  By Srikanya
  |

  హైదరాబాద్: పవన్‌కల్యాణ్ 'తొలిప్రేమ'లో 'ఏమైందో.. ఏమో ఈ వేళ' పాటను రీమిక్స్ చేసి నితిన్ తాజా చిత్రం 'గుండెజారి గల్లంతయ్యిందే' లో వాడారు. అంతేగాక ఆ చిత్రంలో ...పవన్‌కల్యాణ్ నటించిన సూపర్‌హిట్ 'ఖుషి' సినిమాలోని ఓ సూపర్‌హిట్ సన్నివేశాన్ని కూడా వాడారు. ఇదే విషయాన్ని నితిన్ మీడియాకు చెప్పారు. ఆయన మాట్లాడుతూ...వన్‌కల్యాణ్‌కి ఈ పాట, సన్నివేశం చూపించలేదు. అయితే ఆయనకు చెప్పే చేశాం. పవన్‌కల్యాణ్ ప్రస్తుతం షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. త్వరలో చూపిస్తాం అన్నారు.

  రీమిక్స్ పాట గురించి చెప్తూ.... ఈ సినిమాకే కాదు, నా కెరీర్‌లోనే ఈ పాట బెస్ట్ సాంగ్. అలాగే ''ఏ క్లాస్‌లో అదరగొట్టిందా, బి క్లాస్‌లో ఆడిందా, సి క్లాస్‌లో బాగా పే చేసిందా... అనే విషయాల గురించి నాకు తెలీదు. నాకు తెలిసిందల్లా ఒక్కటే... ఎమోషన్స్ అనేవి కరెక్ట్‌గా క్యారీ అయితే... అన్ని క్లాసులకూ సినిమా కనెక్టవుతుంది. మా 'గుండెజారి గల్లంతయ్యిందే' ఆ కోవకు చెందిన చిత్రమే'' అంటున్నారు నితిన్. ఈ నెల 19న ఈ సినిమా విడుదల కానుంది.

  ఇక ఈ చిత్రం కథను నమ్మి ఈ సినిమా చేశానండీ... సినిమా మొత్తం చూసుకున్నాం. అనుకున్నదాని కంటే అద్భుతంగా వచ్చింది. 'ఇష్క్' సినిమా తర్వాత వస్తున్న సినిమా కాబట్టి ప్రేక్షకులందరూ 'ఇష్క్'ని దృష్టిలో పెట్టుకొనే ఈ సినిమాను చూస్తారు. కానీ ఆ సినిమాకూ దీనికీ అస్సలు పొంతన ఉండదు. ఇది పూర్తి డిఫరెంట్ మూవీ అన్నారు.

  ప్రేక్షకులు 'ఇష్క్'తో కంపేర్ చేసి చూస్తే యువతరాన్ని కట్టిపడేసే అంశాలు ఇందులోనే ఎక్కువ. 'ఇష్క్'లో ఫస్టాఫ్ మాత్రమే ప్రేమకథ ఉంటుంది. కానీ ఈ సినిమా అలాకాదు... ద్వితీయార్థం కూడా అద్భుతమైన ప్రేమకథను చూడొచ్చు. నాకు తెలిసి తెలుగుతెరపై ఇలాంటి పూర్తిస్థాయి ప్రేమకథ వచ్చి చాలా రోజులైంది. నేనూ, నిత్యామీనన్, ఇషా తల్వార్, మధు మా నలుగురు చుట్టూ తిరిగే ప్రేమకథ ఇది. కథ పరంగా ఎవరి కోణంలో చూస్తే వారిది కరెక్టే అనిపిస్తుంది. ఆ కన్‌ఫ్యూజన్‌లోంచి అద్భుతమైన కామెడీ పుడుతుంది. ఆఖరి పావుగంట ఈ సినిమాకు ప్రాణం అన్నారు.

  పవన్ మీద తనకున్న అభిమానం గురించి చెప్తూ...నేను హీరో అయ్యిందే ఆయన్ను చూసి. నా రోల్ మోడల్ పవర్‌స్టార్. ఆయనంటే నాకు పిచ్చి. ఆయన సినిమాలు చూసే నాకు సినిమాలపై ఆసక్తి మొదలైంది. ఆయన డైలాగులు ఇంటికెళ్లి ప్రాక్టీస్ చేసి నేను నటుడ్ని అయ్యాను. పవర్‌స్టార్ విషయంలో మాత్రం నేను స్టార్‌ని కాను. కామన్‌మేన్‌ని అంతే. ఆయన అభిమానినని గొప్పగా చెప్పుకుంటా. ఆయన సినిమాలో ఒక్క సన్నివేశంలో కనిపించినా చాలు. ఆ అవకాశం కోసమే ఎదురుచూస్తున్నా అన్నారు.

  English summary
  
 Nitin is a huge fan of Pawan Kalyan since Toliprema days and he make no qualms about it. He has titled his latest film as Gunde Jaari Gallanthayyinde which is part of Dil Se song from Pawan Kalyan’s Gabbar Sngh. Nitin has recently said that he is going to remix ‘Emaindo Emo Eevela’ song from Pawan Kalyan’s classic Toli Prema. Anup Rubens who has delivered nice music for Nitin’s Ishq is going to do the remix of this song. Original song was composed by Deva and its inspired by Un Dos Tres song of Ricky Martin. Nitin has completed shoot of songs recently in UAE which also include visuals of seaplane usage.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X