Don't Miss!
- News
Chain Snatching: ఫుడ్ డెలివరీ బాయ్‌గా వచ్చి చైన్ స్నాచింగ్..
- Sports
IND vs NZ మూడో టీ20లో పృథ్వీ షాను ఖచ్చితంగా ఆడించాలి! ఎందుకంటే..?
- Finance
Adani Enterprises FPO: అనుకున్నది సాధించిన అదానీ.. మూడో రోజు మ్యాజిక్.. ఏమైందంటే..
- Lifestyle
Garuda Purana: ఈ పనులను తప్పనిసరిగా పూర్తి చేయాలి.. లేదంటే సమస్యలు తప్పవు
- Automobiles
అమరేంద్ర బాహుబలి ప్రభాస్ కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్
- Technology
Samsung కొత్త ఫోన్ లాంచ్ త్వరలోనే! అందుకే ఈ ఫోన్ ధర రూ.10000 తగ్గింది!
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
Vikrant Rona Twitter Review: సుదీప్ మూవీకి అలాంటి టాక్.. కేజీఎఫ్‌ను మించేలా.. ఫైనల్ రిపోర్ట్ ఇదే
కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన హీరోనే అయినా.. తెలుగులోనూ ఫాలోయింగ్ పెంచుకున్న హీరోల్లో కిచ్చా సుదీప్ ఒకరు. శాండిల్‌వుడ్‌లో సుదీర్ఘ కాలంగా తనదైన చిత్రాలతో సందడి చేస్తోన్న ఈ స్టార్ హీరో.. ఎన్నో విజయాలను కూడా ఖాతాలో వేసుకున్నారు. అయితే, ఈ మధ్య కాలంలో ఆయన ఆశించిన రీతిలో హిట్లను అందుకోలేకపోతోన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సారి ఎలాగైనా సక్సెస్ కొట్టాలన్న లక్ష్యంతో 'విక్రాంత్ రోణ' అనే యాక్షన్ అడ్వెంచర్ మూవీని చేశారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమా గురువారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాలతో విడుదలైన ఈ మూవీకి ఎలాంటి టాక్ వచ్చింది? ఇందులో ప్లస్‌లు, మైనస్‌లు ఏంటి? అనేవి వాటిపై ట్విట్టర్ రివ్యూ మీ కోసం!

విక్రాంత్ రోణగా వచ్చిన సుదీప్
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ హీరోగా అనూప్ భండారి తెరకెక్కించిన చిత్రమే 'విక్రాంత్ రోణ'. ఇందులో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ హీరోయిన్ కాగా.. నిరూప్ భండారి, నీతా అశోక్ కీలక పాత్రలు చేశారు. ఈ మూవీని కిచ్చా క్రియేషన్స్, శాలినీ ఆర్ట్స్ బ్యానర్లపై శాలినీ జాక్ మంజు, అలంకార్ పాండియన్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాకు అజనీష్ లోక్‌నాథ్ సంగీతాన్ని అందించారు.
బ్లేజర్ విప్పేసి రత్తాలు హాట్ ట్రీట్: ఆ పార్ట్ కనిపించేలా ఘాటుగా!

అంచనాలు పెంచేసిన అప్డేట్స్
అడ్వెంచర్ అండ్ యాక్షన్ థ్రిల్లర్‌గా వచ్చిన 'విక్రాంత్ రోణ' మూవీపై ఆరంభం నుంచే అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే దీని నుంచి ఏది విడుదలైన మంచి రెస్పాన్స్ వచ్చింది. మరీ ముఖ్యంగా ఈ సినిమా టీజర్, ట్రైలర్‌కు భారీగా వ్యూస్ వచ్చాయి. అలాగే, పాటలు కూడా ఎంతగానో ఆకట్టుకున్నాయి. దీంతో సుదీప్ చిత్రంపై అన్ని భాషల్లో బజ్ ఏర్పడింది.

బిజినెస్‌కు తగ్గట్లు గ్రాండ్ రిలీజ్
'విక్రాంత్ రోణ' మూవీకి కన్నడంలో భారీ బిజినెస్ జరిగింది. అలాగే, పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలైన ఈ సినిమాకు అన్ని ఏరియాల్లోనూ భారీ స్థాయిలో వ్యాపారం జరిగింది. అందుకే ఇది ఎంతో గ్రాండ్‌గా విడుదల అవుతోంది. మరీ ముఖ్యంగా కర్నాటకలో 'కేజీఎఫ్ 2' కంటే ఎక్కువ స్క్రీన్లలో ఈ సినిమా ప్రదర్శితం అవుతోంది. ఇలా మొదటి రోజే రికార్డును క్రియేట్ చేసుకుంది.
దారుణమైన ఫొటోలు వదిలిన రష్మిక: ఆమెను ఇంత హాట్‌గా ఎప్పుడైనా చూశారా!

సుదీప్ సినిమాకు అలాంటి టాక్
స్టార్ హీరో కిచ్చా సుదీప్ నటించిన 'విక్రాంత్ రోణ' మూవీ అడ్వెంచర్ అండ్ యాక్షన్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో షోలు కూడా ప్రదర్శితం అయ్యాయి. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం.. ఆరంభంలోనే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. చాలా మంది సుదీప్‌కు సరైన కమ్‌బ్యాక్ మూవీ ఇదే అని ట్వీట్లు చేస్తున్నారు.

ఫస్టాఫ్ ఇలా.. సెకెండాఫ్ మరోలా
'విక్రాంత్
రోణ'
మూవీ
ఓవరాల్‌గా
చూసుకుంటే..
ఫస్టాఫ్
మొత్తం
టెర్రిఫిక్
ఇంట్రో
సీన్‌లతో
పాటు
అద్భుతమైన
విజువల్స్‌తో
ప్రేక్షకులను
కథలోకి
తీసుకెళ్లే
విధంగా
ఉంటుందట.
మరీ
ముఖ్యంగా
బ్యాగ్రౌండ్
స్కోర్,
మాయా
ప్రపంచాన్ని
చూపిన
తీరు
అదిరిపోతుందట.
అలాగే,
సెకెండాఫ్
కూడా
మరింత
ఆసక్తిని
రేకెత్తిస్తూ
నడుస్తుందట.
క్లైమాక్స్
మాత్రం
సూపర్‌గా
ఉంటుందట.
Eesha Rebba అందాల అరాచకం: అబ్బో ఆమె ఫోజులు చూస్తే!

సినిమాలో ప్లస్... మైనస్‌లు ఇవే
కిచ్చా
సుదీప్
హీరోగా
నటించిన
'విక్రాంత్
రోణ'
మూవీని
చూసిన
వాళ్లంతా
ఇచ్చిన
రిపోర్టుల
ప్రకారం..
ఇందులో
సుదీప్
తన
యాక్టింగ్‌తో
వన్
మ్యాన్
షో
చేశాడట.
అలాగే,
బ్యాగ్రౌండ్
స్కోర్,
యాక్షన్
సీన్స్,
విజువల్స్,
స్టోరీ
లైన్,
ట్విస్టులు
సినిమాకు
ప్లస్
పాయింట్లుగా
చెప్పుకోవచ్చట.
అయితే,
ఇంటర్వెల్
బ్యాంగ్
అంతగా
ఆకట్టుకోకపోవడం
తప్ప
ఇందులో
మైనస్‌లు
లేవని
టాక్.

ఫైనల్‌గా సినిమా ఎలా ఉందంటే
తాజా
సమాచారం
ప్రకారం..
కిచ్చా
సుదీప్
నటించిన
'విక్రాంత్
రోణ'
పూర్తిగా
అన్ని
వర్గాల
వాళ్లనూ
అలరించే
అడ్వెంచర్
అండ్
యాక్షన్
థ్రిల్లర్
మూవీ
అని
చెప్పొచ్చు.
టైటిల్
కార్డ్స్
నుంచే
ప్రేక్షకులను
కథలోకి
తీసుకెళ్లడంలో
దర్శకుడు
సక్సెస్
అయ్యాడట.
అదే
చివరి
వరకూ
కంటిన్యూ
చేస్తూ
మార్కులు
కొట్టేశాడని
అంటున్నారు.
మొత్తంగా
ఈ
చిత్రం
విజువల్
వండర్‌గా
ఉందట.