»   » కిక్-2 ఎఫెక్ట్: రవితేజ బాగా తగ్గిపోయాడు!

కిక్-2 ఎఫెక్ట్: రవితేజ బాగా తగ్గిపోయాడు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మాస్ మహరాజా రవితేజ త్వరలో కిక్-2 చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రవితేజ గత చిత్రాలకు భిన్నంగా కనిపించబోతున్నాడు. ఇందులో రవితేజ తండ్రి, కొడుగా డబల్ రోల్ చస్తున్నాడు. పాత్రలో వైవిద్యం చూపడానికి రవితేజ ఏకంగా 6 కేజీల బరువు తగ్గిపోయాడు. అయితే ఈ మధ్య పలు ప్రెస్ మీట్లలో కనిపించిన రవితేజ మరీ బక్కచిక్క కనిపించడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. అయితే ఎలాంటి ఆందోళన అవసరం లేదని, సినిమా పాత్ర కోసమే ఇదంతా అంటున్నారు యూనిట్ సభ్యులు.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

రవితేజ-రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కిక్-2'. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో విలన్ ఎవరో తెలిసి పోయింది. షారుక్ ఖాన్ హీరోగా రోహిత్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ‘చెన్నై‌ఎక్స్ ప్రెస్'చిత్రంలో విలన్ తంగబలి పాత్ర పోషించిన బాలీవుడ్ నటుడు నికితిన్ ధీర్ ఈ చిత్రంలో మెయిన్ విలన్ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

Kick 2: Ravi Teja is playing a dual role

‘కిక్-2' చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ కమెడియన్ రాజ్ పాల్ యాదవ్ కూడా నటిస్తున్నాడు. . టిపికల్ కామిక్ టైమింగ్, వెరైటీ మేనరిజం, బాడీ లాంగ్వేజ్‌తో నవ్వులు పూయించడం రాజ్ పాల్ యాదవ్ ప్రత్యేకత. ఇప్పటి వరకు బాలీవుడ్ చిత్రాలకే పరిమితమైన రాజ్ పాల్ కిక్-2 ద్వారా టాలీవుడ్లోనూ నవ్వించడానికి వచ్చాడు. దర్శకుడు సురేందర్ రెడ్డి సినిమాలో అతని పాత్రను ప్రత్యేకంగా తీర్చి దిద్దాడని తెలుస్తోంది.

రవితేజ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘కిక్' చిత్రం ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఇపుడు ఆ చిత్రానికి సీక్వెల్‌గా రవితేజ హీరోగా నటించే ఈ చిత్రాన్ని నందమూరి తారకరామారావు ఆర్ట్స్ పతాకంపై హీరో కళ్యాణ్‌రామ్ నిర్మిస్తున్నారు.

ఆద్యంతం వినోద ప్రధానంగా సాగే చిత్రమని రవితేజ అంటున్నారు. 'కిక్'లో జంటగా నటించిన రవితేజ, ఇలియానా పాత్రల కొడుకు కథే ఈ 'కిక్ 2' అని దర్శకుడు తెలిపారు. నిర్మాత మాట్లాడుతూ...యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో రవితేజ మార్క్ ఎంటర్‌టైనర్‌తోపాటు సురేందర్ రెడ్డి, తమన్నా మ్యాజిక్ మళ్లీ రిపీట్ కానుంది. ఈ చిత్రం మే 28, 2015న విడుదల చేస్తామన్నారు. ఈ చిత్రంలో రవితేజ సరసన రకూల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. కథ:వక్కంతం వంశి, కెమెరా:మనోజ్ పరమహంస, సంగీతం:తమన్, నిర్మాత:నందమూరి కళ్యాణ్‌రామ్, దర్శకత్వం:సురేందర్ రెడ్డి.

English summary
Ravi Teja shed 6 kg to look the part for his upcoming film Kick 2. Ravi Teja is playing a dual role of father and son in the film directed by Surrender Reddy.
Please Wait while comments are loading...