»   » రవితేజ అభిమానులకు కిక్కు దొబ్బింది!

రవితేజ అభిమానులకు కిక్కు దొబ్బింది!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మాస్ మహరాజా రవితేజ అభిమానులు కిక్-2 సినిమా విడుదల కోసం గత కొన్ని రోజులుగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో రిలీజ్ అయి చాలా కాలం అయింది. అయితే సినిమా మాత్రం ప్రేక్షకుల ముందుకు రావడం లేదు. ఇప్పట్లో వచ్చే అవకాశమూ కనిపించడం లేదు.

వాస్తవానికి ఈ చిత్రం ఇప్పటికే విడుదల కావాల్సి ఉంది. ఆ మధ్య డబ్బింగ్, పోస్టు ప్రొడక్షన్ పనులు డిలే కావడమే ఇందుకు కారణమంటూ ఏవో కారణాలు సాకుగా చూపి... సినిమాను జులైకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ చిత్రం జులైలో కూడా విడుదల కావడం లేదని తాజాగా సమాచారం.


'Kick 2' release on 14th or 21st of August

జులై నెలలో ‘కిక్-2' సినిమా విడుదలకు అవకాశం దొరకడం లేదు. ఈ నెలలో ‘బాహుబలి' సినిమా విడుదలవ్వడమే ఇందుకు కారణం. ఆగస్టు నెలలో కూడా మహేష్ బాబు ‘శ్రీమంతుడు'తో పాటు మరికొన్ని విడుదల ఉన్న నేపథ్యంలో ఇంకా రిలీజ్ డేట్ ఖరారు కాలేదు. ఆగస్టు 14న గానీ...కుదరకపోతే ఆగస్టు 21న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట.


సినిమా ఇలా వాయిదాల మీద వాయిదాలు పడటంపై సగటు రవితేజ అభిమానులు సినిమా చూడాలనే కిక్ దొబ్బుతోందని వాపోతున్నారు. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బేనర్లో నందమూరి కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రవితేజ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

English summary
'Kick 2'had been supposed to be released in the month of July. But then, further the makers have opted for the month of August. The movie's release maybe zeroed either on 14th or 21st of August.
Please Wait while comments are loading...