»   » ‘కిక్-2’ అఫీషియల్ ట్రైలర్, రెస్పాన్స్ కేక...(వీడియో)

‘కిక్-2’ అఫీషియల్ ట్రైలర్, రెస్పాన్స్ కేక...(వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మాస్ మహరాజా రవితేజ త్వరలో ‘కిక్-2' చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో వేడుక శనివారం రాత్రి హైదరాబాద్ లో జరిగింది. ఈ సందర్భంగా థియేట్రికల్ ట్రైలర్ కూడా విడుదల చేసారు. ట్రైలర్ కు రెస్పాన్స్ అదిరిపోతోంది. ట్రైలర్ విడుదలైన 12 గంటల్లోనే యూట్యూబులో లక్ష మందికి పైగా చూసారు.


రవితేజ హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘కిక్‌-2'. నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ పతాకంపై నందమూరి కల్యాణ్‌రామ్‌ నిర్మిస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్. రవితేజ మార్కు ఎంటర్టెన్మెంట్, సురేందర్ రెడ్డి మార్కు స్క్రీన్ ప్లేతో సినిమా ఆసక్తికరంగా ఉంటుందని అంటున్నారు.


ఈ సినిమా కు రన్ టైమ్ ప్లాబ్లం వచ్చిందని సమాచారం. 3 గంటలు పైగా సినిమా వచ్చిందని, అయితే అంత రన్ టైమ్ థియోటర్స్ లో వర్కవుట్ కావటంలేదని డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ చెప్తున్న నేపధ్యంలో దాని లెంగ్త్ తగ్గించాలని ఎడిటర్ గౌతమ్ రాజు కృషి చేస్తున్నట్లు సమాచారం. అయితే ప్రతీ సీన్...కీలకమైందిగా ఉందని దాంతో ఏ సీన్ ఎడిట్ చేసి లెంగ్త్ తీసేయాలనే సందిగ్దంలో ఉన్నట్లు చెప్పుకుంటున్నారు.


Kick 2 Theatrical Trailer

ఈ చిత్రాన్ని నందమూరి తారక రామారావు(సీనియర్ ఎన్టీఆర్) పుట్టిన తేది అయిన మే 28,2015 న విడుదల చేయటానికి నిర్మాత నందమూరి కళ్యాణ రామ్ నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటికే రవితేజ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్‌లుక్‌, టీజర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాకు కథ: వక్కంతం వంశీ, సంగీతం: యస్‌.యస్‌.థమన్‌, కెమెరా: మనోజ్‌ పరమహంస, ఎడిటింగ్‌: గౌతంరాజు, ఆర్ట్‌: నారాయణరెడ్డి, ఫైట్స్‌: రామ్‌-లక్ష్మణ్‌.

English summary
Watch the official theatrical trailer of upcoming Telugu movie Kick 2.
Please Wait while comments are loading...