»   » మళయాళ నటి పై లైంగిక దాడి లో షాకింగ్ నిజాలు : వెనకున్నది సినీఇండస్ట్రీ లోని వారే ??

మళయాళ నటి పై లైంగిక దాడి లో షాకింగ్ నిజాలు : వెనకున్నది సినీఇండస్ట్రీ లోని వారే ??

Posted By:
Subscribe to Filmibeat Telugu

మళయాళ నటిపై దుండగులు దాడికి పాల్పడ్డారన్న వార్త సినీప్రపంచాన్నే కాకుండా సాధారణ మహిళలను సైతం దిగ్బ్రాంతి కిగురిచేసింది. ఆమెకు సంఘీభావం తెలుపుతూ పలువురు నటీనటులు సోషల్‌ మాధ్యమాల్లో సందేశాలు పోస్టు చేస్తున్నారు. ఒక టాప్ హీరోయిన్ పై ఈ స్థాయి ఘటన చోటుచేసుకోవడం మలయాళ ఇండస్ట్రీ వర్గాలలో కలకలం రేపింది.

'ఒంటరి' చిత్రం ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఆమె అచ్చ తెలుగు అమ్మాయిలా ప్రేక్షకులను అలరించింది. ఆ తర్వాత నితిన్ తో 'హీరో,' కృష్ణవంశీ , శ్రీకాంత్ ల కలయికలో వచ్చిన 'మహాత్మా,' రవితేజ 'నిప్పు' సినిమాలలో నటించింది. తెలుగులో అంతంత మాత్రపు అవకాశాలే వచ్చినప్పటికీ, మలయాళంలో  టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది. అలాంటి నటి మీద, అదీ రద్దీగా ఉండే సిటీలో ఇలా జరటం దక్షిణాది సినీ పరిశ్రమ మొత్తానికి షాక్ గా మారింది... అసలింతకీ ఏం జరిగిందంటే

టెంపోతో ఢీకొట్టారు:

టెంపోతో ఢీకొట్టారు:

శుక్రవారం షూటింగ్ ముగించుకుని త్రిసూర్ నుంచి కోచికి రాత్రి 9.30 గంటల సమయంలో ఆమె కార్లో వెళుతుండగా ఓ టెంపోలో ఆమె మాజీ డ్రైవర్ సునీల్ కుమార్, ఇతర గుర్తుతెలియని దుండగులు ఫాలో అయ్యారు. అథానీలోని నెదుంబసేరీ అంతర్జాతీయ విమానాశ్రయ సమీపంలో దుండగులు ఆమె కారును టెంపోతో ఢీకొట్టారు.

దాదాపు గంటన్నర పాటు:

దాదాపు గంటన్నర పాటు:

ఆ తర్వాత ఆమెను ప్రస్తుత డ్రైవర్ మార్టిన్‌‌తో కలిసి మాజీ డ్రైవర్ సునీల్ కుమార్ బలవంతంగా కార్లోకి ఎక్కి.. దాదాపు గంటన్నర పాటు ఆమెపై కార్లో లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. అంతేకాదు.. ఫోన్లో ఆమె ఫొటోలు, వీడియోలు కూడా తీశారు. ఆమెను బెదిరించారు.

 పోలీసులకు ఫిర్యాదు:

పోలీసులకు ఫిర్యాదు:

తర్వాత వారు పళరివత్తం జంక్షన్ వద్ద దిగిపోయారు. వారు దిగిపోయాక అక్కడికి సమీపంలోనే నివసించే సినిమా నిర్మాత వద్దకు వెళ్లి జరిగిన సంఘటన గురించి వివరించింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. కార్ డ్రైవర్‌ మార్టిన్‌ను అదుపులోకి తీసుకున్నారు.

కేరళ ముఖ్యమంత్రి విజయన్:

కేరళ ముఖ్యమంత్రి విజయన్:

నటి ని కిడ్నాప్ చేసి, వేధింపులకు గురిచేసిన ఘటనను కేరళ ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ కేసులో నిందితులెవరినీ వదిలిపెట్టబోమని, వారిని శిక్షిస్తామని కేరళ ముఖ్యమంత్రి విజయన్ ప్రకటించారు. ఇప్పటి వరకు పోలీసులు ముగ్గురి నిందితులను అరెస్ట్ చేశారని, కేసును త్వరితగతిన విచారించాలని ఆదేశించినట్టు తెలిపారు...

సినీ ఇండస్ట్రీతో సంబంధాలున్నవారే:

సినీ ఇండస్ట్రీతో సంబంధాలున్నవారే:

దాడికి పాల్పడిన ఆరుగురిలో ఇద్దరు డ్రైవర్లు మినహా మిగతావారంతా సినీ ఇండస్ట్రీతో సంబంధాలున్నవారేనని, వీరు పలు ప్రొడక్షన్ ఉద్యోగాలు చేస్తున్నారని కేసును విచారిస్తున్న పోలీసులు తెలిపారు. ఈ కిడ్నాప్ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పోలీసులు అడిషనల్ డీజీపీ బీ సంధ్య నేతృత్వంలో దినేంద్ర కస్యప్ ను విచారణ అధికారిగా నియమించగా, కేసులో మరో ఇద్దరిని కోయంబత్తూరులో అరెస్ట్ చేశామని పోలీసు అధికారులు తెలిపారు.

అరెస్ట్ చేస్తామని:

అరెస్ట్ చేస్తామని:

మొత్తం ఆరుగురికి కేసులో భాగం ఉందని, ఇప్పటివరకూ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. కాగా, ఈ విషయంలో మీడియాతో ఎక్కువగా మాట్లాడవద్దని ఆమెకు సలహా ఇచ్చామని, సాధ్యమైనంత త్వరగా నిందితులందరినీ అరెస్ట్ చేస్తామని పోలీసు వర్గాలు వెల్లడించాయి.

గతంలో ఉన్న సంబంధాలు:

గతంలో ఉన్న సంబంధాలు:

మలయాళం సినీ పరిశ్రమలోని నిందితులకు, బాధితురాలికి మధ్య గతంలో ఉన్న సంబంధాలు చెడిపోవడంతోనే వారు పగబట్టి ఈ కిడ్నాప్ ప్లాన్ చేశారని తెలిపారు. కాగా, రాష్ట్రంలో సెలబ్రిటీలకే రక్షణ లేకుండా పోయిందని కేరళ విపక్ష నేత రమేష్ చెన్నితాల విమర్శించారు.

న్యాయం చేయాలి:

న్యాయం చేయాలి:

ఇక ఈ విషయం లో సినీనటులూ, ఇండస్ట్రీ వర్గాలనుంచి కూడా సపోర్ట్ గా సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. అనేక మంది సినీ సెలబ్రెటీలు తాము ఈ వార్త విని షాక్ అయినట్లే వెంటనే విచారణ జరిపి న్యాయం చేయాల్సింది అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు.

 దర్శకుడు మేజర్ రవి :

దర్శకుడు మేజర్ రవి :

తాజాగా 'అల్లు శిరీష్', మోహన్ లాల్ కాంబినేషన్ లో ....'1971 బియాండ్ బోర్డర్స్' చిత్రం రూపొందిస్తున్న దర్శకుడు మేజర్ రవి స్పందించారు. ఈ విషయమై ఆయన ఫేస్ బుక్ లో ఓ పోస్ట్ పెట్టారు. ఈ విషయం లో ప్రభుత్వం త్వరిత గతిన చర్యలు తీసుకోకుంటే ప్రజలనుంచి తిరుగు బాటు ఎదుర్కోవాల్సిన ప్రమాదం ఉంటుందనీ ఆయన చేసిన పోస్ట్ లో పేర్కొన్నారు...

నటి రాయ్‌లక్ష్మి:

నటి రాయ్‌లక్ష్మి:

ఇదే ఘటన పై నటి రాయ్‌లక్ష్మి స్పందిస్తూ... ‘ఇది నిజం కాకూడదని కోరుకుంటున్నా. ఒకవేళ నిజమే అయితే మన గళం విప్పాల్సిన సమయం వచ్చింది. ఇకపై ఎవరినైనా ఎలా నమ్మగలం? భద్రత అనే పదానికి ఇప్పుడు అర్థమే లేదు. ఆమె సురక్షితంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నా' అని పేర్కొంది.

ఎందరో నటీనటులు: సిగ్గుండాలి:

ఎందరో నటీనటులు: సిగ్గుండాలి:

మరో నటి, భాదితురాలుకు స్నేహితురాలు కూడా అయిన "భామ" స్పందిస్తూ... ‘అసలు వారి లక్ష్యమేంటో అర్థం కావడం లేదు. ఇటువంటి విషయాలను హీరోయిన్లు బయటకు చెప్పుకోలేరని భావిస్తున్నారా? సిగ్గుండాలి! నిందితుల్ని కఠినంగా శిక్షించాలి' అని ఆగ్రహం వ్యక్తం చేసింది. వీరిద్దరే కాదు, ఇంకా ఎందరో నటీనటులు భావన ఉదంతంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

English summary
Bhavana Kidnap Case: "Some people have been taken into custody. We would be able to talk about their role in the incident only after a proper verification", a top police officer said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu