»   » భర్త చేసిన వంచనకు.. మగధీర హీరోయిన్‌ అంతా ఉచితంగానే.. గడ్డుపరిస్థితి..

భర్త చేసిన వంచనకు.. మగధీర హీరోయిన్‌ అంతా ఉచితంగానే.. గడ్డుపరిస్థితి..

Posted By:
Subscribe to Filmibeat Telugu

అందాల తార కిమ్ శర్మ గురించి చెప్పుకుంటే సినిమాను మించిన విషాద కథ. కెరీర్ మంచి జోష్‌లో ఉండగా కెన్యా పారిశ్రామిక వేత్తను పెళ్లి చేసుకొని వెండితెరపై నుంచి కనుమరుగైపోయింది. ఆ తర్వాత భర్త మరో యువతితో సంబంధం పెట్టుకొని కిమ్ శర్మను దారుణంగా వంచించాడు. పైసా చేతిలో పెట్టకుండా ఇంటి నుంచి తరిమేశాడు. ప్రస్తుతం ముంబైలో ఉంటున్న కిమ్ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉన్నట్టు సమాచారం. మళ్లీ సినిమా పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి ప్రయత్నాలు చేపట్టింది.

కెన్యా వ్యాపారవేత్తతో..

కెన్యా వ్యాపారవేత్తతో..

కెరీర్ మంచి ఉన్నత స్థితిలో ఉండగా 2010లో కెన్యా పారిశ్రామికవేత్త అలి పుంజానీని వివాహం చేసుకొన్నది. ఆ తర్వాత అలీ పుంజానీ చేసిన మోసంతో ఆయనకు దూరమైంది. 2017 ఏప్రిల్ భర్త పుంజానీ నుంచి విడాకులు తీసుకొని ముంబైలో జీవనం సాగిస్తున్నది.

జావేద్ స్వచ్ఛంద సంస్థతో

జావేద్ స్వచ్ఛంద సంస్థతో

ముంబైలో నివసిస్తున్న కిమ్ శర్మ స్వచ్చంద సంస్థ కోసం పనిచేస్తున్నది. ప్రముఖ నటుడు జావెద్ జాఫ్రీ స్థాపించిన స్వచ్ఛంద సంస్థతో కిమ్ భాగస్వామ్యమైంది. ఇండియన్ డాక్యుమెంటరీ ఫౌండేసన్ ప్రొగ్రాం గుడ్ పిచ్ ఇండియా కోసం ఉచితంగా పనిచేస్తున్నట్టు తెలుస్తున్నది.

ఉచితంగా యాడ్ ఫిల్మ్‌లో..

ఉచితంగా యాడ్ ఫిల్మ్‌లో..

ఓ వైపు సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తునే గుడ్ పిచ్ ఇండియా కోసం తీసే ప్రమోషన్ కార్యక్రమంలో పాలుపంచుకొంటున్నది. ఆ సంస్థ తీసే యాడ్ ఫిల్మ్‌లో నటిస్తున్నది. గుడ్ పిచ్ ఇండియా స్వచ్ఛంద సంస్థ కావడంతో రెమ్యునరేషన్‌తో కాకుండా ఉచితంగా సేవలు అందిస్తున్నది.

బాయ్ ఫ్రెండ్‌తో సహజీవనం

బాయ్ ఫ్రెండ్‌తో సహజీవనం

కెన్యా నుంచి గడ్డుస్థితిలో ముంబై చేరుకొన్న తర్వాత తన చిరకాల మిత్రుడు అర్జున్ ఖన్నాతో కలిసి సహజీవనం చేస్తున్నది. గత కొద్దికాలంగా భార్య షిఫాలీకి దూరంగా ఉంటున్న ఆయన కిమ్‌తో సంబంధం పెట్టుకొన్నట్టు తెలుస్తున్నది. అర్జున్ ఖాన్నానే జావెద్ జాఫ్రీకి పరిచయం చేసినట్టు సమాచారం.

యువరాజ్‌తోను అఫైర్

యువరాజ్‌తోను అఫైర్

యువరాజ్ సింగ్‌తో పీకల్లోతు.. అలీ పుంజానీతో పెళ్లికి ముందు క్రికెటర్ యువరాజ్ సింగ్‌తో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలింది. దాదాపు వీరి ప్రేమ పెళ్లి పీటల వరకు వచ్చింది. అయితే వారిద్దరూ తమ ప్రేమకు బ్రేకప్ చెప్పడం అప్పట్లో చర్చనీయాంశమైంది. కిమ్ శర్మతో పెళ్లికి యువరాజ్ సింగ్ తల్లి విలన్‌గా మారినట్టు వార్తలు కూడా వచ్చాయి.

తెలుగులో ఖడ్గం.. మగధీర..

తెలుగులో ఖడ్గం.. మగధీర..

ఖడ్గం, మగధీర చిత్రాల్లో.. బాలీవుడ్‌లో ప్రవేశించకముందు తొలిసారి క్లోజప్ టూత్ పేస్ట్‌కు మోడల్‌గా పనిచేసింది. ఆ తర్వాత బిజీగా మారిన ఆమె సన్ సిల్క్, పెప్సీ, టాటా సఫారీ, పాండ్స్, ఫెయిర్ అండ్ లవ్లీ, క్లీన్ అండ్ క్లీన్, లిరిల్ వ్యాపార ప్రకటనలో కనిపించింది. 1993లో డర్ చిత్రంలో చిన్నపాత్రతో బాలీవుడ్‌లోకి ప్రవేశించింది. ఆ తర్వాత ఆదిత్య చోప్రా రూపొందించిన మొహబ్బతే చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. తెలుగులో ఖడ్గం, అంజనేయులు, మగధీర చిత్రాల్లో కనిపించింది.

English summary
Kim Sharma, best known as the Mohabbatein girl, disappeared from public memory after she moved to Kenya post her marriage. She was back in the news after her husband allegedly dumped her for another woman, leaving her penniless. Although the actor refuted the rumours, latest reports claim that Kim is working for free, as she gears up for her acting comeback.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu