»   »  రాజ వంశం కథతో ...'కింగ్'?

రాజ వంశం కథతో ...'కింగ్'?

Posted By:
Subscribe to Filmibeat Telugu
King
నాగార్జున,త్రిష జంటగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న కింగ్ సినిమాలో రాజ వంశం కి సంభంధించిన ఎపిసోడ్లు ఉన్నాయని రూఢీగా తెలుస్తోంది. పూర్తి ఎంటర్ టైన్ మెంట్ తో నడిచే ఈ కధలో నాగార్జున ఓ ప్రముఖ రాజ వంశానికి చెందిన వాడిని కొన్ని పరిస్ధితులు దృష్టా మూడు గెటప్స్ తో ఉండాల్సివస్తుందని సమాచారం. త్రిష ఈ సినిమాలో గాయినిగా నటిస్తోంది. ఇక బ్రహ్మానందం సంగీత దర్శకుడుగా కనపడి నవ్వించనున్నాడు. అలాగే రాజుల కి సంభంధించిన ఎపిసోడ్స్ మలేషియా భవన్ లో త్వరలో షూటింగ్ జరగనుంది. దాదాపు ఎనభై శాతం పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబర్ రెండవ వారంలో రిలీజ్ కి ప్లన్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని నాగార్జున పర్మనెంట్ నిర్మాత కామాక్షి మూవీస్ ...డి.శివప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X