»   » వివాదం తర్వాత తొలిసారిగా బయటకొచ్చిన అమీర్ ఖాన్ భార్య

వివాదం తర్వాత తొలిసారిగా బయటకొచ్చిన అమీర్ ఖాన్ భార్య

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'మత అసహనం' విషయంలో అమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా ఎంత పెద్ద దుమారం రేపాయో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. దేశంలో మత అసహనం పెరిగి పోతోంది. నా భార్య ఈ దేశం వదిలి వెళ్లిపోదాం అని అడుగుతోంది అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ఆ తర్వాత అమీర్ ఖాన్ తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు.

Kiran Rao Spotted For First Time After Aamir Khan’s Intolerance Controversy!

ఈ సంఘటన అనంతరం అమీర్ ఖాన్ భార్య కిరణ్ రావ్ తొలిసారిగా బయటకు వచ్చారు. ముంబాయిలో ఓ సినిమా స్క్రీనింగ్‌కు ఆమె హాజరైంది. బాలీవుడ్‌లో హిట్ అయిన 'ఆషికి 2' సినిమా ఫేమ్ ఆదిత్య రాయ్ కపూర్‌తోపాటు అమీర్‌ఖాన్ భార్య కిరణ్ రావు ముంబాయిలోని పీవీఆర్ సినిమా థియేటర్‌కు వచ్చింది.

అమీర్ ఖాన్ వివరణ ఇవ్వడంతో వివాదం సద్దుమనిగింది...
నేను, నా భార్య ఈ దేశం విడిచి వెళ్లాలని కోరుకోవడం లేదన్నారు. ఈ దేశాన్ని ప్రేమిస్తున్నాను, ఇక్కడే ఉంటాను, భారత గడ్డపై పుట్టినందుకు గర్వంగా ఉందన్నారు. దేశంలోని ప్రజల మధ్య సోదరభావం కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లు అమీర్ ఖాన్ తెలిపారు.

English summary
Bollywood actor Aditya Roy Kapoor, who rose to fame with ‘Aashiqui 2’, was spotted at PVR Cinemas in Mumbai last night at a movie screening. Along with Aditya, director and Aamir Khan’s wife Kiran Rao was also spotted attending the movie screening.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu