For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  లవ్‌గురు కామెడీ ('వెన్నెల 1 1/2' ప్రివ్యూ )

  By Srikanya
  |

  హైదరాబాద్ : కమిడియన్ వెన్నెల కిషోర్ దర్శకుడుగా మారి రూపొందించిన చిత్రం 'వెన్నెల వన్‌ అండ్‌ హాఫ్‌'. 'వెన్నెల'కు సీక్వెల్ గా రూపొందిన ఈ చిత్రం ఈ రోజే(శుక్రవారం)విడుదల అవుతోంది. సంతోషం అనేది మన చుట్టూ ఉండే వాతావరణం వల్ల రాదు. మనసు ప్రశాంతంగా ఉంటే నరకంలోనూ నవ్వుకోవచ్చు. లేదంటే స్వర్గంలోనూ సుఖం ఉండదు అనే ఆలోచన చుట్టూ అల్లుకున్న ఈ కథలో దర్సకుడు కిషోర్ తన ఖాధర్ పాత్రనే కంటిన్యూ చేస్తున్నారు. కథ మొత్తం బ్యాంకాక్ లో జరుగుతుంది.

  కథలే ....చదువు కోసం బ్యాంకాక్‌ వెళ్లిన ఓ యువకుడు కృష్ణ (చైతన్యకృష్ణ). అక్కడ లవ్‌గురు అవతారమెత్తుతాడు. ప్రేమ జంటల్ని కలపడం, విడదీయడం లాంటి పనులతో బిజీ బిజీగా గడుపుతుంటాడు. బ్యాంకాక్‌లోనే చదువుకొంటున్న వెన్నెల (మోనాల్‌ గజ్జర్‌)కీ, శ్రవణ్‌ (శ్రవణ్‌)కీ నిశ్చితార్థం జరుగుతుంది. అయితే... వీరి పెళ్లి మాత్రం జరగకూడదంటూ ఓ వ్యక్తి లవ్‌గురుని ఆశ్రయిస్తాడు. మరి పెళ్లి చెడగొట్టడంలో లవ్‌గురు ఎంత వరకు సఫలమయ్యాడు? ఇంతకీ వెన్నెల పెళ్లి ఆపేయాలనుకొన్న ఆ వ్యక్తి ఎవరు? అనే విషయాల్ని తెరపైనే చూడాలి.

  చైతన్య కృష్ణ, మోనాల్‌ గజ్జర్‌ జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రం కథ నేపధ్యం ఏమిటంటే.. వెన్నెల సినిమాలో ఉన్న పాత్రలే ఈ సినిమాలోనూ కంటిన్యూ అవుతాయి. ఆ సినిమాలో అమెరికాలో ఉద్యోగం చేసుకుంటూ ఉండే వారి ఉద్యోగాలు పోయి క్లిష్ట పరిస్దితులు వస్తాయి. అప్పుడు వారు వేరే దేశం వెళ్లాల్సిన పరిస్ధితి వస్తుంది. అప్పుడు ఏం జరిగిందనేది ఈ సినిమా.. ఈ చిత్రం మొత్తం బ్యాంకాక్ లో జరుగుతుంది. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్ తన ఖాధర్ పాత్రనే కంటిన్యూ చేస్తున్నారు.

  నిర్మాతల్లో ఒకరైన వర్మ మాట్లాడుతూ ''వెన్నెల'కి కొనసాగింపుగా తెరకెక్కిన చిత్రమిది. ఇందులోని ప్రతి పాత్ర కడుపుబ్బ నవ్విస్తుంది. విజయవాడలోనో, హైదరాబాద్‌లోనో చదివితే ఏం వస్తుంది? మహా అయితే మంచి ఉద్యోగం వస్తుంది. అదే... విదేశాలకెత్తే వూర్లో మంచి క్రేజ్‌ వస్తుంది. పైగా అక్కడి అమ్మాయిల్ని పటాయించొచ్చు. వారాంతాల్లో కావల్సినంత హంగామా చేయొచ్చు. ఆ అబ్బాయి కూడా అలాగే అనుకొన్నాడు. వెంటనే విమానం ఎక్కేశాడు. మరి అమ్మాయిల మనసులో స్థానం సంపాదించాడా? లేదా? ఈ విషయాలు తెలియాలంటే 'వెన్నెల వన్‌ అండ్‌ హాఫ్‌' చూడాల్సిందే'' అన్నారు.

  సమర్పణ: వింటేజ్‌ క్రియేషన్స్‌
  సంస్థ: జిఆర్‌8 ప్రొడక్షన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌
  నటీనటులు: చైతన్యకృష్ణ, మోనాల్‌ గజ్జర్‌, బ్రహ్మానందం, రఘుబాబు, శ్రవణ్‌, గిరి, తాగుబోతు రమేష్‌, ధన్‌రాజ్‌, మాస్టర్‌ భరత్‌ తదితరులు
  సంగీతం: సునీల్‌ కాశ్యప్‌,
  ఫోటోగ్రఫీ: సురేష్‌ భార్గవ్‌,
  సాహిత్యం: కృష్ణ చైతన్య, శ్రీమణి, సిరాశ్రీ
  నిర్మాతలు: వాసు, వర్మ
  దర్శకత్వం: వెన్నెల కిషోర్‌
  విడుదల: 21,సెప్టెంబర్ 2012

  English summary
  Vennela 1 1/2 is a comedy film going to release today. Chaitanya Krishna and Monal Gajjar are playing the lead roles and it also stars Vennela Kishore and Brahmanandam in important roles. Most part of the film was shot in Bangkok and it’s said to be a sequel to Vennela. Sunil Kashyap has composed the music.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X