»   » 1700 ధియోటర్లలో ఆ సినిమా ట్రైలర్స్..

1700 ధియోటర్లలో ఆ సినిమా ట్రైలర్స్..

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఏ చిత్రానికి లేనంత బిగ్ పబ్లిసిటీతో హృతిక్ రోషన్ తాజా చిత్రం 'కైట్స్' ప్రేక్షకుల ముందుకు వస్తోంది. 1700 ధియోటర్లలో ఈ చిత్రం ట్రైలర్స్ ని రిలీజ్ చేసారు. పిబ్రవరి 12 శుక్రవారం నుంచి అఫీషియల్ గా ఈ ట్రైలర్స్ ని ప్రదర్శిస్తున్నారు. అనురాగబసు దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం హిందీ,ఇంగ్లీష్ బాషల్లో రూపొందుతోంది. రిలియన్స్ బిగ్ పిక్చర్స్ వారు ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. వారి సీఈఓ సంజీవ్ లంబా మాట్లాడుతూ..కైట్స్ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. వాటిని అందుకునే ప్రయత్నంలోనే ఈ తరహా పబ్లిసిటీ వ్యూహాన్ని అనుసరిస్తున్నాం. మరో మూడునెలల్లో ఈ చిత్రం ధియోటర్స్ లో ఉంటుంది. ఇప్పటికే ఈ చిత్రం ప్రోమోలకు మంచి స్పందన వస్తోంది. సినిమా వాటికి మించిన రీతిలో అద్భుతం చూస్తున్న ఫీలింగ్ ని ఇస్తుంది అంటున్నారు. ఇక ఈ చిత్రంలో హృతిక్ రోషన్, బార్బరా మోరి జంటగా చేస్తున్నారు. హిందీ, ఇంగ్లీష్ వెర్షన్స్ రెండూ ప్రపంచ వ్యాప్తంగా మే ఇరవై ఒకటవ తేదీన అరవై దేశాల్లో రిలీజ్ చేస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu