»   » ‘పురందర దాసు’ అవతారంలో రజనీకాంత్ (ఫోటోలు)

‘పురందర దాసు’ అవతారంలో రజనీకాంత్ (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

బెంగుళూరు : తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కర్ణాటక సంగీత ఆధ్యుడు పురందర దాసు అవతారంలో కనిపించబోతున్నారు. అలా అని రజనీకాంత్ పురందర దాసు జీవిత చరిత్రపై సినిమా చేస్తున్నారని అనుకోవద్దు. ఓ కళాకారుడు పురందర దాసు వేషధారణలో రజనీకాంత్ పేయింటింగ్ వేసారు.

శ్రీ పురందర ఇంటర్నేషనల్ ట్రస్ట్ రజనీకాంత్‌ను లాస్ట్ వీక్ సన్మానించేందుకు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో ఆ పేయింటింగును రజనీకాంత్‌కు ప్రధానం చేయాలనుకున్నారు. అయితే తన తాజా సినిమా 'కొచ్చాడయాన్' సినిమా బిజీ షెడ్యూల్ వల్ల రజనీకాంత్ హాజరు కాలేక పోయారు. దీంతో దాన్ని రజనీ స్నేహితుడు రాజ్ బహదూర్‌కు ప్రదానం చేసారు.

బిజీ షెడ్యూల్ వల్ల రాలేక పోతున్నానని, తన స్నేహితుడు రాజ్ బహదూర్‌కు ఆ బహుమతిని రిసీవ్ చేసుకుంటారని, అతని వద్ద నుంచి తాను పికప్ చేసుకుంటానని రజనీ చెప్పినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో రజనీ బంధువు గోపీనాథ్ రావు కూడా హాజరయ్యారు. తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టు ఆనంద తీర్థాచారి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసారు.

స్లైడ్‌షోలో మరిన్ని వివరాలు

గురువందన కార్యక్రమం

గురువందన కార్యక్రమం


శ్రీ పురందర ఇంటర్నేషనల్ ట్రస్టు వారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసారు. ట్రస్టు ప్రతినిదులైన మోహన్ కుమార్, సువర్ణ మోహన ఈకార్యక్రమం నిర్వాహకులు. ఈ కార్యక్రమానికి గురు వందన అనే పెట్టారు. గురు వందన అనగా గురువును సన్మానించుట అని అర్థము.

సీడీల విడుదల

సీడీల విడుదల


ఈ సందర్భంగా కర్నాటక సంగీత రంగంలో సేవలు అందిస్తున్న పలువు ప్రముఖులను సన్మానించారు. అదే విధంగా నవరత్న మాలిక సీడీలు విడుదల చేసారు. కర్ణాటక సంగీతానికి సంబంధించిన గీతాలు ఈ సీడీలో పొందు పరిచినట్లు తెలుస్తోంది.

ఈ ఐడియా ఎలా వచ్చిందంటే...

ఈ ఐడియా ఎలా వచ్చిందంటే...


రజనీకాంత్‌ను పురందర దాసు రూపంలో చిత్రీకరించాలనే ఐడియాకు ప్లాన్ చేసింది ట్రస్టు నిర్వాహకుల్లో ఒకరైన మోహన్ కుమార్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు సంవత్సరాల క్రితమే రజనీకాంత్‌ను పురందర దాసు అవతారంలో చిత్రీకరించాలనే ప్లాన్ చేసామని తెలిపారు.

రజనీకాంత్ రాలేక పోయారు

రజనీకాంత్ రాలేక పోయారు


రజనీ రూపాన్ని పురందర దాసు రూపంలో ఎంతో అందంగా ఆయిల్ పేయింటింగ్ చేసారు. దీన్ని ఆయనకు ప్రదానం చేద్దామని ఏర్పాటు చేసిన కార్యక్రమానికి బిజీ షెడ్యూల్ వల్ల రజనీకాంత్ హాజరు కాలేక పోయారు. రజనీ ప్రస్తుతం కొచ్చాడయాన్ సినిమా షూటింగులో బిజీగా ఉన్నారు.

రజనీ క్లోజ్ ఫ్రెండ్ రాజ్ బహదూర్

రజనీ క్లోజ్ ఫ్రెండ్ రాజ్ బహదూర్


రజనీకాంత్ తాను రాలేక పోతున్న విషయాన్ని నిర్వహకులకు వెల్లడించారు. తన స్నేహితుడు రాజ్ బహదూర్ పేయింటింగును అందుకుంటారని నిర్వాహకులకు ముందుగానే సమాచారం అందించారు. దీంతో దాన్ని రాజ్ బహదూర్ కు ప్రదానం చేసారు.

రజనీకాంత్ గురించి రాజ్ బహదూర్

రజనీకాంత్ గురించి రాజ్ బహదూర్


రజనకాంత్ తరుపున పేయింటింగును స్వీకరించిన అనంతరం రాజ్ బహదూర్ మాట్లాడుతూ...రజనీకాంత్ కేవలం నటుడు మాత్రమే కాదని, ఎంతో గొప్ప వ్యక్తి అని చెప్పుకొచ్చారు. రజనీకాంత్ ను పురంద దాసు అవతారంలో చూడటం ఎంతో ఆనందంగా ఉందన్నారు.

ఈ గౌరవం రజనీకాంత్‌కే

ఈ గౌరవం రజనీకాంత్‌కే


రాజ్ బహదూర్ మాట్లాడుతూ.....నేను కేవలం రజనీకాంత్ తరుపు మాత్రమే ఇక్కడ పాల్గొంటున్నాను. రజనీ తరుపున తాను స్వీకరించినా ఈ సన్మానం రజనీకాంత్‌కే చెందుతందని రాజ బహదూర్ సభా ముఖంగా స్పష్టం చేసారు.

ఆర్‌కె శ్రీకాంతన్‌కు సన్మానం

ఆర్‌కె శ్రీకాంతన్‌కు సన్మానం


ఈ సందర్భంగా ప్రముఖ సంగీత విద్వాంసుడు ఆర్‌కె శ్రీకాంతన్‌ను కూడా ట్రస్టు వర్గాలు సన్మానించాయి. ఈ కార్యక్రమానికి బిజేపీ జాతీయ కార్యదర్శి అనంత కుమార్ భార్య తేజస్విని తదితరులు హాజరయ్యారు.

English summary
Sri Purandara International Trust had planned a ceremony to felicitate Rajinikanth last week at Town Hall in Bangalore. But as the superstar is busy with his next multilingual movie Kochadaiyaan, it was gifted to his close friend Raj Bahadur.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu