»   » ‘రజనీ’ కొచ్చాడయాన్: మెడీ కోసం స్పెషల్ షో

‘రజనీ’ కొచ్చాడయాన్: మెడీ కోసం స్పెషల్ షో

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: తమిళ సూపర్ స్టర్ రజనీకాంత్ నటించిన 'కొచ్చాడయాన్' చిత్రం మే 9న గ్రాండ్‌గా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. రజనీకాంత్ సినిమా కావడం, భారత దేశంలో తెరకెక్కిన తొలి మోషన్ కాప్చర్ చిత్రం కావడంతో సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ తరహా 3డి చిత్రం రావడంతో భారతీ సినీ రంగంలో ఇదే తొలిసారి.

ఈ చిత్రం కోసం రజనీకాంత్ అభిమానులు మాత్రమే కాదు....బిజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ కూడా ఆసక్తి చూపుతున్నారట. తన సినిమా పట్ల మోడీ చూపుతున్న ఆసక్తిని గమనించిన రజనీకాత్ ఆయన కోసం ప్రత్యేకంగా షో ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. గుజరాజత్‌లో ఈ షో ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల రజనీకాంత్ మోడీకి తన మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే.

 Kochadaiyaan Special Screening for Modi

ఈ చిత్రాన్ని ప్రధానంగా తమిళం, తెలుగు, హిందీ బాషలతో పాటు ఇతర బాషల్లోనూ రిజలీ చేస్తున్నారు. తెలుగులో ఈచిత్రం 'విక్రమసింహ' పేరుతో విడుదల కానుంది. 'విక్రమ సింహ' చిత్రం రాజుల నాటి కథాంశంతో తెరకెక్కిన సినిమా. రజనీ కూతురు ఐశ్వర్య ఆర్ అశ్విన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కెఎస్ రవి కుమార్ స్క్రిప్టు అందించారు. పాండ్య సామ్రాజ్య రాజు కొచ్చాడయాన్ రణధీరన్ స్టోరీ ఇన్స్‌స్పిరేషన్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

రజనీకాంత్-దీపిక పదుకోన్ జంటగా నటించిన ఈ చిత్రం దాదాపు రూ. 125 కోట్ల బడ్జెట్ ఖర్చు చేసారు. దీపిక పదుకోన్, జాకీష్రాఫ్, శరత్ కుమార్, శోభన, ఆది, నాజర్ తదితరులు ముఖ్యమైన పాత్రలు పోషించారు.

English summary
Narendra Modi will be watching "Kochadaiyaan" in a special screening for him. It was claimed that Modi likes Masala movies and has expressed his wish to watch kochadaiyaan for which a special screening in Ahmedabad will be organised for him on 8th May.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu