»   »  రామ్ చరణ్ తో 'ఖైదీ' సీక్వెల్ ?

రామ్ చరణ్ తో 'ఖైదీ' సీక్వెల్ ?

Posted By:
Subscribe to Filmibeat Telugu
Ram Charan Teja
మెగాస్టార్ చిరంజీవి సినీ కెరీర్ ని ఓ మలుపు తిప్పిన చిత్రం 'ఖైదీ'. ఈ చిత్రం నిన్న దసరాకు రిలీజై పాతికేళ్ళు(1983) పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు కోదండరామిరెడ్డి మాట్లాడుతూ ఆ సినిమాకు సీక్వెల్ నిర్మిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన ఆయన వెళ్ళబుచ్చారు. అయితే ఈ చిత్రం సీక్వెల్ చేస్తే చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ తేజతోనే చేయాలి. అయితే ఆ గెటప్ ని చిరుత సినిమాలో పూరీ ఉపయోగించారు.అయినా అతనే ఈ తరంలో ఆ పాత్రకు సూటవుతాడు అని ఆయన చెప్పుకొచ్చారు.

అంటే ఎవరైనా నిర్మాత ముందుకొస్తే ఆయన ఈ సీక్వెల్ తీయటానికి రెడీనే అన్నమాట. అయితే రామ్ చరణ్ తేజ ఒప్పుకుంటాడా...అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇక కథ కోసం అంటారా ...ఖైదీ సినిమాకు 'ఫస్ట్ బ్లడ్' అనే హాలీవుడ్ సినిమా స్పూర్తి . ఆ సినిమాకూ సీక్వెల్స్ వచ్చాయి. హిట్టయ్యాయి. మరి పరుచూరి వారు వాటిని ఓ సారి తిరిగేస్తే మరో సబ్జెక్టు రెడీ అవుతుంది ...కాబట్టి ఆ పనే మేలు కదా అని కొందరు సీనియర్లు ఈ సందర్బంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఇవన్నీ ప్రక్కన పెడితే తండ్రి తెరపై పండించిన పాత్రను కొడకు ఎట్లా ప్రెజెంట్ చేస్తాడనేది ఎప్పుడూ ఆసక్తే కదా...

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X