»   » తెలంగాణవారికి 40 శాతం దక్కాలి: కోదండరామ్

తెలంగాణవారికి 40 శాతం దక్కాలి: కోదండరామ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలంగాణవారికి 40 శాతం దక్కాలి. రాష్ట్ర ఆర్థిక రంగం మాదిరిగానే కొంత మంది సంపన్న వర్గాల గుత్తాధిపత్యంలో సినిమా పరిశ్రమ ఉంది. అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షల్నీ, కళల్నీ వ్యక్తీకరించడానికి అవకాశం కల్పించాలి. సినిమా పరిశ్రమకి సంబంధించి ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలు, స్టూడియోలకు భూముల కేటాయింపులు, ఇతర సహాయ సహకారాలు తెలంగాణవారికి దక్కాలి. నేడు సినిమాల విడుదల పెద్ద సమస్యగా మారింది. జానపద ఇతివృత్తంతో రూపొందిన 'మైనావతి' ప్రదర్శనకు ఎగ్జిబిటర్లు సహకరించాలి అని చెప్పారు.

తెలంగాణలోని గ్రామగ్రామాన వేళ్లూనుకున్న మైనావతి కథతో రూపుదిద్దుకున్న 'మైనావతి' చిత్రం ప్రాంతీయ భేదాలు లేకుండా తెలుగువాళ్లందర్నీ ఆకట్టుకుంటుందనే నమ్మకాన్ని తెలంగాణకు చెందిన ప్రజా నాయకులు, కళాకారులు వ్యక్తం చేశారు. చిత్ర దర్శకుడు ఎర్రం వేణుగోపాల్ మాట్లాడుతూ అన్నిటికీ ఆధారమైన అమ్మ జీవితంలో ఎంత ఒత్తిడి అనుభవిస్తున్నదనేది ఈ చిత్రంలోని ప్రధానాంశమన్నారు. ఈ చిత్రానికి 75 శాతం తెలంగాణ కళాకారులు పనిచేశారనీ, తొలి తెలంగాణ జానపద చిత్రమైన 'మైనావతి' ని త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామనీ నిర్మాత విజయ్‌ కుమార్ చెప్పారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu