»   » తెలుగు ప్రేక్షకులు మరో అద్భుతమైన చిత్రాన్ని చూడబోతున్నారు: కోడి రామకృష్ణ

తెలుగు ప్రేక్షకులు మరో అద్భుతమైన చిత్రాన్ని చూడబోతున్నారు: కోడి రామకృష్ణ

Posted By:
Subscribe to Filmibeat Telugu

రమ్య ప్రధాన పాత్రధారిణిగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'నాగభరణం'. పెన్‌ మూవీస్‌, ఇన్‌బాక్స్‌ పిక్చర్స్‌, బ్లాక్‌బస్టర్‌ స్టూడియో పతాకాలపై జయంతి లాల్‌ గాడా, సాజిద్‌ ఖురేషి, సొహైల్‌ అన్సారీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేసే హక్కులను స్టూడియో గ్రీన్‌ అధినేత కె.ఇ.జ్ఞానవేల్‌రాజా సొంతం చేసుకున్నారు.

'బాహబలి' చిత్రానికి అద్భుతమైన విజువల్‌ ఎఫెక్ట్స్‌ని క్రియేట్‌ చేసిన మకుట ఈ చిత్రానికి కూడా వండర్‌ఫుల్‌ విజువల్‌ ఎఫెక్ట్స్‌ని చేస్తున్నారు. ఆ విజువల్‌ ఎఫెక్ట్స్‌ చాలా అద్బుతంగా ఉండనున్నాయని టాక్. కన్నడ సూపర్‌స్టార్‌ విష్ణువర్థన్‌ను ఈ చిత్రంలో విజువల్‌ ఎఫెక్ట్స్‌తో క్రియేట్‌ చేయడం ఓ వండర్‌ అని అందరూ ప్రశంసించడం విశేషం.

40 కోట్ల భారీ బడ్జెట్‌తో అద్భుతమైన గ్రాఫిక్స్‌తో విజువల్‌ వండర్‌గా కన్నడ లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయనున్నారు. ఈ మధ్యనే విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌, టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.

Nagabharanam Official Teaser

Kodi Ramakrishnas visual wonder Nagabharanam is ready to Release

పూర్వజన్మలో ఓ అమ్మాయి పొగొట్టుకున్న ఎమోషన్‌ను ఎలా సాధించిందనే కథాంశంతో రూపొందించిన సినిమా. కన్నడ లో "నాగ హరవు" గా చెప్పిన సినిమా. రామ కృష్ణ మాట్లాడుతూ "విజువల్‌గా మేం అనుకున్న దానికంటే చాలా బాగా వచ్చింది. తప్పకుండా తెలుగు ప్రేక్షకులు మరో అద్భుతమైన చిత్రాన్ని చూడబోతున్నారు" అని అన్నారు.

శ్యాం ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ "కోడిరామకృష్ణ 1989లో 9 చిత్రాలను ఒకేసారి రిలీజ్ చేశారు. ఏడాదిలో 365 రోజులు ఆయన సినిమాలు థియేటర్స్ లో ఆడేలా చూసుకునేవారు. ఆయన 30 ఏళ్ళుగా సుప‌రిచితుడు. మేం కలిసి ఎన్నో సినిమాలు చేశాం. ఒక‌వేళ నేను సినిమాలు తీయాల‌నుకుంటే కోడిరామకృష్ణ తో తప్ప వేరొక‌రితో చేయ‌ను. ఈసారి సినిమా తీసినా ఆయ‌న‌తోనే.

మకుట విజువల్ ఎఫెక్ట్స్ లాంటి పెద్ద కంపనీ ఈ సినిమా గ్రాఫిక్స్ కోసం పని చేస్తోంది. నాకు విజువల్ ఎఫెక్ట్స్ సినిమాలంటే చాలా ఇష్టం. కామన్ మ్యాన్ చాలా తొందరగా ఇలాంటి సినిమాలు కనెక్ట్ అవుతారు. నాగ‌భ‌ర‌ణం టీజర్ చూస్తుంటే భారీ హిట్ అనిపిస్తోంది" అన్నారు.

English summary
Kodi RamaKrishna is one of the talented film maker of South Indian Film Industry who is known for making visual effects based movies.. Now he is ready with anether surprize "nagabhranam" wich is ready to launch in kannada.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu