For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఆ సినిమా కోసం తెలుగు లోనూ ఎదురుచూస్తున్నారు, మరో గ్రాఫిక్ అద్బుతం ఆ సినిమా

  |

  "అమ్మోరు", "అరుంధతి" చిత్రాల సృష్టికర్త తెలుగు దర్శక దిగ్గజం కోడి రామకృష్ణ తెరకెక్కించిన మరో విజువల్‌ వండర్‌ దేవతా చిత్రం 'శివనాగం'. కన్నడంలో భారీ బడ్జెట్‌తో రూపొందించిన ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమవుతోంది. వచ్చే 14వ తేదీన 'శివనాగం'ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. దేవతా చిత్రాలకు దక్షిణాది భాషల్లో ఉన్న ఆదరణ దృష్ట్యా ఈ చిత్రాన్ని తమిళం, తెలుగు భాషల్లో కూడా విడుదల చేస్తున్నారు.

  అయితే కావేరీ జలాల వ్యవహారంలో కర్ణాటక, తమిళనాడుల మధ్య చిచ్చు రేగడంతో 'శివనాగం' విడుదలపై సందిగ్ధత ఏర్పడింది. ప్రభుత్వాలకు సంబంధించిన ఈ వ్యవహారంలో కన్నడ తారలు జోక్యం చేసు కోవడంపై తమి ళ ప్రజలు ఆగ్ర హం ఉన్న నేప థ్యంలో 'శివనాగం' తమిళంలో విడుదల కావడం సందేహమే అంటున్నారు. అయితే ఇటు కన్నద లోనూ, తెలుగు లో కూడా ఈ సినిమా పై భారీ అంచనాలే ఉన్నాయి. కోడి రామకృష్ణ అంటేనే గ్రాఫిక్స్ మాయాజాలం తో చేసే అద్బుతం అన్న అభిప్రాయం ఉండటం తో టాలీవుడ్ లోనూ "నాగ భరణం" పై ఆసక్తి ఏర్పడింది .

  Kodi RamakRshna about Nagarahavu

  తన దర్శకత్వంలో తెరకెక్కిన 'నాగభరణం' సినిమాకు అటు కన్నడలో.. ఇటు తెలుగులో ఇంత క్రేజ్ వస్తుందని తాను అస్సలు ఊహించలేదంటున్నాడు సీనియర్ డైరెక్టర్ కోడి రామకృష్ణ. రమ్య.. దిగంత్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ గ్రాఫిక్స్ ప్రధాన చిత్రం కొంత కాలంగా చర్చనీయాంశం అవుతోంది. కోడి రామకృష్ణ గ్రాఫిక్స్ సినిమాలు తీయడం కొత్తేమీ కాదు కానీ.. ఇందులో దివంగత నటుడు విష్ణువర్ధన్ రూపాన్ని రీక్రియేట్ చేసి పది నిమిషాల పాటు ఆ పాత్రను తెరమీద చూపించారన్న సమాచారం ఈ సినిమాకు హైప్ తీసుకొచ్చింది. ఈ నెల 14న కన్నడ.. తెలుగు భాషల్లో రిలీజవుతున్న ఈ చిత్రం గురించి కోడి రామకృష్ణ ఏమంటున్నాడంటే..

  "నేను తెలుగులో చేసిన చాలా సినిమాలు వేరే భాషల్లోకి డబ్ అయ్యేవి. ఐతే ఈసారి కన్నడలో చేసిన ఓ సినిమా తెలుగులో వస్తోంది. ఇది కన్నడ సినిమా అయినా.. నిర్మాతలు తెలుగు వర్షన్ కోసం చాలా జాగ్రత్తలు తీసుకుని చేశారు. తెలుగులో 600 థియేటర్లలో రిలీజవుతోంది. నా సినిమాలన్నింటికీ విడుదల సమయంలో మంచి క్రేజ్ ఉంటుంది. ఐతే 'నాగభరణం' విషయంలో ఈ స్థాయి క్రేజ్ అస్సలు ఊహించలేదు.

  ఇప్పుడు కర్ణాటకలో ఎక్కడ చూసినా ఈ సినిమా పేరే వినిపిస్తోంది. తెలుగులో కూడా అంతే హైప్ వచ్చింది. విష్ణువర్ధన్ గారిని పునఃసృష్టించడమే ఈ సినిమాకు ఇంత హైప్ రావడానికి కారణం. చనిపోయిన వ్యక్తిని ఇలా మళ్లీ ఆవిష్కరించడం అన్నది ఇండియన్ సినిమాలో అతి పెద్ద ప్రయోగం. విజువల్స్ చూశాక విష్ణువర్ధన్ గారి భార్య ఏడ్చేశారు. చివరి 15 నిమిషాల్లో ఒక బలమైన పాత్ర కథను మలుపు తిప్పుతుంది. ఆ పాత్రలోనే విష్ణువర్ధన్ గారిని చూపించాం" అని కోడిరామకృష్ణ చెప్పారు.

  English summary
  Kodi Ramakrishna’s latest Kannada film, Nagarahavu. Recently, the film’s teaser which showcases the revived Vishnuvardhan has gotten a tremendous response from fans.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X