»   »  హాస్యవిరాట్ బాబుమోహన్, చక్రి తరుపు భార్యకు అవార్డు (ఫోటోస్)

హాస్యవిరాట్ బాబుమోహన్, చక్రి తరుపు భార్యకు అవార్డు (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలంగాణా టెలివిజన్ డెవలప్ మెంట్ ఫోరం, తెలంగాణా ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ‘కోహినూర్' అవార్డ్స్ -2014 ప్రదానోత్సవ కార్యక్రమం ఫిలిం చాంబర్‌లో జరిగింది. తెలంగాణా టెలివిజన్ డెవెలప్ మెంట్ ఫోరం అధ్యక్షుడు నాగబాల సురేష్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమం‌లో సినిమా రంగంలోని వివిధ విభాగాల్లో సేవలు అందించిన వారికి కోహినూర్ అవార్డులను అందజేశారు.

తెలంగాణా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర కరణ్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ కమీషనర్ పార్థ సారథి ముఖ్య అథిదులుగా హాజరైయ్యారు. ప్రముఖ హాస్య నటుడు బాబు మోహన్‌కు లైఫ్ టైం ఎచీవ్ మెంట్ అవార్డ్ తో పాటు ‘హాస్యనటవిరాట్' అనే బిరుదును ప్రధానం చేశారు. దివంగత ప్రముఖ సంగీత దర్శకుడు చక్రికి కూడా ఈ అవార్డు అందజేసారు. ఆయన తరుపున చక్రి భార్య శ్రావణి అవార్డు అందుకున్నారు.

కోహినూర్ అవార్డ్ నిర్వాహకులు, సభాధ్యక్షులు నాగబాల సురేష్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాత అందిస్తున్న మొట్ట మొదటి అవార్డు ఇదేనని అన్నారు. ఇంతమంది ఉన్నతమైన సేవలు అందించిన వారిని సన్మానించడం సంతోషంగా ఉందని చెప్పారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

సాన యాదిరెడ్డి

సాన యాదిరెడ్డి


కోహినూర్ అవార్డు అందుకుంటున్న నిర్మాత సాన యాదిరెడ్డి.

అల్లాని శ్రీధర్

అల్లాని శ్రీధర్


కోహినూర్ అవార్డు అందుకుంటున్న దర్శకుడు అల్లాని శ్రీధర్.

సుద్దాల అశోక్ తేజ

సుద్దాల అశోక్ తేజ


కోహినూర్ అవార్డు అందుకుంటున్న ప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ.

చక్రి

చక్రి


దింగత సంగీత దర్శకుడు చక్రి తరుపున ఆయన సతీమణి శ్రావణి కోహినూర్ అవార్డు అందుకున్నారు.

శివారెడ్డి

శివారెడ్డి


ప్రముఖ మిమిక్రి కళాకారుడు, నటుడు శివారెడ్డి కోహినూర్ అవార్డు అందుకుంటున్న దృశ్యం.

శోభలత

శోభలత


కోహినూర్ అవార్డు అందుకుంటున్న మేకప్ వుమెన్ శోభలత

మల్లికా

మల్లికా


కోహినూర్ అవార్డు అందుకుంటున్న నటి మల్లికా.

మంత్రికి సన్మానం

మంత్రికి సన్మానం


తెలంగాణా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర కరణ్ రెడ్డిని సన్మినిస్తున్నదృశ్యం

English summary
Kohinoor Awards to Telangana Cinema industry personalities Babu Mohan, Suddhala Ashok Teja, Sana Yadireddy, Chakri and others.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu