For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సినీ పరిశ్రమలో మరో విషాదం: స్టార్ డైరెక్టర్ ఆనంద్ కన్నుమూత.. ఆ బడా హీరోతోనే ఎక్కువ సినిమాలు!

  |

  ఈ మధ్య కాలంలో సినీ ఇండస్ట్రీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే ఎంతో మంది ఆర్టిస్టులు, టెక్నీషియన్లు కరోనా మహమ్మారి కారణంగా కన్నుమూసిన విషయం తెలిసిందే. చాలా మంది పలు కారణాలతో ప్రాణాలను కోల్పోయారు. దీంతో అన్ని పరిశ్రమల్లోనూ వరుస షాకులు తగులుతున్నాయి. ఇలాంటి సమయంలోనే పరిశ్రమకు మరో ఎదురుదెబ్బ తగిలింది. తమిళ సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ దర్శకుడు కేవీ ఆనంద్ శుక్రవారం ఉదయం కన్నుమూశారు. ఆయన మరణంతో పరిశ్రమలో విషాద ఛాయలు అలముకున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే...

  #RIPKVAnand: Allu Arjun ఎమోషనల్‌.. ప్రముఖుల సంతాపం KV Anand చిత్రాలు పెద్ద హిట్ || Filmibeat Telugu
   కోలీవుడ్ డైరెక్టర్ కేవీ ఆనంద్ మృతి

  కోలీవుడ్ డైరెక్టర్ కేవీ ఆనంద్ మృతి

  కెమెరామెన్‌గా కెరీర్‌ను ఆరంభించి.. దర్శకుడిగా మారిన కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ కేవీ ఆనంద్ ఈరోజు తెల్లవారుజామున 3 గంటల సమయంలో మరణించారు. రాత్రి సమయంలో ఆయనకు ఛాతి నొప్పి వచ్చిందని.. ఆ వెంటనే ఇంట్లోనే తుది శ్వాసను విడిచారని తెలుస్తోంది. ఆయనను పరిశీలించిన తర్వాత మరణానికి కారణం కార్డిక్ అరెస్ట్ అని వైద్యులు తేల్చినట్లు సమాచారం.

  మొన్న ఆయన.. ఇప్పుడు ఈయన

  మొన్న ఆయన.. ఇప్పుడు ఈయన

  తమిళ సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ కమెడియన్ వివేక్ ఇటీవలే మరణించిన విషయం తెలిసిందే. ఇది జరిగిన కొద్ది రోజులకే ఇప్పుడు దర్శకుడు కేవీ ఆనంద్ కన్నమూశారు. దీనిపై సినీ ప్రముఖులంతా దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ట్వీట్లు చేస్తున్నారు. వరుస మరణాల కారణంగా కోలీవుడ్‌లో ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.

  అలా మొదలైన కేవీ సినీ ప్రయాణం

  అలా మొదలైన కేవీ సినీ ప్రయాణం

  కేవీ ఆనంద్ ఫోటో జర్నలిస్టుగా కెరీర్‌ను ఆరంభించారు. ఈ క్రమంలోనే పలు పత్రికలకు పని చేశారు. ఆ తర్వాత సినిమా ఫీల్డులోకి ఎంట్రీ ఇచ్చారు. అప్పుడు సీనియర్ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ దగ్గర కొంత కాలం సహాయకుడిగా పని చేశారు. అనంతరం ‘తెన్మవిన్ కొంబత్' అనే మలయాళ చిత్రంతో కెమెరామెన్‌గా మారారు. అక్కడి నుంచి ఎన్నో చిత్రాలకు సినిమాటోగ్రాఫర్‌గా చేశారు.

  అలా దర్శకుడిగా మారిన ఆనంద్

  అలా దర్శకుడిగా మారిన ఆనంద్

  సినిమాటోగ్రాఫర్‌గా ఎన్నో చిత్రాలకు పని చేసిన కేవీ ఆనంద్.. 2005లో వచ్చిన ‘కన కందైన్' అనే సినిమాతో దర్శకుడిగా మారారు. అప్పటి నుంచి ఆయన దాదాపు ఏడు సినిమాలను తెరకెక్కించారు. అందులో చాలా వరకూ విజయాలే ఉన్నాయి. అందుకే ఆయనకు కోలీవుడ్‌లోనే కాకుండా దక్షిణాది మొత్తంగా మంచి పేరు దక్కింది. ఆయనకు నేషనల్ అవార్డు కూడా వచ్చింది.

  ఆ స్టార్‌తో ఎక్కువ... తెలుగులోకి

  ఆ స్టార్‌తో ఎక్కువ... తెలుగులోకి

  దర్శకుడిగా కేవీ ఆనంద్ చేసిన చిత్రాలు తెలుగులోకి సైతం అనువాదం అయ్యాయి. అందులో సూర్య నటించినవే మూడు ఉన్నాయి. అప్పుడెప్పుడో వచ్చిన ‘వీడొక్కడే'తో పాటు ఆ మధ్య ‘బ్రదర్స్' అనే సినిమా వచ్చింది. ఇక, ఆయన చివరి చిత్రం ‘బందోబస్త్' కూడా తెలుగులో రిలీజ్ అయింది. అలాగే, జీవా నటించిన ‘రంగం' మన దగ్గర ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

  సినీ ప్రముఖులు సంతాపం.. ట్వీట్లు

  సినీ ప్రముఖులు సంతాపం.. ట్వీట్లు

  దాదాపు రెండు దశాబ్ధాలుగా తమిళ చలన చిత్ర పరిశ్రమలో విశేషమైన సేవలు అందించడంతో పాటు తన పనితనంతో ఎంతో మందిని మెప్పించిన కేవీ ఆనంద్ మరణ వార్త కోలీవుడ్‌ను కుదిపేసింది. దీంతో ఆయన మృతికి సంతాపం తెలుపుతూ సినీ ప్రముఖులంతా ట్వీట్లు చేస్తున్నారు. దీంతో ట్విట్టర్ RIPKVSIR, RIPKVANAND అనే హ్యాష్ ట్యాగ్స్ విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.

  English summary
  Kumar Venkatesan Anand was an Indian cinematographer, film director and former photo journalist, working mainly in the Tamil Film Industry. After a short period as a journalist, he became a cinematographer in the early 1990s, working for about fifteen films in the Southern and Bollywood industries.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X