»   » పవన కళ్యాణ్ 'కొమురం పులి ' ఆడియో రిలీజ్ డిటేల్స్

పవన కళ్యాణ్ 'కొమురం పులి ' ఆడియో రిలీజ్ డిటేల్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

పవన్ కళ్యాణ్, ఎస్ జె సూర్య కాంబినేషన్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న 'కొమురం పులి' చిత్రం ఆడియో జూన్ 27న రిలీజ్ కానుంది. ఈ పంక్షన్ కి హైదరాబాద్ లోని శిల్పకళావేదిక...వేదిక కానుంది. పరిశ్రమలోని ప్రముఖులంతా ఈ ఆడియోలో పాల్గొననున్నారని సమాచారం. ఆస్కార్ విజేత ఎఆర్ రహమాన్ ఎ.ఆర్.రహమాన్ అందించిన ట్యూన్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలెట్ గా నిలుస్తాయని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిఖిషా పటేల్ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం జూలై రెండవ వారంలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. కనకరత్న మూవీస్ బ్యానర్ పై శింగనమల రమేష్ నిర్మించే ఈ చిత్రంలో శ్రియ ఓ ఐటం సాంగ్ చేస్తోంది. జల్సా చిత్రం రిలీజై చాలా కాలం అవటంతో ఈ 'కొమురం పులి' చిత్రం కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇక ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. అంతేగాక 'కొమురం పులి'లో పవన్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని వినికిడి.

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu