twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అఖిల్ ఫెయిల్యూర్‌కి నేను బాద్యున్ని కాదు...

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: తెలుగు సినిమా పరిశ్రమలో స్టార్ రైటర్ గా పేరు తెచ్చుకున్న కోన వెంకట్ పని చేసిన పెద్ద సినిమాలు ఈ మధ్య బాక్సాఫీసు వద్ద బోల్తా పడ్డాయి. రామ్ చరణ్ నటించిన ‘బ్రూస్ లీ' సినిమాకు కోన వెంకట్ రచయితగా పని చేసారు. అయితే సినిమా బాక్సాఫీసు వద్ద భారీ ఫెయిల్యూర్ గా నిలిచి పోయింది.

    అయితే కోన వెంకట్ మాత్రం ఈ సినిమా అపజయం పాలవ్వడం వెనక తన ప్రమేయం లేదన్నారు. నేను రాసిన కథలో మార్పులు చేసారు. నేను రాసిన సీన్లను దర్శకుడు శ్రీను వైట్ల ఉపయోగించలేదు అని చెప్పుకొచ్చారు. అదే సమయంలో ‘అఖిల్' మూవీ ఫెయిల్ అవ్వడంపై కూడా కోన తనదైన రీతిలో స్పందించారు.

    Kona Venkat about Akhil’s Failure

    అఖిల్ సినిమా ఫెయిల్యూర్ కి... నాకు లింకు పెట్టొద్దు, నేను ఆ సినిమాకు డైలాగులు మాత్రమే రాసాను. సినిమా కథ, స్క్రీన్ ప్లే వేరే రచయితలు రాసారు అని కోన వెంకట్ చెప్పకొచ్చారు. నా పని రచయిత, దర్శకుడు చెప్పింది రాసివ్వడమే. మహా అయితే, వాళ్ళకు సలహా, సూచన చెప్పగలం. అంతకు మించి తల దూర్చకూడదు. త్వరలో రాబోతున్న ‘శంకరాభరణం' సినిమా సక్సెస్‌తో తానేమిటో నిరూపించుకుంటాను అంటున్నారు.

    ‘శంకరాభరణం' వివరాల్లోకి వెళితే...
    ‘‘స్వామిరారా, కార్తీకేయ, సూర్య వర్సెస్ సూర్య'' చిత్రాలతో తనకంటూ విభిన్నమైన శైలిని ఏర్పాటు చేసుకుని దూసుకుపోతున్న నిఖిల్ రచయిత కోనవెంకట్ నిర్మాణంలో ‘శంకరాభరణం' అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంతో ఉద‌య్ నంద‌న‌వ‌నం ద‌ర్శకుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు.

    Kona Venkat about Akhil’s Failure

    బీహార్ నేపథ్యంలో సాగే మరో సరికొత్త క్రైం కామెడీ సినిమా ఇది. ఈ సినిమాకు ‘శంకరాభరణం' అనే టైటిల్ పెట్టిన రోజునుంచే అంతటా మంచి ఆసక్తి రేకెత్తింది. తెలుగులో స్టార్ రైటర్‌గా వెలుగొందుతున్న కోన వెంకట్ ఈ సినిమాకు స్క్రిప్ట్ సమకూర్చడంతో పాటు సహ నిర్మాతగానూ వ్యవహరించడంతో సెట్స్‌పైకి వెళ్ళకముందే ఈ కాంబినేషన్‌పై అంచనాలు ఏర్పడ్డాయి.

    క్రైమ్ కామెడీ క‌థ‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో నిఖిల్ సరసన నందిత‌ను హీరోయిన్‌. అతిధి పాత్రలో హీరోయిన్ అంజలి నటిస్తోంది. అంజలికి ‘గీతాంజలి' చిత్రంతో కోన మంచి విజయాన్ని అందించారు. ఆ మేరకే అంజలి ‘శంకరాభరణం' చిత్రంలో గెస్ట్ రోల్ వేయడానికి సిద్థపడిందని సమాచారం.

    English summary
    Kona Venkat was clarify saying that one can’t brush Akhil’s failure onto him since he was only a dialogue writer for the film and had no say in the film’s story or screenplay as they were written by another writer.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X