»   » కోన వెంకట్ కొరియోగ్రాఫ్ చేసాడు

కోన వెంకట్ కొరియోగ్రాఫ్ చేసాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ‘సూర్య వర్సెస్ సూర్య' చిత్రంతో హ్యాట్రిక్ విజయాలు అందుకున్న యంగ్ హీరో నిఖిల్ తాజాగా మరో వైవిధ్యభరితమైన కథతో ‘శంకరాభరణం' చిత్రంలో నటించనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని కోన వెంకట్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మరో విశేషం ఉంది. శంకరాభరణంలో ఓ పాటకు స్వయంగా కోన వెంకట్ కొరియోగ్రాఫర్‌గా చేశారు. ఈ విషయాన్ని హీరో నిఖిల్ తెలియజేస్తూ తన ట్విట్టర్ ఎకౌంట్‌లో షేర్ చేసుకున్నారు. నిఖిల్, నందితలపై ఈ సాంగ్ షూట్ చేస్తున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

కొత్త దర్శకుడైన ఉదయ్ నందనవనం ఈ చిత్రాన్ని దర్శకత్వం వహిస్తాడు. ఈ చిత్రానికి కథ, మాటలు కోన వెంకట్ అందిస్తున్నాడు. ప్రవీణ్ లక్కరాజు ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఇదో క్రైమ్ కామెడీ చిత్రంగా రూపొందనుందని ఫిలింనగర్ సమాచారం.

Kona Venkat Choreographed to Nikil's Shakarabharanam movie

ఇంతకుముందు కోన వెంకట్..అంజలి ప్రధాన పాత్రలో గీతాంజలి అనే హర్రర్ కామెడీని నిర్మించి హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం కూడా అన్ని రకాల ఎలిమెంట్ లతో డిఫెరెంట్ గా సాగుతుందని చెప్తున్నారు. ‘ శంకరాభరణం' : కోన వెంకట్-నిఖిల్ కాంబినేషన్ లో... ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో సక్సెస్ ఫుల్ రైటర్ గా కెరీర్ సాగిస్తున్న రచయితల్లో కోన వెంకట్ ఒకరు.

ఆయన ఏ సినిమాకు పని చేసినా.....ఆ సినిమా బాగా ఆడుతుందనే పేరు ఉంది. ఆయన రాసే డైలాగ్స్, స్క్రీన్ ప్లే కోసం పలువురు దర్శకులు, హీరోలు ఎదురు చస్తారంటే ఆయనకున్న డిమాండ్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు. నిఖిల్ కోసం కథను ప్రస్తుతం తయారు చేసినట్లు తెలుస్తోంది. నిఖిల్ బాడీ లాంగ్వేజికి తగిన విధంగా కోన వెంకట్ కథ తయారు చేసారని అంటున్నారు.

పూర్తి వినోదాత్మకంగా సాగే కమర్షియల్ ఎంటర్టెనర్ గా ఉంటూనేై క్రైమ్ ఎలిమెంట్ ఈ చిత్రంలో ఉండనుంది. సినిమాలో బ్రహ్మానందం కీలక పాత్రలో నటిస్తానరి తెలుస్తోంది. ఆయన కోసం కోన వెంకట్ స్పెషల్ క్యారెక్టర్ క్రియేుట్ చేసినట్లు తెలుస్తోంది. కధల ఎంపికలో నిఖిల్ చాలా జాగ్రత్తలు వహిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా ఆడియో పంక్షన్ జరిగి, విడుదల తేదీ ప్రకటించే అవకాశం ఉంది.

English summary
Nikil tweeted: " Here is a pic frm a song in ShankaraBharanam which was Choreographed so well by none othr than our own konavenkat99 "
Please Wait while comments are loading...