»   » పవన్ కళ్యాణ్ మాట ఇచ్చాడు కానీ...

పవన్ కళ్యాణ్ మాట ఇచ్చాడు కానీ...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ తో సినిమా చేసి హిట్టు కొడితే సదరు దర్శకుడి స్థాయి ఏ రేంజిలో పెరుగుతుందో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే చాలా మంది అప్ కమింగ్ డైరెక్టర్స్ ఆయనతో సినిమా చేయాలని తహతహ లాడుతున్నారు.

ఇప్పటి వరకు రచయితగా తన సత్తా చాటుకున్న కోన వెంకట్... స్టార్ రైటర్ గా ఓ వెలుగు వెలిగారు. తర్వలో దర్శకత్వంలోనూ అడుగు పెట్టి తన టాలెంటు నిరూపించుకోవాలని ఆశ పడుతున్నారు. ఇటీవల ఆయన ఓ స్టార్ హీరోకు కథ చెప్పి ఇప్పించారని, అతనెవరో కాదు... పవన్ కళ్యాణే అంటూ ఓ రూమర్ ప్రచారంలోకి వచ్చింది.

Kona Venkat to direct Pawan Kalyan soon

ఈ వార్తలపై కోన వెంకట్ స్పందించారు. ప్రస్తుతానికైతే పవన్ కళ్యాణ్ తో సినిమా ఓకే కాలేదని, కానీ మంచి కథతో వస్తే సినిమా చేస్తానని పవన్‌ మాటచ్చారని తెలిపారు. దర్శకత్వం వహించాలని ఉంది. అయితే కొంతమంది దర్శక మిత్రులు రచయితగా కొనసాగమని అంటున్నారు' అని కోన వెంకట్ తెలిపారు.

ప్రస్తుతం కోన వెంకట్ రచయితగా, నిర్మాతగా పలు చిత్రాలు చేస్తున్నారు. ఈ ఏడాది ఆయన డిక్టేటర్, అభినేత్రి చిత్రాలకు రచయితగా పని చేసారు. ఇటీవల విడుదలైన అభినేత్రి చిత్రానికి రచయితగా బాధ్యతలు నిర్వర్తించడంతో పాటు తెలుగులో ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు.

English summary
Writer Kona has approached Pawan Kalyan and the actor promised to do a film. Kona Venkat will be making his debut as a director with this film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu