»   » 'పండుగ చేస్కో' : క్రిటిక్స్ కు కౌంటర్ ఇచ్చిన కోన వెంకట్

'పండుగ చేస్కో' : క్రిటిక్స్ కు కౌంటర్ ఇచ్చిన కోన వెంకట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ప్రముఖ రచయిత కోన వెంకట్...తాజాగా డైలాగులు చిత్రం 'పండుగ చేస్కో' . ఈ చిత్రం మార్నింగ్ షోకే నెగిటివ్ టాక్ మూట కట్టుకుంది. ముఖ్యంగా చిత్రం రొటీన్ గా ఉందని అన్ని మీడియా వెబెసైట్లు, న్యూస్ పేపర్లు రాసుకొచ్చింది. దీనికి కౌంటర్ గా ఈరోజు కోన వెంకట్ ఈ చిత్రం కలెక్షన్స్ బాగున్నాయని, హౌస్ ఫుల్స్ తో రన్ అవుతోందని, ఇది రొటీన్ కాదని అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేసారు. ఆ ట్వీట్ మీరూ చూడండి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

చిత్రం కథేమిటంటే...

ఎన్నారై...కార్తీక్ (రామ్) చాలా తెలివైనవాడు..స్వశక్తితో ఎదిగినవాడు...కమర్షియల్ మైండ్ ఉన్నవాడు..ఎలాంటి సమస్యను అయినా చిటికెలో పరిష్కారం చూపగలవాడు....ముఖ్యంగా పేద్ద బిజినెస్ మ్యాన్...మిలియనీర్. ఇలా బోల్డ్ లక్షణాల...అంతులేని ఆస్దితో విరసిల్లే లోకల్ గా ఉండే బిజినెస్ వుమెన్ అనుష్క (సోనాల్ చౌహన్) ని పెళ్లి చేసుకుని, వ్యాపారాన్ని విస్తరించుకోవాలనుకుంటాడు. అందుకోసం ఆమెను ఎప్రోచ్ అయ్యి...ఎంగేజ్ మెంట్ సైతం చేసుకుంటాడు. అయితే ఈ లోగా అతను ఇండియా వెల్లాల్సిన అర్జెంట్ పని ఏర్పడుతుంది. ఎందుకయ్యా అంటే ఇండియాలో ఉండే హీరోయిన్... దివ్య (రకుల్ ప్రీత్ సింగ్) అతని ఫ్యాక్టరీమీద పొల్యూషన్ కేసు వేస్తుంది.

Kona Venkat

ఇంతకీ దివ్య ఏం చేస్తుంది అంటే గో గ్రీన్..గ్రీన్ ఆర్మీ అంటూ మొక్కలు,కాలష్యం గురించి ఉద్యమాలు గట్రా చేస్తూంది. అయితే ఆమెకో కుటుంబ సమస్య ఉంటుంది. మేనమామ సాయిరెడ్డి (సాయికుమార్),తండ్రి భూపతి(సంపత్) కు ఉన్న కక్షలు మధ్య నలిగిపోతూంటుంది. ఈ క్రమంలో...మన హీరో గారు ఇండియాకు రావటం...ఆమెను కలవటం..కొన్ని అనుకోని పరిస్దితుల్లో ఆమె కుటుంబంలో ఉన్న గొడవలు తీర్చి , చక్కదిద్ది...ఆమె చేయి పట్టుకోవాలని నిర్ణయించుకోవటం జరుగుతాయి.

ఈ లోగా అసలు కార్తీక్ ఎవరో ట్విస్ట్ రివిల్ అవుతుంది. ఇంతకీ దివ్య కుటుంబానికి ఉన్న గొడవలు ఏంటి... కార్తీక్ ఎవరూ...దివ్య కేసు విత్ డ్రా చేసుకుందా...హీరో...మొదట పెళ్లి చేసుకుందామనుకున్న అనుష్క పరిస్దితి ఏమిటి.. వీకెండ్ వెంకట్రావు పాత్రలో కనిపించిన బ్రహ్మానందం రోల్ ఏమిటి వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఇక ''స్వతహాగా నాకు ప్రేమకథలంటే ఇష్టం. 'గీతాంజలి' లాంటి సినిమా తీయాలనే పరిశ్రమలోకి అడుగుపెట్టా. కాకపోతే ఇక్కడున్న పరిస్థితులు వేరు. నిర్మాత, పంపిణీదారులు, ప్రదర్శనకారులు అందరూ లాభపడాలి. అలాంటి సినిమాలే తీయాలి. ఈ విషయంలో నాకు వినాయక్‌గారే అదర్శం. ఇప్పటి వరకు ఆయన సినిమాని కొన్న ఏ ఒక్కరూ నష్టపోలేదు.

అంతేకాదు 'మీ సినిమా అనే ధీమాతోనే పండగ చేస్కో కొన్నామండీ' అని పంపిణీదారులు అంటుంటే వాళ్ల కోసం సేఫ్‌ గేమ్‌ ఆడడంలో తప్పు లేదనిపించింది. ఇక్కడ ప్రేక్షకులు కోరుకొన్న సినిమాలే ఇవ్వాలి. కొత్తదనం పేరుతో మన భావాల్ని వాళ్లపై బలవంతంగా రుద్దకూడదు'' అని చెప్పుకొచ్చారు.

కథ రొటీన్ గా ఉందనే విషయమై మాట్లాడుతూ...''కొత్త కథలు తక్కువగా వస్తున్నాయి. ఉన్న కథలనే స్క్రీన్‌ప్లేతో తెలివిగా మలచుకోవాల్సిందే. ఎలాంటి కథ చెప్పినా వినోదం మేళవిస్తూ చెబితే తప్పకుండా ప్రేక్షకులు మెచ్చుకొంటారు. మున్ముందూ వినోదాన్ని నమ్ముకొనే ప్రయాణం సాగిస్తా. ప్రస్తుతం కొత్త స్క్రిప్టులు సిద్ధం చేసుకొంటున్నా. నా తదుపరి చిత్రం ఓ అగ్ర కథానాయకుడితో ఉంటుంది. వివరాలు త్వరలో చెబుతా'' అని అన్నారు.

English summary
Kona Venkat gave a fitting reply to reviewers in his style: "Today (Monday) PANDAGA CHESKO morning shows in 16 theatres in Visakhapattanam are HOUSE FULLS !! I hope this is not routine," he comments.
Please Wait while comments are loading...