»   »  అఫీషియల్ : సీన్ లోకి కోన వెంకట్ , ఇక రచ్చ రంబోలా

అఫీషియల్ : సీన్ లోకి కోన వెంకట్ , ఇక రచ్చ రంబోలా

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఢీ విజయంతో స్టార్ రైటర్ గా మారి పెద్ద హీరోలందరి చిత్రాలకు పనిచేసిన కోన వెంకట్ ఈ మధ్యన సైలెంట్ అయ్యారు. ఆయన చిత్రాలు సౌఖ్యం, బ్రూస్ లీ, డిక్టేటర్, శంకరాభరణం భాక్సాఫీస్ వద్ద వర్కవుట్ కాకపోవటంతో ఆయన సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ వచ్చారు.

అయితే ఆయన తిరిగి రంగం లోకి దిగారు. తాను కొత్త చిత్రం కమిటయ్యానంటూ ట్వీట్ చేసి అందరి దృష్టినీ తన వైపు తిప్పుకున్నాడు. గీతాంజలి తరహా హర్రర్ కథతో ఈ చిత్రం రెడీ అవుతోందని తెలియచేసాడు. అయితే కథ తనది కాదని, కేవలం డైలాగు రైటర్ ని మాత్రమే అని చెప్పారు. ఆయన ఇంకేం అన్నారో ఆయన ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన మ్యాటర్ పై ఓ లుక్కేసి తెలుసుకోండి.

Happy to announce the next project (Production no 3) of our MVV cinema with Prabhudeva, Tamanna, Sonu Sood, Saptagiri...

Posted by Kona Venkat on 15 February 2016

‘‘దర్శకుడు విజయ్ చాలా ప్రతిభావంతుడు.ఆయనే ఈ చిత్రానికి కథ కూడా రాశారు. ఈ కథపై నాకు చాలా నమ్మకం ఉంది. శివ తుర్లపాటి ప్రారంభించిన ‘బ్లూ సర్కిల్ కార్పొరేషన్'తో కలసి ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మిస్తున్నాం. ఈ సినిమాను సమర్పిస్తూ, తెలుగు డైలాగ్స్ రాస్తున్నందుకు గర్విస్తున్నా'' అన్నారు.
Kona Venkat is more sanguine about his next

‘‘మీకు గనక ‘గీతాంజలి' సినిమా నచ్చితే, అంతకు పదింతలు ఈ సినిమా మీకు నచ్చుతుంది, త్వరలో టైటిల్ మిగతా డిటేల్స్ తో మీ ముందుకు వస్తాను'' అని పేర్కొన్నారు. ఈ చిత్రంలో సపర్తగిరి ప్రధానపాత్రదారి. ప్రస్తుతం కోన వెంకట్...సాహసం శ్వాసగా సాగిపో చిత్రానికి పనిచేస్తున్నారు.

తమిళంలో తెరకెక్కబోయే ఈ చిత్రంలో తమన్నాతో పాటు ప్రభుదేవా, సప్తగిరి, సోనూ ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో రచయిత కోన వెంకట్ కూడా జాయిన్ అయినట్లు తెలుస్తోంది. తమిళ దర్శకుడు ఎఎల్ విజయ్ దర్శకత్వం వహించబోతున్నారు. ఈ చిత్రానికి కథ కూడా ఆయనే తయారు చేసారు. బ్లూ సర్కిల్ కార్పొరేషన్ బేనర్లో శివ తూర్లపాటి నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళంలో పాటు హిందీలో కూడా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఎంవివి సినిమాస్ వారు సహ నిర్మాతగా వ్యవహరించబోతున్నారు.

English summary
Kona Venkat tweeted, he will be working as a dialogue writer as well as the presenter for the Prabhudeva and Tamannaah starer film. Said to be a horror comedy genre film, it will be commencing the regular shoot soon. A. L. Vijay directs this Telugu Tamil bilingual and it is produced by MVV Cinema.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu