»   » తెలుగు రైటర్ కి భారీ బాలీవుడ్ ఆఫర్

తెలుగు రైటర్ కి భారీ బాలీవుడ్ ఆఫర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలుగు సినిమా రీమేక్ లకు బాలీవుడ్ లో డిమాండ్ పెరగటంతో వాటితో పాటే ఇక్కడ డైరక్టర్స్ కి,రైటర్స్ కూ కూడా గుర్తింపు లభిస్తోంది.అందులో భాగంగానే ప్రముఖ రచయిత కోన వెంకట్‌, ఇప్పుడు బాలీవుడ్‌లో బిజీ రచయితగా రాణిస్తున్నారు. సల్మాన్‌ఖాన్‌ నటించే 'షేర్‌ఖాన్‌' సినిమాకి తనే రచన చేస్తున్నాడు. అంతేగాక బోనీకపూర్ నిర్మించనున్న నో ఎంట్రీ 2 చిత్రానికి కూడా కోన వెంకట్ తోనే స్క్రిప్టు వర్క్ చేయిస్తున్నారు.ఈ మేరకు రీసెంట్ గా కోన వెంకట్ తో ఎగ్రిమెంట్ అయిందని సమాచారం.

ఇక నో ఎంట్రీ 2 లో సల్మాన్ ఖాన్, అనీల్ కపూర్, ఫర్దీన్ ఖాన్ నటించనున్నారు.అనీజ్ బజ్మి దర్సకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది.ఇక కోన వెంకట్ రచన చేసిన రెడీ చిత్రం హిందిలో మంచి వసూళ్లను రాబట్టటంతో అక్కడ దర్శక,నిర్మాతల కళ్ళు కోన పై పడ్డాయి. తెలుగు కన్నా పెద్ద మార్కెట్ కావటంతో డబ్బులు పరంగానూ బాగానే గిట్టుబాటు అవుతాయంటున్నారు. ప్రస్తుతం కోన తెలుగులో దూకుడు,బాడీగార్డ్, నా ఇష్టం, ఎందుకంటే ప్రేమంటే చిత్రాలకు స్క్రిప్టు వర్క్ చేస్తున్నారు.

English summary
Telugu writer Kona Venkat is assigned another big movie in Hindi. This time Bollywood top producer Boney Kapoor asked him to write script for No Entry 2 to be directed by Anees Bazmi and stars Anil Kapoor, Salman Khan and Fardeen Khan.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu