»   » అల్లు అర్జున్ తో ఖరారు చేసిన కోన వెంకట్

అల్లు అర్జున్ తో ఖరారు చేసిన కోన వెంకట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఎన్నో సక్సెస్ ఫుల్ చిత్రాలకు పనిచేసిన స్టార్ రైటర్‌ కోన వెంకట్ తాజాగా మరో చిత్రం కమిటయ్యారు. అల్లు అర్జున్ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందే చిత్రానికి ఆయన స్క్రిప్టు వర్క్ చేయనున్నారు. గతంలో అల్లు అర్జున్....హ్యాపీ (2006) చిత్రానికి పనిచేసారు కోన వెంకట్. ఇక ఈ కొత్త చిత్రానికి డైలాగులు,కథ ఇస్తున్నట్లు ఆయన ట్విట్టర్ లో ఖరారు చేసారు.

కోన వెంకట్ ట్వీట్ చేస్తూ..." బ్లాక్ బస్టర్ బలుపు చిత్రం తర్వాత నేను గోపీచంద్ మలినేని కలిసి మరోసారి ఓ పవర్ ఫ్యాకెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ కి పనిచేస్తున్నాం. నేను కథ,మాటలు ఈ సినిమాకి ఇస్తున్నాను. అల్లు అర్జున్ స్టైల్, ఎనర్జీకి తగినట్లుగా స్క్రిప్టుని రూపొందిస్తున్నాం !!!" అని ట్వీట్ చేసారు. గోపీచంద్ మలినేని దాదాపు స్క్రిప్టు వర్క్ పూర్తి చేసారు. త్వరలో అథికారికంగా ప్రకటన వస్తుందని తెలుస్తోంది.

అలాగే పేరు తెచ్చుకున్న కోన వెంకట్ త్వరలో శ్రీదేవితో సినిమా చేయబోతున్నారు. శ్రీదేవి కోసం కోన ఒక అద్భుతమైన కథను రెడీ చేసాడట. ఈ విషయాన్ని కోన వెంకట్ స్వయంగా తన సోషల్ నెట్వర్కింగ్ సైట్ ద్వారా వెల్లడించడం గమనార్హం. ఆయన చెప్పిన వివరాల ప్రకారం....మూడు బాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారట. తెలుగు, తమిళం, హిందీలో తెరకెక్కే ఈచిత్రాన్ని శ్రీదేవి భర్త బోనీ కపూర్ నిర్మించబోతున్నారని ఆయన తెలిపారు.

భారీ బడ్జెట్‌తో తెరకెక్కబోయే ఈచిత్రం ప్రస్తుతం చర్చల దశలో ఉంది. ఇటీవల శ్రీదేవిని కలిసిన స్టోరీ చెప్పానని, సినిమా చేయడానికి ఆమె ఒప్పుకున్నారని, దర్శకుడు, ఇతర సాంకేతిక విభాగం, నటీనటుల వివరాలు త్వరలో వెల్లడిస్తానని కోన వెంకట్ తన ట్విట్టర్లో వెల్లడించారు. శ్రీదేవి మరో సినిమా చేయబోతోంది అనగానే ఆమె అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

English summary
Kona Venkat is all set to work for an Allu Arjun's film. The ace writer would be soon working on the story & dialogues for an untitled Allu Arjun's film, to be directed by Gopichand Malineni. Kona shared the news on his micro blogging account.
Please Wait while comments are loading...