»   »  టాలీవుడ్ స్టార్లు ఎలాంటి వారో... వన్ లైన్లో చెప్పిన కోన వెంకట్

టాలీవుడ్ స్టార్లు ఎలాంటి వారో... వన్ లైన్లో చెప్పిన కోన వెంకట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్లో స్టార్ రైటర్ గా పేరు తెచ్చుకున్న కోన వెంకట్....తెలుగు సినిమా పరిశ్రమలోని అందరూ స్టార్లతో సన్నిహితంగా మెలుగుతుంటారు. తాజాగా ఆయన ఓ సినీ వెబ్ సైట్ కోసం ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో టాలీవుడ్ స్టార్ల గురించి వన్ లైన్లో చెప్పారు. ఆయన చెప్పిన విషయాలు ఆసక్తిగా ఉన్నాయి.

Kona Venkat’s about Tollywood stars

నందమూరి బాలకృష్ణ - ఆయన అద్దం లాంటివారు, స్వచ్ఛమైన ఆత్మగల వ్యక్తి, ముక్కుసూటిగా ఉండే మనస్తత్వం..
అక్కినేని నాగార్జున- ప్రశాంతమైన మనస్త్తవం ఉన్న వ్యక్తి
విక్టరీ వెంకటేష్ - చాలా దయగల వ్యక్తి
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - నిజాయితీకి మారుపేరు
సూపర్ స్టార్ మహేష్ బాబు - రాయల్టీకి అర్థంలా కనిపిస్తారు
యంగ్ టైగర్ ఎన్.టి.అర్ - స్నేహ స్వభావం ఉన్నవ్యక్తి
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - తన టీం పట్ల అమితమైన ప్రేమతో ఉంటారు, చాలా కేర్ తీసుకుంటారు
మాస్ మహారాజ్ రవితేజ - చాలా సంతోషంగా ఉండే వ్యక్తి
మోహన్ బాబు & ఫ్యామిలీ - తనతో పనిచేసే వారిని ఫ్యామిలీలా చూసుకుంటారు
ఎనర్జిటిక్ స్టార్ రామ్ - సెట్లో అందరికీ ఇన్‌స్టంట్ ఇస్తారు
మాచో హీరో గోపీచంద్ - ప్రేమించదగిన వ్యక్తి
అక్కినేని అఖిల్ - ఫ్రెండ్ ఫర్ లైఫ్
నిఖిల్ - బిగ్ అసెట్ ఫర్ గుడ్ స్క్రిప్ట్

‘శంకరాభరణం' ప్రమోషన్లలో కోన వెంకట్ బిజీ...
కోన వెంకట్‌ సమర్పకుడిగా తెరకెక్కిన ‘శంకరాభరణం' మూవీ రేపు విడుదలవుతోంది. స్వామి రా రా', 'కార్తికేయ', 'సూర్య వర్సెస్‌ సూర్య'... ఇలా వరుస విజయాలు అందించిన ఉత్సాహంలో ఉన్నాడు నిఖిల్‌. ఇప్పుడు 'శంకరాభరణం' అనే మరో వినూత్న కథతో అలరించడానికి సిద్ధమవుతున్నాడు. ఈ చిత్రంతో ఉదయ్‌ నందనవనమ్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఎంవీవీ సత్యనారాయణ నిర్మాత.

ఈ చిత్రంలో హీరోయిన్ గా నందిత నటిస్తోంది. ప్రత్యేక పాత్రలో అంజలి నటించింది. క్రైమ్‌ కామెడీ జోనర్‌లో సాగే కథ ఇది. సంపత్‌రాజ్‌, బ్రహ్మానందం, రఘుబాబు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, మాటలు అందించిన కోన వెంకట్‌ సమర్పకుడిగానూ వ్యవహరిస్తున్నారు.

English summary
Kona Venkat’s about Tollywood stars Nandamuri Balakrishna, Akkineni Nagarjuna, Venkatesh, Pawan Kalyan, Mahesh Babu, N.T.R , Ram Charan.
Please Wait while comments are loading...