»   » కోన వెంకట్ దర్శకుడిగా మారొద్దు, మాకు ఇబ్బందే: శ్రీను వైట్ల

కోన వెంకట్ దర్శకుడిగా మారొద్దు, మాకు ఇబ్బందే: శ్రీను వైట్ల

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సినీ పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకునేది హీరోలు, దర్శకులు మాత్రమే. సినిమా బడ్జెట్‌లో నిర్మాతలు ఎక్కువ ఖర్చు పెట్టేది కూడా వీరిద్దరికే. పరిశ్రమలో ఇలాంటి పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో..... రచయితలు గానే మిగిలి పోకుండా దర్శకుడిగా టర్న్ కావడానికి ఆసక్తి చూపుతున్నారు పలువరు రచయితలు. సంపత్ నంది, అనిల్ రావిపూడి, కొరటాల శివ లాంటి రైటర్స్..... దర్శకులుగా మారడం వెనక అసలు కారణం ఇదే. పేరు, డబ్బు రెండూ ఎక్కువగానే వస్తాయి దర్శకులుగా మారడం ద్వారా....!

టాలీవుడ్ స్టార్ రైటర్లలో ఒకరైన కోన వెంకట్ కూడా దర్శకుడిగా మారడానికి ప్రయత్నిస్తున్నాడు. చాలా ఏళ్ల పాటు శ్రీను వైట్ల సినిమాలకు రచయితలుగా పని చేసిన కోన వెంకట్ ‘దూకుడు' సినిమా సమయంలో వచ్చిన విబేధాలతో విడిపోయిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్ సినిమా కోసం ఈ ముగ్గురూ మళ్లీ కలిసి పని చేస్తున్నారు. చిరంజీవి, రామ్ చరణ్ ఈ ముగ్గురి మధ్య రాజీకుదిర్చారు.

Kona Venkat Should Not Become Director: Srinu Vaitla

ఇటీవల ఓ టీవీ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీను వైట్ల.....కోన వెంకట్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. కోన వెంకట్ లాంటి స్టార్ రైటర్స్ దర్శకుడిగా మారితే పరిశ్రమలో రచయితల కొరత ఏర్పడుతుంది. నా లాంటి డైరెక్టర్లు చాలా మంది ఆయనపై ఆధార పడ్డారు. అందుకే ఆయన రచయితగా ఉండిపోతేనే పరిశ్రమకు మంచిది అంటూ వ్యాఖ్యానించారు.

శ్రీను వైట్ల వ్యాఖ్యలకు.... కోన వెంకట్ చిరునవ్వుతో సమాధానం ఇచ్చారు. మరో రచయిత గోపీ మోహన్ చప్పట్లు కొడుతూ....శ్రీను వైట్ల చెప్పిన దాంట్లో నిజం ఉంది. కోన వెంకట్ లాంటి వారు రచయితగా పరిశ్రమకు సేవలందిస్తే ఎక్కువ హిట్ చిత్రాలు వస్తాయి. దర్శకుడిగా మారడం వల్ల ఆయనపై ఆదారపడ్డ డైరెక్టర్లు ఇబ్బందులు పడతారు అంటూ వ్యాఖ్యానించారు.

English summary
Association between ace director Sreenu Vaitla and writers Kona Venkat, Gopi Mohan dates back to a long time. Though there is some animosity for a while, these three joined hands now to carve out a comedy thriller for Ram Charan. What happens to this union if Kona turns to direction? 'Kona Venkat should not become director anytime soon, because there is serious dearth of quality writers in Film Industry. What about directors like me who are dependent on him?', says Sreenu Vaitla. While speaking in a TV program, he made these comments.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu