»   » 'బ్రూస్‌లీ' కి రాసిన సీన్లన్నీ బయటపెడతా: కోన వెంకట్

'బ్రూస్‌లీ' కి రాసిన సీన్లన్నీ బయటపెడతా: కోన వెంకట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్:" 'బ్రూస్‌లీ'కి 72 సీన్లు రాస్తే, యథాతథంగా తీసుకోలేదు. కొన్ని స్టార్టింగ్, కొన్ని మధ్య లో, కొన్ని ఎండింగ్ తీసుకున్నారు. నేను ఫీలయ్యా. 'దూకుడు' తర్వాత మళ్ళీ మా కాంబినేషన్ అని నమ్మిన ప్రేక్షకులు, బయ్యర్లు నష్టపోయారు" అంటూ చెప్పుకొచ్చారు 'బ్రూస్‌లీ' రచయిత కోన వెంకట్. ఆయన తన తాజా చిత్రం శంకరాభరణం విడుదల సందర్భంగా తెలుగులో న్యూస్ పేపర్ సాక్షి కు ఇచ్చిన ఇంటర్వూలో ఇలా స్పందించారు. అది రుజువు చేయటానికి తాను రాసిన సీన్లన్నీ బయటపెడతా అని ప్రకటించారు.

శ్రీను వైట్ల దర్శకత్వంలో రామ్‌చరణ్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌లు జంటగా నటించిన చిత్రం 'బ్రూస్‌లీ'. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై డి.వి.వి దానయ్య ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. థమన్‌ సంగీతం అందించారు. దసరా సందర్భంగా క్రిందట నెల 16న 'బ్రూస్‌లీ' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం మార్నింగ్ షోకే ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకుంది.


ఈ చిత్రానికి మందు శ్రీను వైట్ల, కోన వెంకట్ మధ్య విభేధాలు ఉన్నాయి. అయితే రామ్ చరణ్ చొరవతో వీరి మద్యన సయోధ్య కుదిరింది. వీరి కాంబినేషన్ లో ఈ బ్రూస్ లీ చిత్రం వచ్చింది.అయితే కథ, కథనాలే ఈ చిత్రాన్ని దెబ్బ తీసాయంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ నేపధ్యంలో కోన వెంకట్ ఇలా స్పందించారు.


స్లైడ్ షోలో ..కోన వెంకట్ ఇంకేమన్నారో చూడండి.


'భగవద్గీత' కాదు.

'భగవద్గీత' కాదు.

అలాగే...నేను రాసింది 'భగవద్గీత' కాదు. సుప్రీంకోర్పు తీర్పు కాదు. ఏం తీయా లనేది దర్శకుడి ఇష్టం. కానీ, రాసింది లేకుండా రచయితగా పేరు వేయడంతో నా పేరు దెబ్బతింది.


పుకారే..

పుకారే..

అందుకే, నేను రాసిన సీన్లన్నీ బయటపెడతా. ఇక, శ్రీను వైట్లపై పెడతానన్న కేసంటారా... ఆ వార్త వట్టి పుకారు అని కొట్టిపారేశారు.రాజీ పటం గురించి..

రాజీ పటం గురించి..

'బాద్‌షా' తర్వాత ఒక బలహీన క్షణంలో తప్పయిపోయిందని కన్నీళ్ళు పెట్టుకుంటే, నేనూ కన్నీళ్ళు పెట్టుకున్నా. ఎంతైనా క్రియేటివ్ పీపులందరం ఎమోషనలే కదా. కలిశాం. తీరా, ఇప్పుడిలా. సినిమా అయినా, సంసారమైనా ఒక వ్యక్తి కన్విక్షన్. మిగిలినవారి కంట్రిబ్యూషన్. కానీ అవగాహన లేకపోతే, కొనసాగలేం అన్నారు.


వెంటిలేషన్ పై...

వెంటిలేషన్ పై...

శ్రీను వైట్లతో రిలేషన్ గురించి చెప్తూ....వెంటిలేటర్‌పై ఉంది. ఈ మధ్య మాట్లాడలేదు.మళ్ళీ కలవటంపై...

మళ్ళీ కలవటంపై...

భవిష్యత్‌లో కలసి పనిచేసే అవకాశం ఉందా? చేయచ్చు... చేయకపోనూ వచ్చు!'అఖిల్' ఫ్లాఫ్ గురించి

'అఖిల్' ఫ్లాఫ్ గురించి

'బ్రూస్‌లీ'కి మూలకథ శ్రీను వైట్లదైతే, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు నేను రాసినవి. కానీ, 'అఖిల్'కి కథ (వెలుగొండ శ్రీనివాస్), స్క్రీన్‌ప్లే నావి కావు. నేను వట్టి డైలాగ్ రైటర్‌ని. కాబట్టి నాకు బాధ్యత ఉండదు. ఆల్రెడీ రచయిత, దర్శకుడు చెప్పింది రాసివ్వడమే. మహా అయితే, వాళ్ళకు సలహా, సూచన చెప్పగలం. అంతకు మించి తల దూర్చకూడదు.


 నేనే డైరక్ట్ చేస్తా...

నేనే డైరక్ట్ చేస్తా...

తప్పకుండా! వచ్చే ఏడాది మూడు సినిమాలు నిర్మించాలని ప్లాన్. రిలయన్స్ వాళ్ళు 3 సినిమాల డీల్ అడుగుతున్నారు. క్రియేటివ్ రెస్పాన్సిబి లిటీ నాది, ఫైనాన్షియల్ హెల్పంతా వాళ్ళది. అప్పుడు స్టార్స్‌కానివాళ్ళతో చేయగలుగుతా. ఘోస్ట్ డెరైక్షన్ కాకుండా, నేనే డెరైక్షన్ కూడా చేస్తా.


రైటర్ గా నా పరువుపోతోంది

రైటర్ గా నా పరువుపోతోంది


మనం రాసినదాన్ని వాళ్ళ ఇష్టమొచ్చినట్లు వాళ్ళు తీయడం వల్ల రైటర్‌గా పేరు పోతోంది. రైటర్‌గా నాలుగు సినిమాలు చేస్తే, పదిమందికీ పని దొరుకు తుందనుకుంటే, చివరకు మనకు పనిపోయే ప్రమాదం కనిపిస్తోంది. ఇప్పటికే 50 సినిమాల దాకా రచన చేశా. ఇక, రాశి కన్నా వాసి ముఖ్యం.


శ్రీదేవితో చేస్తున్నా

శ్రీదేవితో చేస్తున్నా

శ్రీదేవి లేటెస్ట్ హిందీ ఫిల్మ్ నా కథే ! 'శంకరాభరణం' బీహార్ నేపథ్యంలో నడిచే థ్రిల్లర్ అయితే, బోనీ కపూర్ నిర్మాతగా శ్రీదేవి నటిస్తున్న హిందీ చిత్రం మరో రకమైన థ్రిల్లర్. రవి ఉద్యావర్ అనే యాడ్ ఫిల్మ్‌మేకర్ దర్శకుడు.


హైదరాబాద్, డ్రగ్స్

హైదరాబాద్, డ్రగ్స్

అలాగే, హైదరాబాద్ సిటీ నేపథ్యంలో డ్రగ్ మాఫియా చుట్టూ తిరిగే కథతో 'పౌడర్' అనే కథ చేశా. ఆ మాటకొస్తే, డ్రగ్స్ వినియోగదారుల్లో సినిమా వాళ్ళే ఎక్కువేమో? సినిమావాళ్ళు సెలబ్రిటీలు కాబట్టి, వాళ్ళ ముందు కెమేరాలు పెడతారు. ఖరీదైన ఈ డ్రగ్స్ కొనే కస్టమర్లలో సినిమా వాళ్ళు 5 శాతం లోపే!


English summary
Kona Venkat has finally opened his mouth today about the ongoing things. It's about Bruce Lee and director Sreenu Vaitla.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu