»   » 'శ్రీరామదాసు' నిర్మాత నెక్ట్స్ ఏసు చరిత్ర

'శ్రీరామదాసు' నిర్మాత నెక్ట్స్ ఏసు చరిత్ర

Posted By:
Subscribe to Filmibeat Telugu

గతంలో బాలకృష్ణతో 'విజయేంద్రవర్మ', నాగార్జునతో 'శ్రీరామదాసు' నిర్మించిన ఆదిత్య ప్రొడక్షన్స్‌ సంస్థ కొండా కృష్ణంరాజు తాజాగా ఏసు క్రీస్తు జీవిత చరిత్రపై సినిమా చేయనున్నారు. జెకె.భారవి కథను సమకూర్చిన ఈ చిత్రం ఆంగ్లంతోపాటు ఆంగ్లంతోపాటు హిందీ, తెలుగు, తమిళ, మలయాళ నిర్మించనున్నారు.ఈ సినిమాకి ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు డైరక్షన్ చేస్తున్నారు. అలాగే బాల నటులతోనే ఈ చిత్రాన్ని నిర్మించటానికి ప్లాన్ చేస్తున్నారు. అలాగే ఈ కథలో స్టార్ హీరోలు గెస్ట్ రోల్స్ లో కనపడనున్నారు. ఇజ్రాయెల్‌, ఇటలీ దేశాల్లో చిత్రీకరణ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈస్టర్‌ సందర్భంగా ఈ నెల 4న లాంఛనంగా చిత్రీకరణ మొదలవుతుంది. బాలల చిత్రంలో అగ్ర తారల పాత్రలేమిటనే విషయాన్ని చిత్ర వర్గాలు సీక్రెట్ గా ఉంచారు.

దైవ కుమారుడిగా క్రీస్తు రాక నుంచి మొదలయ్యే ఈ కథలో పలు కొత్త విషయాల్ని చూపించబోతున్నారు. ఇందుకోసం దర్శకరచయితలు క్రైస్తవ మత పెద్దలతో చర్చలు సాగించారు. 10 నుంచి 14 సంవత్సరాలలోపు బాలల్నే అన్ని చారిత్రక పాత్రలకీ ఎంపిక చేస్తున్నారు. క్రీస్తు, మేరీ మాత పాత్రలకు ప్రముఖుల పిల్లల్ని తీసుకున్నట్లు తెలిసింది. 14 సంవత్సరాల బాలుణ్ని 30 సంవత్సరాల క్రీస్తుగా చూపించేందుకు ప్రత్యేక మేకప్‌ సూత్రాల్ని పాటించబోతున్నారు. అమితాబ్‌ బచ్చన్‌ కి 'పా'లో మేకప్‌ చేసిన హాలీవుడ్‌ నిపుణుడు క్రిస్టీన్‌ టిన్స్‌లే బృందం ఈ సినిమాకు పని చేస్తుంది. టిన్స్‌లే గతంలో 'పాసన్‌ ఆఫ్‌ క్రైస్ట్‌'కి పని చేశారు. ఆయన ఆస్కార్‌ పురస్కారం కూడా పొందారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu