Konda Movie Opening.. రాంగోపాల్ వర్మ పైత్యం.. అమ్మవారికి మందు తాగించిన ఆర్జీవి.. భగ్గుమంటున్న భక్తులు
వరంగల్ జిల్లా రాజకీయాలను తమ కనుసైగల్లో శాసించిన సెన్సేషనల్ పొలిటికల్ కపుల్ కొండా సురేఖ, కొండా మురళి జీవిత కథ తెరరూపం దాల్చపోతున్నది. ఈ బయోపిక్‌ను ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రారంభవేడుక వరంగల్ పట్టణంలో అంగరంగవైభవంగా, కొండా, ఆర్జీవి అభిమానుల ఆనందకోలాహలం మధ్య ప్రారంభమైంది. అయితే రాంగోపాల్ వర్మ సినిమా ఆరంభానికి ముందు పూజలు నిర్వహించారు. ఆర్జీవి హంగామా గురించి మరిని వివరాల్లోకి వెళితే..

వంచనగిరిలో కొండా మూవీ ప్రారంభం
కొండా సినిమా ప్రారంభ వేడుకలు ఘనంగా ప్రారంభం కాబోతున్నాయి. కొండా దంపతులు నివాసం నుంచి వారి స్వగ్రామం వంచనగిరిలో షూటింగ్ ప్రారంభవుతుంది. భారీ ర్యాలీగా బయలుదేరి షూటింగ్ ప్రారంభిస్తాం. మీరందరూ రండి అంటూ అని రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశారు. అయితే ర్యాలీ నిర్వహణకు అధికారులు అనుమతించకపోవడం వివాదంగా మారింది.

ఆర్జీవి ర్యాలీకి వరంగల్ పోలీసుల నిరాకరణ
కొండా మూవీ సినిమా ప్రారంభానికి ముందు ర్యాలీకి వరంగల్ జిల్లా పోలీసులు అనుమతి ఇవ్వలేదు. పర్మిషన్ ఇవ్వని పోలీసులకు నా థ్యాంక్స్. వారు అనుమతి ఇవ్వకపోవడమే మాకు పెద్ద పబ్లిసిటీ అని రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశారు. అయితే పోలీసుల అనుమతి నిరాకరణపై కొండా, ఆర్జీవి అభిమానులు నిరసన వ్యక్తం చేశారు. కానీ వర్మ తన వాహనంతోపాటు మరో రెండు వాహనాల్లో వంచనగిరికి ర్యాలీగా బయలుదేరి వెళ్లారు.
మైసమ్మ ఆలయంలో పూజలు.. కొండ సురేఖ హారతి
వరంగల్‌లోని మైసమ్మ ఆలయంలో రాంగోపాల్ వర్మ పూజలు చేశారు. ఆయనకు మాజీ మంత్రి కొండా సురేఖ హారతి పట్టి స్వాగతించారు. అనంతరం ఆలయంలోకి వెళ్లిన రాంగోపాల్ వర్మ అమ్మవారి విగ్రహానికి మద్యంతో అభిషేకం చేసి నైవేద్యం సమర్పించారు. అమ్మవారికి స్వయంగా మందు తాగించి తన మొక్కును చెల్లించుకొన్నారు. తన షూటింగుకు అంతరాయం కలుగకుండా పూర్తి చేసుకొనేలా ఉండాలని అమ్మవారిని కోరుకొన్నారు. అయితే సంప్రదాయవాదులు ఈ విషయాన్ని తప్పుపడుతున్నారు.

హన్మకొండ నుంచి వంచనగిరి వరకు ర్యాలీ
హన్మకొండ నుంచి వంచనగిరి వరకు ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించడంతో రాంగోపాల్ వర్మ ఓపెన్ టాప్ వాహనంలో అభిమానుల ఊరేగింపుగా బయలుదేరి వంచనగిరి గ్రామానికి చేరుకొన్నారు. వంచనగిరిలో గ్రామస్థులు భారీగా రాంగోపాల్ వర్మకు స్వాగతం పలికారు.
Recommended Video

కొండా దంపతుల జీవిత కథ
ఇక కొండా దంపతుల జీవిత కథను కొండా అనే టైటిల్‌తో సినిమాగా తెరకెక్కించనున్నారు. ఈ సినిమా షూటింగు అంతా వరంగల్ పరిసర ప్రాంతంలోనే పూర్తి చేయనున్నారు. ఈ మేరకు రాంగోపాల్ వర్మ యూనిట్ అంతా వరంగల్‌కు చేరుకొన్నది. త్వరగా ఈ సినిమాను పూర్తి చేసి రానున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందే కొండా చిత్రాన్ని రిలీజ్ చేయాలని నిర్ణయించుకొన్నట్టు తెలిసింది.


Click it and Unblock the Notifications











