»   » ముద్దు అడిగిన ఫ్యాన్: లైవ్‌లో షాకిచ్చిన నిహారిక, పెళ్లిపై కూడా...

ముద్దు అడిగిన ఫ్యాన్: లైవ్‌లో షాకిచ్చిన నిహారిక, పెళ్లిపై కూడా...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'ముద్దపప్పు ఆవకాయ్' వెబ్ సిరీస్ ద్వారా అందరి అభిమానం చూరగొన్న నాగ బాబు కూతురు నిహారిక త్వరలో 'ఒక మనసు' చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. వెబ్ సిరీస్ తర్వాత నిహారికకు చాలా మంది ఫ్యాన్స్ అయిపోయారు. ఫ్యాన్స్ కోరిక మేరకు నిహారిక గురువారం సాయంత్రం 7 నుండి 8 గంటల మధ్య లైవ్ చాట్లో పాల్గొన్నారు.

ఎవరూ తలదించుకునేలా చేయనంటున్న నాగబాబు కూతురు

ఈ సందర్భంగా నిహారికకు అభిమానుల నుండి కొన్ని వింత ప్రశ్నలు ఎదురయ్యాయి. వాటికి తనదైన రీతిలో సమాధానం ఇచ్చింది నిహారిక. ఈ క్రమంలో ఓ అభిమాని లైవ్ లో ఫ్లయింగ్ కిస్ అడిగారు. సదరు అభిమాని ప్రశ్నకు నిహారిక తనదైన రీతిలో సమాధానం ఇచ్చింది. ఫ్లయింగ్ కిస్ ఎందుకండీ....ఆ గాలికి మీరు ఎగిరిపోతారు, అందుకే నేను ఇవ్వను అంటూ అతని క్వశ్చన్ కి చెక్ పెట్టేసింది.

నిహారిక ఎపిసోడ్ కు అప్పుడే 'శుభం' కార్డు పడింది!

 Konidela Niharika

పలువురు ఫ్యాన్స్ నువ్వు చాలా అదంగా ఉన్నావు, చాలా బాగా యాక్ట్ చేస్తున్నవు అని పొగిడేసారు. దీనికి నిహారిక సమాధానం ఇస్తూ.... మీ లాంటి వారు ఇలా ఎంకరేజ్ చేస్తే కుమ్మేస్తా అంటూ బబ్లీగా సమాధానం ఇచ్చింది నిహారిక. నా వీక్ నెస్ ఫుడ్, డైటింగ్ చేయడం నా వల్ల కాదు అంటూ అంటూ ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చింది.

నాగ బాబు కూతురు నిహారికపై హరాస్మెంట్ కేసు వేస్తాం!

నాన్న, అన్నయ్యతో కలిసి నటించడానికి తాను సిద్దమే అని నిహారిక స్పష్టం చేసింది. అలాగే పెదనాన్న చిరంజీవి 150వ సినిమాలో అవకాశం వస్తే తప్పకుండా చేస్తాను, అలాగే అన్నయ్య రామ్ చరణ్ తో అవకాశం వచ్చిన చేస్తాను అని చెప్పింది. కథ నచ్చితే అఖిల్, ఎన్టీఆర్ ఇలా ఏ హీరోతో అయినా చేయడానికి సిద్ధమే అని నిహారిక తెలిపింది.

అల్లు అర్జున్ నాకు బావ అవుతారని..... అయితే నేను అన్న అని పిలుస్తాను అని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చింది నిహారిక. చిరంజీవి గారి సినిమాల్లో తనకు 'జగదేక వీరుడు అతిలోకి సుందరి' సినిమా అంటే ఇష్టం. పవన్ కళ్యాణ్ సినిమాల్లో 'జల్సా' అంటే ఇష్టం అని నిహారిక తెలిపింది.

పెళ్లి ఎప్పుడు చేసుకుంటా అని కొందరు ఫ్యాన్స్ అడగ్గా షాకింగ్ సమాధానం ఇచ్చింది నిహారిక. నా నటన మీకు నచ్చకుంటే నచ్చలేదు, సినిమాలు మానేయండి అని చెప్పండి, సినిమాలు చేయడం మానేస్తాను....అంతేకానీ పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు అనే ప్రశ్నలు మాత్రం దయచేసి అడగొద్దు అంటూ రిక్వెస్ట్ చేసింది నిహారిక.

లైవ్ చాట్లో ఉండగా....నిహారిక గ్లాసులో ఓ పానీయం తాగుతుండటాన్ని చూసి మీరు వోడ్కా తాగుతున్నారా? అంటూ ప్రశ్నించారు కొందరు ప్యాన్స్. తాను వోడ్కా లాంటి చెత్త చెదారం తాగనని, నా బ్యూటీ సీక్రెట్ కేవలం వాటర్ మాత్రమే అని నిహారిక స్పష్టం చేసింది.

English summary
Konidela Niharika about her marriage in live chat.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu