»   » చిరు 150పై పుకార్లు: పవన్ మీద డౌట్, రామ్ చరణ్ ముందు జాగ్రత్త!

చిరు 150పై పుకార్లు: పవన్ మీద డౌట్, రామ్ చరణ్ ముందు జాగ్రత్త!

Posted By:
Subscribe to Filmibeat Telugu

చిరంజీవి, పవన్ కళ్యాణ్ ల మధ్య స్పర్ధలు తొలగిపోయి చాలా రోజులవుతున్నా కానీ అన్నదమ్ములిద్దరూ కలిసి కనిపించిన సందర్భాలు చాలా తక్కువ. సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియోని చిరంజీవి లాంఛ్ చేసిన తర్వాత మెగా బ్రదర్స్ కలిసి కనిపించలేదు. చిరంజీవి రీఎంట్రీ చిత్రం ప్రారంభోత్సవంలో కానీ, శ్రీజ పెళ్లిలో కానీ పవన్ జాడ లేదు. అయితే ఖైదీ నంబర్ 150 చిత్రం ఆడియో వేడుకకి పవన్కళ్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేస్తాడని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పవన్ని కలిసి రామ్ చరణ్ ఈ సంగతి చెప్పాడని, పవన్ కూడా సానుకూలంగా స్పందించాడని వస్తూన్న వార్తల నేపథ్యం లో కొణిదెల ప్రొడక్షన్ పేరుతో రామ్ చరణ్ ఒక ప్రెస్స్ నోట్ విడుదల చేసారు.

చిరంజీవి 150 వసినిమా ఖైదీ నెం 150 ఆడియో ఫంక్షన్ గురించి గానీ మరే అప్డేట్ గానీ కొణిదెల ప్రొదక్షన్స్ నుంచి తామే అధికరికంగా చెబుతామనీ, అలా కాకుండా బయట వినిపంచే వార్తలని ప్రచారం చేయవద్దనీ చెప్పాడు చరణ్. పవన్ కళ్యాణ్ ముఖ్య అథితిగా రానున్నాడనీ, మెగా హీరోలు అందరూ హాజరవుతారనీ ప్రచారం జరుగుతోంది కానీ ఇంకా అసలు ఆవిషయం పై ఎలాంటి క్లారిటీ లేదనీ, ఏ విషయమైనా తాము దృవీకరించే వరకూ నమ్మకూడదనీ విఙ్ఞప్తి చేసాడు.

Konidela Productions Press note about Khaidi no 150

పవన్ రాక పై వచ్చిన వార్త ఇలా ఉంది. "చిత్రం ఆడియో వేడుకను డిసెంబర్ 3వ వారంలో జరపడానికి ప్లాన్ చేస్తున్నారట. ఆడియో వేడుకకు ముఖ్య అతిధిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నాడని సమాచారమ్. బాబాయ్ పవన్ కళ్యాణ్ ని అబ్బాయ్ రాంచరణ్ ఆడియో వేడుకకు రావాల్సిందిగా పర్సనల్ గా కోరాడట. పవన్ కళ్యాణ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడని సమాచారమ్. పవన్ కళ్యాణ్ 'సర్దార్ గబ్బర్ సింగ్' ఆడియో వేడుకకు చిరంజీవి ముఖ్య అతిధిగా అటెండ్ అయ్యారు. ఇప్పుడు 'ఖైదీ నెం.150' ఆడియో వేడుకలో చిరు, పవన్ కళ్యాణ్ ఒకే వేదికపైన కనిపించబోతున్నారు. మెగాబ్రదర్స్ మాత్రమే కాదు... మెగా హీరోలందరూ ఈ ఆడియో వేడుకలో పాల్గొనబోతున్నారట. చిరు, పవన్, రాంచరణ్ కాకుండా అల్లు అర్జున్, అల్లు శిరీష్, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్, నాగబాబు కూడా ఈ వేదికపైన కనిపించబోతున్నారట." ఇదీ వార్త.

ఇప్పుడు ఈ వార్తమీదనే చరణ్ స్పందించాడనుకోవాలి. అంటే పవన్ రాక అనుమానమేనా..!? ఏవిషయమూ రామ్ తేల్చి చెప్పే వరకూ ఏ వార్త వచ్చినా నమ్మకూడదన్నమాట.. పాపం మెగా అభిమానులు ఈ వార్థ చది చాలా ఉత్సాహపడ్డారు... ఇప్పుడు వాళ్ళ ఆశల పైన నీళ్ళు చళ్ళుతున్నారు లాగుంది.

English summary
Mega hero Ram charaN tej realeased a Press note about KHAIDI NO 150 that "Any confirmed/official update about #KhaidiNo150 will be informed by team or producer Ram Charan. Request media to ignore all gossip in circulation. Complete details about audio launch and teaser will be announced by Konidela Production Company very soon."
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu