twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కొరటాల మాటల్లో అర్థమేంటి? ఫ్యామిలీ డబ్బా కొట్టుకునే డైలాగ్స్ ఎన్టీఆర్ వద్దన్నాడా?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: తెలుగు సినిమా పరిశ్రమలో వారసత్వ హీరోలదే హవా! అఫ్ కోర్స్ వారసత్వ నేపథ్యంతో ఇండస్ట్రీలోకి వచ్చినప్పటికీ చాలా మంది స్టార్స్ తమ టాలెంటుతోనే స్టార్ హీరోలుగా ఎదిగారు. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్, అల్లు అర్జున్ లాంటి స్టార్స్ అంతా ఈ కోవకు చెందిన వారు.

    కొన్నేళ్ల క్రితం పరిస్థితి చూస్తే... వారసులుగా సినీ పరిశ్రములోకి ప్రవేశించిన వారు తమ తండ్రులు, తాతలు, వంశాల గొప్పదనం గురించి తమ సినిమాల్లో చెప్పాలనే తాపత్రయం కనబరిచేవారు. అయితే థియేటర్లో ఆ డైలాగులు విని చాలా మంది ప్రేక్షకులు చిరాకకు పడటం కనిపించేది.

    సోషల్ మీడియా జోరు ఎక్కువైన తర్వాత ఇలాంటి డైలాగులపై వ్యంగాలు మొదలయ్యాయి. ఈ విషయాన్ని గమనించిన వారసులంతా రాను రాను తమ తమ సినిమాల్లో అలాంటి డైలాగులను తగ్గించేసారు. ఈ మధ్య కాలంలో అలాంటి డైలాగులే కనిపించడం లేదు.

    తాజాగా 'జనతా గ్యారేజ్' సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో దర్శకుడు కొరటాల శివ వివిధ మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలో వారసత్వ డైలాగుల ప్రస్తావన కూడా వచ్చింది. దానిపై కొరటాల శివ ఎలా స్పందించారు? ఎన్టీఆర్, మోహన్ లాల్ గురించి శివ చెప్పిన ఆసక్తికర విషయాలు స్లైడ్ షోలో...

    వంశం గురించి గొప్పలు చెప్పకునే డైలాగులపై

    వంశం గురించి గొప్పలు చెప్పకునే డైలాగులపై


    ‘ప్రేక్షకుల అభిరుచి మారింది. అందుకు తగ్గట్టే హీరోల ఆలోచనా విధానమూ మారింది. హీరోయిజమ్‌, కుటుంబ చరిత్రకు సంబంధించిన డైలాగ్‌లను వారూ ఇష్టపడడం లేదు' అని కొరటాల శివ అన్నారు.

    హీరోలే వద్దంటున్నారు

    హీరోలే వద్దంటున్నారు


    కొందరు రచయితలు అలాంటి డైలాగులు రాసినా.. ప్రేక్షకులు గోల చేస్తారు తీసేయండి అని స్వయంగా హీరోలే చెబుతున్నారు అని కొరటాల శివ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

    జనతా గ్యారేజ్

    జనతా గ్యారేజ్


    ఇలా వ్యాఖ్యానించడం ద్వారా జనతా గ్యారేజ్ సినిమాలో అలాంటి డైలాగులు ఉండవని చెప్పకనే చెప్పారు కొరటాల. ఎన్టీఆర్ పేరు ఎత్తకుండానే అలాంటి డైలాగులు ఇప్పుడు హీరోలు ఇష్టపడటం లేదని స్పష్టం చేసారు.

    సినిమాలో పోటీ వాతావరణంపై

    సినిమాలో పోటీ వాతావరణంపై


    ''దొరికిన పాత్రలో పెర్ఫామ్ చేయడానికి బోలెడంత స్కోప్ ఉన్నప్పుడు.. ఇక ఒకరికి ఒకరు మధ్యన కాంపిటీషన్ ఏముంటుంది? అని కొరటాల శివ వ్యాఖ్యానించారు.

    మోహన్ లాల్ గురించి..

    మోహన్ లాల్ గురించి..


    మోహన్ లాల్ గారు కంప్లీట్ యాక్టర్ మాత్రమే కాదు.. కంప్లీట్ హ్యుమన్ బీయింగ్ కూడా. ఉన్నదాంట్లో తృప్తి పొందడంలో ఆయన చాలా హ్యాపీ మ్యాన్. ఇతర యాక్టర్లందరూ కూడా బాగా చేసారని కొరటాల శివ తెలిపారు.

    ఎన్టీఆర్-మోహన్ లాల్

    ఎన్టీఆర్-మోహన్ లాల్


    ''నేను కథ రాసేటప్పుడే ఇది ఎన్టీఆర్ కు అనుకున్నాను. అలాగే మోహన్ లాల్ పాత్రకు కూడా ఆయన్నే అనుకుని రాశాను. కొచిన్ వెళ్ళి కథ చెప్పగానే ఆయన ఓకే చేశారు. అసలు ఈ రెండు క్యారక్టర్లకూ వేరే ఆల్టర్నేటివ్ అనుకోలేదు'' అని కొరటాల శివ తెలిపారు.

    లాలెటెన్

    లాలెటెన్


    షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ మోహన్ లాల్ ను 'లాలెటన్' అని పిలిచే వారని కొరటాల శివ తెలిపారు.

    అన్నా అనగానే షాక్

    అన్నా అనగానే షాక్


    మోహన్ లాల్ గారు ఎన్టీఆర్ ను 'అన్నా' అని పిలిచేవారు అని తెలిపారు.

    షాక్

    షాక్


    మోమన్ లాల్, కొరటాల శివ ఒకరినొకరు అలా పిలుచుకోవడం చూసి నేను షాకయ్యాను అని కొరటాల శివ తెలిపారు.

    English summary
    Check out details of Koratala Shiva interview about Janatha Garage movie and NTR, Mohanlal. Janatha Garage is an upcoming 2016 Indian bilingual action film made in Telugu and Malayalam languages.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X