»   »  14 కోట్లా..?? కొరటాల కోసం రామ్ చరణ్ ఇంత చెల్లించటానికి కారణమేమిటి?

14 కోట్లా..?? కొరటాల కోసం రామ్ చరణ్ ఇంత చెల్లించటానికి కారణమేమిటి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

సినిమా ఇండస్ట్రీ లో హిట్ ఫ్లాప్ ఈ రెండే మనిషి గౌరవాన్నీ, భవిష్యత్తునీ నిర్ణయిస్తాయి. వరుసగా రెండు ఫ్లాపులొచ్చాయంటే చాలు ఇక ఆ వ్యక్తిని దగ్గరకు కూడా రానివ్వని సంఘటనలు కోకొల్లలు, అదే వరస హిట్లు కొడుతుంటే వాళ్ల ఇమేజ్ అలా పెరిగిపోతూనే ఉంటుంది. వారు కోరింది ఇవ్వడానికి అంతా సిద్ధమైపోతారు. ఈ విషయం స్టార్ హీరోలతో పాటు స్టార్ డైరెక్టర్లు సైతం బాగానే వంటబట్టించుకున్నారు. ఈ విషయం నిర్మాత కమ్ హీరో రామ్ చరణ్ తేజ్ కు రీసెంట్ గా స్పష్టంగా తెలిసొచ్చిందట..

రామ్ చరణ్, కొరటాల శివ

రామ్ చరణ్, కొరటాల శివ

సుకుమార్ సినిమా కన్నా ముందే రామ్ చరణ్, కొరటాల శివ ల కాంబినేషన్ లో సినిమా ప్రారంభమైంది. అయితే ఆ సినిమాను పక్కన పెట్టేసిన చరణ్, సుకుమార్ ప్రాజెక్ట్ ను స్టార్ట్ చేశాడు. కానీ కొరటాల శివ సినిమా ఎందుకు ఆగిపోయిందన్న విషయంలో మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు.

Watch Ram Charan Behaviour With Fans At Rangasthalam 1958 Sets
శ్రీమంతుడు తీశాడు

శ్రీమంతుడు తీశాడు

బండ్ల గణేష్ ప్రొడ్యూసర్ గా ఈ సినిమాకు అంతా సిద్ధమైనా తర్వాత మొత్తం పక్కన పెట్టేశారు. దాంతో కొరటాల శివ వేరే దారి వెతుక్కుని మహేష్ తో శ్రీమంతుడు తీశాడు. ఆ సినిమా రికార్డులు కొల్లగొట్టడం.. తర్వాత జనతా గ్యారేజ్ కూడా సూపర్ హిట్ అవడంతో కొరటాల శివ రేంజ్ పెరిగిపోయింది. అయితే తాజాగా మరోసారి కొరటాల శివతో రామ్ చరణ్ సినిమా అంటూ అధికారిక ప్రకటన వచ్చేసింది.

రామ్ చరణ్ కొరటాల శివ

రామ్ చరణ్ కొరటాల శివ

రామ్ చరణ్ కొరటాల శివతో సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు. మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్ తో కలిసి కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమా చేయబోతున్నారు. 2018 వేసవి షూటింగ్ ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారు. ఈ నేపధ్యంలో కొరటాల శివకు ఎంత రెమ్యునేషన్ ఇస్తున్నారనే విషయం అంతటా హాట్ టాపిక్ గా మారింది.

14 కోట్ల రూపాయలు

14 కోట్ల రూపాయలు

అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా నిమిత్తం 14 కోట్ల రూపాయలు కొరటాలకు చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. అసలు అనుకున్నట్టు గా అప్పుడే గనక ఆ సినిమా పట్టాలెక్కి ఉంటే కొరటాల రెమ్యున రేషన్ అంత భారీ గా ఉండేది కాదు. కానీ ఈ రెండేళ్ళ కాలం లో కొరటాల టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకడైపోయాడు. అంతేమరి ప్లానింగ్ లేటయితే రేటు పెరిగి పోతుంది....

English summary
According to the information, Ram Charan paying to Koratala Siva 14 crore for the New film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu