»   » సమంత కోసం...షూటింగ్ ఆపేసి, తడిచి ముద్దయిన ఎన్టీఆర్, కొరటాల (ఫోటోస్)

సమంత కోసం...షూటింగ్ ఆపేసి, తడిచి ముద్దయిన ఎన్టీఆర్, కొరటాల (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఎన్టీఆర్, సమంత జంటగా కొరటాల శివ దర్శకత్వంలో 'జనతా గ్యారేజ్' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతూ చివరి దశలో ఉంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ కేరళలోని చాలకుడి జలపాతం జరుగుతోంది.

జలపాతం చూడగానే ఉండటంతో సమంతకు అక్కడ తడుస్తూ ఎంజాయ్ చేయాలనే కోరిక కలిగింది. అనుకున్నదే ఆలస్యం ఈ విషయం డైరెక్టర్ కొరటాల శివతో పాటు, హీరో ఎన్టీఆర్ కు చెప్పింది. సమంత ముచ్చట పడటంతో కొరటాల శివ షూటింగ్ కొంత సేపు ఆపేసాడు. ఎన్టీఆర్, కొరటాల శివ, సమంత కలిసి జలపాతం వద్ద సరదాగా గడిపారు.

ఈ విషయాన్ని సమంత తన ట్విట్టర్ ద్వారా వెల్లడిస్తూ ఫోటో కూడా పోస్టు చేసింది. 'డైరెక్టర్ కూడా మాతో కలిసి జలపాతం వద్ద గడపడానికి ఓకే చెప్పారు. కొంత సేపు షూటింగ్ ఆపేసాం. కొరటాల శివ చాలా ఈజియోస్ట్ పర్సన్' అంటూ ప్రశంసలు గుప్పించింది సమంత.

జలపాతం వద్ద షూటింగ్ జరుగుతుంది కాబట్టి సినిమాలో సమంత, ఎన్టీఆర్ మధ్య సూపర్ హాట్ వాన పాట ఉండబోతోందని అంటున్నారు. ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాల్లో మంచి హాట్ హాట్ వాన సాంగ్స్ వచ్చి చాలా కాలం అయింది. అందుకే ఈ సినిమాలో కొరటాల శివ కిక్కెక్కించే రేంజిలో వాన పాట పెట్టారని తెలుస్తోంది. కేరళలో సాంగ్ చిత్రీకరణ తర్వాత హైదరాబాద్ వచ్చి రామానాయుడు స్టూడియోలో ఎన్టీర్, కాజల్ మీద పాట చిత్రీకరణ జరుపనున్నారు.

స్లైడ్ షోలో సమంత పోస్టు చేసిన ఫోటోస్, జనతా గ్యారేజ్ సినిమాకు సంబంధించిన వివరాలు..

సమంత, ఎన్టీఆర్, కొరటాల

సమంత, ఎన్టీఆర్, కొరటాల

జలపాతం వద్ద తడిసి ముద్దయిన సమంత, కొరటాల శివ, ఎన్టీఆర్

ఇద్దరికీ 26

ఇద్దరికీ 26

సమంతకు, ఎన్టీఆర్ కు ఇద్దరికీ ఇది 26వ సినిమా కావడం విశేషం.

వచ్చే నెలలో రిలీజ్

వచ్చే నెలలో రిలీజ్

జనతా గ్యారేజ్ సినిమాను సెప్టెంబర్ 2న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

జనతా గ్యారేజ్

జనతా గ్యారేజ్

ఎన్టీఆర్‌ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'జనతా గ్యారేజ్‌'. సమంత, నిత్యామీనన నాయికలు, మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన ఎర్నేని, మోహన, వై.రవిశంకర్‌ నిర్మిస్తున్నారు.

శాటిలైట్ రైట్ష్

శాటిలైట్ రైట్ష్

జూ ఎన్టీఆర్ స్టార్ ఇమేజ్, దర్శకుడు కొరటాల శివ స్టామినాను బేరీజు వేసి మాటీవీ వారు 'జనతా గ్యారేజ్' శాటిలైట్ రైట్స్ రూ. 12.5 కోట్లుకు కొనుగోలు చేసారట.

రెస్పాన్స్ సూపర్

రెస్పాన్స్ సూపర్

ఇప్పటికే విడుదలకు ఈ చిత్రం టీజర్‌ అత్యధిక వ్యూస్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. రెండు రోజుల్లోనే రెండు మిలియన్ వ్యూస్‌తో టాప్‌ ప్లేస్ కైవసం చేసుకుంది.

తెర వెనక

తెర వెనక

ఈ చిత్రానికి పాటలు: రామజోగయ్యశాస్త్రి, ఛాయాగ్రహణం: ఎస్‌. తిరునావుక్కరసు, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, కళ: ఎ.ఎస్‌. ప్రకాశ్, ఫైట్స్‌: అణల్‌ అరసు, రచన, దర్శకత్వం: కొరటాల శివ.

English summary
"Shoot on hold until the director agreed to get drenched with us. Easiest person in the world to bully sivakoratala" Samantha said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu