»   » ఈ సెంటిమెంట్ ఏంటి బాబూ..? ఇప్పుడు ఎన్టీఆర్ కూడా కాళ్ళు పట్టుకుంటాడా?

ఈ సెంటిమెంట్ ఏంటి బాబూ..? ఇప్పుడు ఎన్టీఆర్ కూడా కాళ్ళు పట్టుకుంటాడా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

సినిమా ఇండస్ట్రీ అంటేనే విపరీతమైన సెంటిమెంట్లూ, నమ్మకాలకు నిలయం, ఒక హీరోయిన్ కి వరుసగా రెండు ఫ్లాప్ లు పడితే "ఆమె ఐరన్ లెగ్" అనేస్తారు. కొందరు దర్శకులకి కొన్ని ప్రత్యేక సెంటిమెంట్లుంటాయి. ఒక ప్రదెశం లో ఒక షాట్ తీయటమో, లేదా ఒక ఏదైనా ప్రత్యే క సన్ని వేశాన్ని తప్పకుండా సినిమాలొ ఇరికించి అయినా పెట్టటటమో చేస్తారు.

దర్శకుడు శ్రీనూ వైట్లకి " మందు పార్టీ సీన్ లాగ అన్న మాత. ఇదే బ్యాచ్ లో ఇప్పుడు ఇంకో దర్శకుడూ చేరాడు.. 'మిర్చి', 'శ్రీమంతుడు' చిత్రాలతో వరుస విజయాలు అందుకున్న దర్శకుడు కొరటాల శివ. తన సినిమాల విషయంలో తప్పకుండా కొన్ని సెంటిమెంట్స్‌ను ఫాలో అవుతాడట. అన్నింటి మాటెలా ఉన్నా.. ఓ రెండు సెంటమెంట్స్ మాత్రం తూచ తప్పకుండా అనుసరిస్తాడట.


ntr koratala

ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాలోనూ.. ఆ రెండూ ఉండబోతున్నాయట. కొరటాల శివ ఫస్ట్ మూవీ 'మిర్చి'లో హీరోహీరోయిన్స్ ఒకరికొకరు దగ్గరయ్యే సిట్యువేషన్‌లో వచ్చే సాంగ్ లో.. అనుష్కకు నెయిల్ పాలిష్ వేస్తాడు ప్రభాస్. ఇక శ్రీమంతుడు'లోనూ ఇలాంటి సిట్యువేషనల్ సాంగ్‌లోనే శ్రుతి కాళ్లు మహేశ్‌కు తగిలి వెనక్కు లాగేస్తుంటే... మహేశ్ పర్వాలేదంటూ ఆ కాళ్లు అక్కడే ఉంచుతాడు. ఈ రెండు పాటలే కాదు.. సినిమాలు కూడా సూపర్ హిట్‌గా నిలిచాయి.


దీంతో.. దీన్నో సెంటిమెంట్‌గా భావిస్తున్న కొరటాల... 'జనతాగ్యారేజ్'లోనూ ఓ సిట్యువేషనల్ సాంగ్‌లో హీరోయిన్ సమంత కాళ్లను ఎన్టీఆర్ పట్టుకునే సీన్ పొందుపరచాడట. కాళ్లు పట్టుకునే సెంటిమెంటే కాదు... హీరో కాసేపైనా సరే.. స్టూడెంట్‌గా కన్పించే మరో సెంటిమెంట్ కూడా కొరటాల శివకు ఉందట. తన గత రెండు చిత్రాల్లోనూ ప్రభాస్, మహేశ్ ఇలాగే కాసేపు స్టూడెంట్స్‌గా కన్పించారు. అందుకేనేమో... 'జనతా గ్యారేజ్'లోనూ ఎన్టీఆర్‌ని ఐఐటి స్టూడెంట్‌గా చూపిస్తున్నాడట ఈ క్రేజీ డైరెక్టర్.

English summary
Koratala Siva To Follow Student and nail polish sentiment For NTR Janatha Garage Movie same as his before Movies mirchi with Prabhas and SrimantuDu with Mahesh babu.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu