»   » బ్లాక్‌బస్టర్‌ కాదు,షాక్ ఇచ్చిందంటూ... :‘జనతా గ్యారేజ్‌’ పై విమర్శలపై కొరటాల

బ్లాక్‌బస్టర్‌ కాదు,షాక్ ఇచ్చిందంటూ... :‘జనతా గ్యారేజ్‌’ పై విమర్శలపై కొరటాల

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ''ఆకాశాన్ని తాకే అంచనాల మధ్య విడుదలైన మా 'జనతా గ్యారేజ్‌'కి అభిమానుల్నుంచే కాకుండా... అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచీ మంచి స్పందన లభిస్తుండడం సంతృప్తినిచ్చింది'' అన్నారు కొరటాల శివ.

ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన జనతా గ్యారేజ్ గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈసినిమాకు డివైడ్ టాక్ వచ్చినా వసూళ్ల పరంగా మాత్రం సంచలనాలు నమోదు చేస్తోంది.అభిమానుల్లోనే కాదు సినీ లవర్స్ లోనూ ఎన్నో అంచనాలు రేకెత్తించిన 'జనతా గ్యారేజ్‌' విడుదలైంది. అయితే ఊహకు అందని అంచనాలను మాత్రం అందుకోలేకపోయిందనే విమర్శలు అంతటా వినిపించాయి. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా కలెక్షన్లు తగ్గుతాయన్న అనుమానం కలిగినా అలాంటిదేమి కనిపించలేదని ట్రేడ్ లో చెప్తున్నారు.


అయితే ఈ సినిమాకు దాదాపు అన్ని ప్రాంతాల్లోనుంచీ డివైడ్‌ టాక్‌ వచ్చింది. ఈ నేపథ్యంలో ఆ చిత్ర దర్శకుడు కొరటాల శివ, నిర్మాతలో కలసి మీడియా సమావేశంలో ఏర్పాటుచేసి, సినిమా పై వచ్చే విమర్శలపై వివరణలు ఇచ్చే ప్రయత్నం చేసారు.


స్లైడ్ షోలో కొరటాల ఏమన్నారు..


బ్లాక్ బస్టర్ కాదు...

బ్లాక్ బస్టర్ కాదు...

‘జనతాగ్యారేజ్‌ బ్లాక్‌బస్టర్‌ కాదు. అభిమానులకు నచ్చడం వేరు. ప్రేక్షకులకు నచ్చడం వేరు. కానీ, ఇది ఓ క్లాసిక్‌ సినిమా అని మాత్రం చెప్పగలను.


సీన్స్ బాగున్నాయంటున్నారు

సీన్స్ బాగున్నాయంటున్నారు

ఎన్టీయార్‌, మోహన్‌లాల్‌ కాంబినేషన్‌లోని అన్ని సీన్లూ బాగున్నాయని అందరూ అంటున్నారు. ఈ సినిమా అభిమానులకే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చింది'అని శివ అన్నారు.


ఇష్టపడటం లేదు

ఇష్టపడటం లేదు

'జనతా గ్యారేజ్' అన్ని వర్గాలకూ నచ్చింది. ఎన్టీఆర్, మోహన్‌లాల్ ఉన్న ఒక్క ఫ్రేమ్ మిస్సవ్వడానికి కూడా ప్రేక్షకులు ఇష్టపడడం లేదు'' అని దర్శకుడు కొరటాల శివ అన్నారు.భాధ్యత పెంచింది

భాధ్యత పెంచింది

''ఈ విజయం నాపై మరింత బాధ్యత పెంచింది. కమర్షియల్ ఫార్మాట్‌లో మంచి సందేశాత్మక చిత్రం తీశాను. భారీ అంచనాల నడుమ విడుదలైన చిత్రానికి అంతే భారీ స్పందన వస్తుందని ఊహించలేదు అన్నారు శివషాక్ అయ్యాను

షాక్ అయ్యాను

అలాగే మొదట ప్రేక్షకుల స్పందన చూసి షాకయ్యాను. మైత్రిలో సెకండ్ బ్లాక్‌బస్టర్, నాకు హ్యాట్రిక్. నిజాయితీగా చెప్పాలంటే.. నా కెరీర్‌లో బెస్ట్ మూవీ అన్నారు.ఫ్రెండ్స్ అంతా

ఫ్రెండ్స్ అంతా

ఇండస్ట్రీలో స్నేహితులు, హీరోలు, నిర్మాతలు, ప్రేక్షకులు ఫోన్ చేసి అభినందించారు. మలయాళంలో మోహన్‌లాల్‌గారి బెస్ట్ సినిమా అంటున్నారట'' అన్నారు శివ


అందుకే ఈ కథ రాసా

అందుకే ఈ కథ రాసా

పరిశ్రమలోని ప్రముఖులు కూడా తనకు ఫోన్‌ చేసి అభినందిస్తున్నారని కొరటాల తెలిపారు. ఓ మంచి సందేశం ఇద్దామన్న ఉద్ధేశంతోనే ఈ కథ రాసినట్టు చెప్పారు.


శ్రీమంతుడు కంటే బెస్ట్

శ్రీమంతుడు కంటే బెస్ట్

‘శ్రీమంతుడు' కంటే ఉత్తమమైన సినిమా తీశారని చాలామంది ఫోన్‌ చేసి చెబుతుంటే ఆనందమేసింది.


కేరళలలో

కేరళలలో

కేరళలోనూ సినిమాకి మంచి ఆదరణ లభిస్తోంది. ‘నా కెరీర్‌లో ఇదొక డబ్బింగ్‌ సినిమా అవుతుందనుకొంటే, నేరుగా చేసిన నా సినిమాల స్థాయిలో ప్రేక్షకుల్ని అలరిస్తోంద'ని మోహన్‌లాల్‌ చెప్పారు అని కొరటాల శివ అన్నారు.


క్లాసిక్

క్లాసిక్

‘‘నా బాధ్యతని మరింత పెంచిన చిత్రం ‘జనతా గ్యారేజ్‌'. నా దృష్టిలో ఇదొక క్లాసిక్‌. కొంత విరామం తీసుకొని మహేష్‌బాబు సినిమా కోసం రంగంలోకి దిగుతా'' అన్నారు.లార్జర్‌ దేన్‌ లైఫ్‌

లార్జర్‌ దేన్‌ లైఫ్‌

‘‘మొదట్నుంచీ సినిమా అంటే ఇష్టం. లార్జర్‌ దేన్‌ లైఫ్‌ తరహా సినిమాల్ని నిర్మించడమే లక్ష్యంగా మేం ప్రయాణం చేస్తున్నామ''న్నారు మైత్రీ మూవీస్‌ సంస్థ అధినేతలు నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌ (సీవీఎమ్‌).


ఒకటే రిపోర్ట్

ఒకటే రిపోర్ట్

''ప్రతి ఏరియా నుంచి ఒక్కటే రిపోర్ట్.. మూవీ బ్లాక్‌బస్టర్ అని. వసూళ్లు బాగున్నాయి. పలు ఏరియాల్లో ఫస్ట్‌డే రికార్డు నెలకొల్పింది. మార్నింగ్ డిస్ట్రిబ్యూటర్లు ఫోన్ చేశారు. అందరూ హ్యాపీ'' అని నిర్మాతలలో ఒకరైన నవీన్ చెప్పారు.


English summary
Koratala Siva came out to answer the criticism which showed up on his film Janatha Garage. He clearly stated that he wanted to give a good message coated with all the commercial elements and also said he didn’t make this film with routine filmy calculations.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more