»   » రూమర్సే...బాహుబలి డబ్బు ఏపీ రాధానికి కాదంట!

రూమర్సే...బాహుబలి డబ్బు ఏపీ రాధానికి కాదంట!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ మూవీ ‘బాహుబలి' జులై 10న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. అభిమానులు ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్, రాజమౌళి ఫ్యాన్స్ ఎంతో ఎగ్జైట్మెంటుతో ఉన్నారు. దీన్ని క్యాష్ చేసుకోవడానికి కొందరు కొందరు ప్రయత్నిస్తున్నారు కూడా.

ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రిజీయిన్లో ఇందుకు సంబంధించిన రూమర్లు వినిపిస్తున్నాయి. జులై 9న ప్రీమియర్ షోలు వేస్తున్నారని, భారీ ధరకు ఈ టికెట్లు అమ్మడం ద్వారా వచ్చే డబ్బును ఏపీ రాజధాని నిర్మాణ నిధికి అందించబోతున్నారంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్న సాయి కొర్రపాటి ఈ ప్రీమియర్ షోలు ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరిగింది.


అయితే ఈ రూమర్స్‌ను సాయి కొర్రపాటి ఖండించారు. ఆయన ఓ ఆంగ్ల ప్రతికతో మాట్లాడుతూ బాహుబలి సినిమాకు సంబంధించిన ఎలాంటి ప్రీమియర్ షోలు వేయడం లేదని, షెడ్యూల్ ప్రకారం సినిమా జులై 10న విడుదలవుతుందని తెలిపారు.


 Korrapati Sai dismissed the rumours on Baahubali

జులై 10న విడుదలవుతున్న ఈ సినిమాకు సంబంధించి టికెట్స్ అడ్వాన్డ్స్ శుక్రవారం బుకింగ్ మొదలైంది. థియేటర్ల వద్ద, ఆన్ లైన్ సైట్లలో కూడా బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. ఈ విషయం తెలిసిన వెంటనే బాహుబలి సినిమా అభిమానులు థియేటర్ల వైపు పరుగులు తీసారు. ఆన్ లైన్ సదుపాయం ఉన్నవారు ఆ దిశగా టికెట్ల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు.


అయితే టికెట్స్ ఇస్తున్న విషయం తెలిసిన వెంటనే థియేటర్ల వద్దకు భారీగా జనం చేరుకున్నారు. కొన్ని చోట్ల పోలీసులు రంగంలోకి దిగి లాఠీ చార్జి చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆన్ లైన్లో కూడా టికెట్ల కోసం పోటెత్తడంతో బుక్ మై షో, ఇతర ఆన్ లైన్ సైట్ల సర్వర్ డౌన్ అయి టికెట్స్ బుక్ కావడం లేదు. ఈ కారణాలతో టికెట్స్ కోసం ప్రయత్నించిన వారికి మొండి చేయి ఎదురు కాక తప్పలేదు. విదేశాల్లో ఇలాంటి ఇబ్బందులు లేవు. యూఎస్, కెనడా, యూకె, యూఏఇ ఇతర దేశాల్లో ముందస్తు బుకింగ్స్ సవ్యంగానే సాగుతున్నాయి. అయితే టికెట్స్ ధరే కాస్త ఎక్కువ అని అంటున్నారు.


ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్య కృష్ణ, సత్యరాజ్ తదితరులు ముఖ్య పాత్రధారులుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘బాహుబలి' సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం పార్ట్ 1 ‘బాహుబలి-ది బిగినింగ్' జులై 10న విడుదలకు సిద్ధమవుతోంది. సినిమాపై అంచనాలు భారీగా ఉన్నట్లే.... అందుకు తగిన విధంగానే సినిమా విడుదలకు ముందే ఈ సినిమా భారీగా బిజిజనెస్ చేస్తోంది.

English summary
Baahubali distributor Mr Korrapati Sai dismissed the rumours that the movie would be released a day ahead in the capital region. Speaking to DC, Mr Korrapati Sai that there are no such premier shows planned and the movie would be released as per the schedule on July 10.
Please Wait while comments are loading...