»   » పవన్ కళ్యాణ్ మాటకు నా కళ్ల నుండి నీళ్లు కారాయి: కోట

పవన్ కళ్యాణ్ మాటకు నా కళ్ల నుండి నీళ్లు కారాయి: కోట

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయం చెప్పుకొచ్చారు. ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది సక్సెస్ మీట్లో తన గురించి గౌరవంగా మాట్లాడటం గొప్పగా అనిపించిందని తెలిపారు.

'అత్తారింటికి దారేది' సినిమా సక్సెస్‌మీట్‌ హైదరాబాద్‌ శిల్పకళావేదికలో జరిగినప్పుడు దాదాపు యూనిట్‌ మొత్తం ఆ వేడుకకు హాజరయ్యాం. చాలా భారీ ఎత్తున చేశారు. ఆ వేడుకలో పవన్ కళ్యాణ్‌ అన్న మాటకు నా కళ్ల వెంట నీళ్లు కారాయి అన్నారు.

పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే

పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే

పవన్ కళ్యాన్ గారు ఆర్టిస్టులు అందరి గురించి మాట్లాడి నా వరకు వచ్చేసరికి ‘‘కోటగారు పెద్దవారు, ఆయన గురించి నేనేమని చెబుతాను? ఆయన గురించి మాట్లాడాలంటే నా వయసుగానీ, అనుభవం కానీ సరిపోదు'' అన్నారు. ఫస్ట్‌టైమ్‌ అనుకుంటా ఒక వేదిక మీద నాకు కళ్ళు చెమర్చడం. ఒక అరనిమిషం నా కళ్ళ నుంచి నీళ్ళు కారాయి అని కోట శ్రీనివాసరావు తెలిపారు.

నాకు గొప్పగా అనిపించింది

నాకు గొప్పగా అనిపించింది

అపుడు హాల్లో జనాలందరూ ‘పవర్‌స్టార్‌ పవర్‌స్టార్‌' అని కేకలు పెడుతుంటే, అంతటి క్రేజ్‌ ఉన్న నటుడు నా గురించి రెండు మాటలు గౌరవంగా చెప్పడం నాకు గొప్పగానే అనిపించింది. అదే వేదికమీద త్రివిక్రమ్‌ మాట్లాడుతూ ‘‘నాకు ఇష్టమైన నటుడు కోట శ్రీనివాసరావుగారు' అన్నారు.... అంటూ అప్పటి విషయాలను కోట గుర్తు చేసుకున్నారు.

త్రివిక్రమ్ గుర్తుండి పోయే పాత్రలిచ్చారు

త్రివిక్రమ్ గుర్తుండి పోయే పాత్రలిచ్చారు

త్రివిక్రమ్ సినిమాల్లో ఎక్కువ వేషాలు చేయకపోయినా, చేసిందే తక్కువే అయినా జీవితంలో గుర్తుండిపోయే చిత్రాలు చేశాను. ఒక ఆర్టిస్టుగా నేను చేయదగ్గ పాత్రలను త్రివిక్రమ్‌ చిత్రాల్లో చేశా. నాలోని నటుణ్ణి వెలికితీసిమరీ మంచి వేషాలిచ్చి చేయించారు త్రివిక్రమ్‌ అని కోట శ్రీనివాసరావు తెలిపారు.

అతని నిజాయతీకి ముచ్చటేసింది

అతని నిజాయతీకి ముచ్చటేసింది

సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో తనకు ముందుగా పాత్ర అనుకోలేదని త్రివిక్రమ్ చెప్పారు. కేవలం నాపై ఇష్టంతో నాకు పాత్ర పెట్టారట. అపుడు త్రివిక్రమ నాతో.... వేషం పెద్దగా ఉండదు. ఏమనుకోవద్దు' అన్నారు. అతని నిజాయతీకి ముచ్చటేసింది. ‘సన్నాఫ్‌ సత్యమూర్తి' సెట్లో ఉన్నప్పుడే నాకు పద్మశ్రీ పురస్కారం వచ్చింది. విషయం తెలిసి నిర్మాత చినబాబుగారు కేక్‌ తెప్పించారు. ఆయన చాలా సహృదయుడు. మంచి ఆర్టిస్టుని ప్రోత్సహించాలనే మనస్తత్వం ఉన్నవాడు. నేనంటే ప్రేమ ఉన్న నిర్మాతల్లో ఆయన ఒకడు అని కోట తెలిపారు.

English summary
Kota Srinivasa Rao about Pawan Kalyan and Trivikram. Check out full details. Kota Srinivasa Rao, PS is an Indian film character actor, known for his works primarily in Telugu cinema and Telugu theatre. He has also starred in few films in Tamil, Hindi and Malayalam.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu